ఆమె ప్రయాణానికి @ 50 ఏళ్లు!
నా 50 ఏళ్ల ప్రయాణాన్ని అక్కడ వేడుకలోచేయడం చాలా ఆనందాన్నిస్తుంది' అని అన్నారు.
బాలీవుడ్ లెజెండరీ నటి షబానా అజ్మీ గురించి పరిచయం అవసరం లేదు. ఐదు దశాబ్ధాల సినీ ప్రయాణంలో ఎన్నో వైవిథ్యమైన పాత్రలతో ప్రేక్షకుల్లో చెరగని ముద్ర వేసారు. 1974 లో 'అంకుర్' సినిమాతో నటిగా పరిచ యమైన షబానా నేటికి అదే నటిగా కొనసాగుతున్నారు. వెండి తెరతో పాటు బుల్లి తెరపైనా తనదైన మార్క్ వేసారు. చివరికి షార్ట్ ఫిలింస్ లో సైతం నటించిన నటిగా తన ఫ్యాషన్ నిరూపించుకున్నారు. తాజాగా భారతీయ పరిశ్రమకు సేవలందించినందుకు..50 ఏళ్ల ప్రయాణం దిగ్విజయంగా పూర్తి చేసుకున్నందుకు న్యూయార్క్ ఇండియన్ ఫిల్మ్ పెస్టివల్ ఓ వేడుక నిర్వహించనుంది.
వచ్చే నెలలో ఈ కార్యక్రమంలో అమెరికాలో జరగుతుంది. ఈ కార్యక్రమంలో షబానా నటించిన 'ఫైర్' చిత్రాన్ని ప్రదర్శించనున్నట్లు కమిటీ ప్రకటించింది. దీపా మెహతా ఈ చిత్రానికి దర్శకత్వం వహించారు. ఈ సందర్భంగా షబానా స్పందించారు. 'న్యూయార్క్ ఫిల్మ్ పెస్టివల్ తో నాకెంతో మంచి అనుబంధం ఉంది. కొన్ని సంవత్సరాలుగా ఎన్ వై ఐ ఎఫ్ ఎఫ్ సాధించిన పురోగతి చూస్తుంటే ఎంతో సంతోషంగా ఉంది. నా 50 ఏళ్ల ప్రయాణాన్ని అక్కడ వేడుకలోచేయడం చాలా ఆనందాన్నిస్తుంది' అని అన్నారు.
షబానా అజ్మి చివరిగా గతేడాది రిలీజ్ అయిన 'ఘూమర్' లో నటించారు.షబానీ ఇప్పటికే ఎన్నో అవార్డు లు..రివార్డులు అందుకున్నారు. నేషనల్ అవార్డులు..సివీలియన్ అవార్డులు..ఫిలింఫేర్ ..ఇంటర్నేషనల్ అవార్డులెన్నో అందుకున్నారు. వివిధ యూనివర్శిటీల నుంచి గౌరవ డాక్టరేట్ లు అందుకున్నారు. తాజాగా న్యూయార్క్ లో జరిగే ఈవెంట్ తో మరోసారి షబానా పేరు అంతర్జాతీయంగా మారిమ్రోగిపోతుంది.
ఎన్ వై ఐఎప్ ఎష్ కి సంబంధించి ఇది 24వ ఎడిషన్. మే 31 నుండి జూన్ 2 వరకు కొనసాగుతుంది. అమితాబ్ బచ్చన్ -నసీరుద్దీన్ షాలతో సహా సినీరంగంలోని మరికొంత మంది ప్రముఖులు నటించిన చిత్రాలు.. డాక్యుమెంటరీలు -షార్ట్ ఫిల్మ్‌లను కూడా ప్రదర్శిస్తారు. ప్రత్యేకంగా షబానా సేవల్ని హైలైట్ చేయనున్నారు.అందుకే దీపా మెహతా దర్శకత్వం వహించిన 'ఫైర్' చిత్రంపై ప్రత్యేకంగా దృష్టి పెట్టారు.