పిక్ టాక్ : అందాల నేహా షో అదుర్స్‌

అప్పుడప్పుడు సౌత్‌ లో సందడి చేసినా కూడా బాలీవుడ్‌ కే ఈ అమ్మడు పరిమితం అయ్యింది.

Update: 2024-06-04 01:30 GMT
పిక్ టాక్ : అందాల నేహా షో అదుర్స్‌
  • whatsapp icon

కేరళలో పుట్టిన నేహా ధుపియా బాలీవుడ్‌ లో మోస్ట్‌ పాపులర్‌ స్టార్‌ నటి అయ్యింది. మొదటి సినిమా మలయాళంలో అయినా కూడా కెరీర్‌ మొత్తం కూడా హిందీ సినిమా పరిశ్రమలోనే కొనసాగింది. అప్పుడప్పుడు సౌత్‌ లో సందడి చేసినా కూడా బాలీవుడ్‌ కే ఈ అమ్మడు పరిమితం అయ్యింది.


2003 లో మిస్ ఇండియా : ది మిస్టరీ అనే హిందీ సినిమాతో బాలీవుడ్‌ లో అడుగు పెట్టిన ఈమెకి క్యా కూల్‌ హై హమ్‌, షూట్‌ అవుట్‌ లోఖండ్‌వాలా సినిమాలతో మంచి పేరును సొంతం చేసుకుని అక్కడ నుంచి దాదాపు దశాబ్ద కాలం పాటు స్టార్‌ హీరోయిన్‌ గా వెలుగు వెలిగింది.


బాలీవుడ్‌ లో ఎన్నో సినిమాల్లో ప్రత్యేక పాత్రల్లో కనిపించిన ఈ అమ్మడు ఈ మధ్య కాలంలో సినిమాల్లో కంటే ఎక్కువగా సోషల్‌ మీడియాలో మరియు బుల్లి తెరపై కనిపిస్తున్న విషయం తెల్సిందే. హీరోయిన్‌ గా నేహా ధుపియా ఎన్నో అందాల ఆరబోత పాత్రలను చేసింది.

ఇప్పుడు అంతకు మించి అన్నట్లుగా సోషల్‌ మీడియాలో సందడి చేస్తుంది. తాజాగా విభిన్నమైన బ్లాక్ అండ్ వైట్‌ ఔట్‌ ఫిట్ ధరించడంతో పాటు క్లీవేజ్ షో తో మతి పోగొడుతుంది. టాప్‌ యాంగిల్‌ ఫోటోలకు నెటిజన్స్‌ ఫిదా అవుతున్నారు.

ఈ మధ్య కాలంలో బుల్లి తెరపై ఈమె టాక్‌ షో లు సూపర్ హిట్ అయ్యాయి. దాంతో పాటు బిగ్ బాస్ లో కూడా ఈమె సందడి చేసింది. మొత్తానికి అన్ని విధాలుగా ప్రేక్షకులను అలరిస్తూ ఆకట్టుకుంటూ ఉన్న నేహా ధుపియా తాజా అందాల ఆరబోత ఫోటోలకు నెటిజన్స్‌ ఆహా అనకుండా ఉండలేక పోతున్నారట.

Tags:    

Similar News