సిల్వర్ కప్ ట్రోల్స్ పై కంగనా రియాక్షన్..!
కంగనా రనౌత్ గత కొన్ని రోజులుగా తనపై వస్తున్న ఈ ట్రోల్స్ కి స్పందించింది.
బాలీవుడ్ ఫైర్ బ్రాండ్ స్టార్ కంగనా రనౌత్ ఇటీవల జరిగిన పార్లమెంట్ సార్వత్రిక ఎన్నికల్లో పోటీ చేసి హిమాచల్ ప్రదేశ్ నుంచి లోక్సభ సభ్యురాలిగా ఎంపిక అయ్యారు. ఇటీవల ఆమె పార్లమెంట్ లో మాట్లాడిన మాటలు వైరల్ అయ్యాయి. మరో వైపు హీరోయిన్ గా కంగనా ఎమర్జెన్సీ సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. సాధారణంగా ఇతర స్టార్స్ ను లేదంటే వ్యవస్థలను విమర్శిస్తూ వార్తల్లో ఉండే కంగనా రనౌత్ ని ఈసారి సోషల్ మీడియాలో కొంత మంది తీవ్రంగా విమర్శిస్తున్నారు. అందుకు కారణం సోషల్ మీడియాలో ఆమె పాత వీడియో ఒకటి వైరల్ అవుతోంది.
ఎంత స్టార్ హీరోయిన్ గా పేరు వచ్చినప్పటికీ నేను పేదలతో ఉన్నాను, వారి కోసం పని చేస్తాను, నేను ఎప్పుడూ కూడా విలాసవంతమైన జీవితం ను అనుభవించలేదు అంటూ ఎన్నికల సమయంలో చాలా సార్లు మాట్లాడింది. తాజా వీడియో లో కంగనా సిల్వర్ కప్ లో నీళ్లు తాగుతూ ఉన్నట్లు ఉంది. దాంతో ఆమెను చాలా మంది విమర్శిస్తూ ఉన్నారు. మంచి నీళ్లు తాగేందుకే మీరు వెండి కప్ ను వినియోగిస్తున్నారు. మీరు సాధారణ జీవితం సాగించింది ఎక్కడ అంటూ చాలా మంది వీడియోను షేర్ చేస్తూ ట్రోల్స్ చేస్తున్నారు.
కంగనా రనౌత్ గత కొన్ని రోజులుగా తనపై వస్తున్న ఈ ట్రోల్స్ కి స్పందించింది. వెండి కప్పు లో నీళ్లు తాగడం అనేది పెద్ద తప్పుగా ఎందుకు భావిస్తున్నారు అంటూ ఆమె అసహనం వ్యక్తం చేసింది. వెండి కప్పు లో నీళ్లు తాగడం అనేది ఆరోగ్య రీత్యా చాలా మంచిది. అనేక రోగాలు వెండి కప్పులో నిల్వ ఉన్న నీళ్లు తాగడం వల్ల దూరం అవుతాయి అని, శరీరంలో ఉన్న విషపూరిత పదార్థాలు పూర్తిగా బయటకు వెళ్లి పోతాయి అంటూ కంగనా చెప్పుకొచ్చారు. వెండి కప్పుల్లో నీళ్లు తాగడం అనేది ఆరోగ్యానికి మంచిదని అమ్మ చెప్పడం వల్ల తాను ఆ నీటిని తాకుతున్నట్లుగా చెప్పుకొచ్చింది.
ఎమర్జెన్సీ సినిమా తో కంగనా బాలీవుడ్ లో సంచలనం సృష్టించబోతున్నట్లుగా కంగనా అభిమానులు చాలా నమ్మకంగా ఉన్నారు. స్వీయ దర్శకత్వంలో ఎమర్జెన్సీ సినిమాను రూపొందిస్తున్న కంగనా చాలా అంచనాలను ఆ సినిమా పై పెట్టుకుంది. ఈ మధ్య కాలంలో కంగనా చేసిన ఏ సినిమా కూడా బాక్సాఫీస్ వద్ద పెద్దగా ప్రభావం చూపించలేదు. దాంతో ఈ సినిమాపై ఆమె ఎక్కువ శ్రద్ధ పెట్టినట్లు తెలుస్తోంది. అందుకే కంగనా ఎమర్జెన్సీ సినిమా ఎప్పుడో షూటింగ్ పూర్తి అవ్వాల్సి ఉన్నా కూడా ఆలస్యం అవుతూ వచ్చింది.