డైపర్ డ్యూటీ ఎక్కేసిన నిఖిల్!
పాపాయిలకు డైపర్ లు వేయాలంటే మమ్మీనే ఉండాలా? డాడీ ఆ పనిచేయకూడదా? అంటూ యంగ్ హీరో నిఖిల్ ముందుకొచ్చేసాడు
పాపాయిలకు డైపర్ లు వేయాలంటే మమ్మీనే ఉండాలా? డాడీ ఆ పనిచేయకూడదా? అంటూ యంగ్ హీరో నిఖిల్ ముందుకొచ్చేసాడు. నిఖిల్ త్వరలో తండ్రి కాబోతున్న సంగతి తెలిసిందే. ఆయన సతీమణి పల్లవి మామ్ కాబోతుందంటూ విషయాన్ని అభిమానులకు షేర్ చేసి కొత్త ఉత్సాహాన్ని నింపాడు. తాజాగా నిఖిల్ అప్పుడే డైపర్ లు వేయడం ప్రాక్టీస్ కూడా మొదలు పెట్టేసాడు. భార్య పల్లవితో కలిసి చిన్నారికి డైపర్ ఎలా తొడగాలో తెలుపుతూ ఓ వీడియో చేసాడు.
అందులో ఓ చిన్న బొమ్మకి డైపర్ వేస్తున్నట్లు నిఖిల్ కనిపిస్తున్నాడు. పక్కనే పల్లవి కూడా ఉంది. నిఖిల్ డైపర్ వేయడం చూసి పల్లవి తెగ నవ్వేస్తుంది. ఈ వీడియోని ఉద్దేశించి ఓ క్యాప్షన్ కూడా ఇచ్చాడండోయ్. బేబి రాబోతుంది. డైపర్ డ్యూటీ నేర్చుకుంటున్నా' అని రాసుకొచ్చాడు. దీనికి సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ అవుతుంది. అభిమానులు అప్పుడే నిఖిల్ డ్యూటీ ఎక్కేసాడా? అంటూ సరదా కామెంట్లు పోస్టు చేస్తున్నారు.
తొందరెందుకు బేబి రావడనాకి ఇంకొంచెం సమయం పడుతుంది. వచ్చిన దగ్గర నుంచి దగ్గరుండి చూసుకోవాల్సిన అన్నీ బాధ్యతలు నీవే...డైపర్లే కాదు..చిన్నారి ముడ్డి కూడా కడగాలోయ్! అంటూ ఓ అభిమాని పోస్ట్ చేసాడు. అంతేగా చిన్న వయసులోనే తల్లిదండ్రుల అన్ని రకాల ముచ్చట్లు తీర్చుకునేది. పెరిగి..పెద్దైన తర్వా ఆ ముచ్చటకి ఛాన్స్ ఉండదు. నిఖిల్ ఆ విషయాన్ని ముందే గమనించాడు. తండ్రి కాబోతున్న ఉత్సాహంలో భార్యకి అన్ని రకాలు సహకారం అందిస్తున్నాడు.
ఇక నిఖిల్ హీరోగా 'స్వయంభు' చిత్రం తెరకెక్కుతోన్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఆ సినిమా షూటింగ్ దశలో ఉంది. ఇందులో నిఖిల్ యుద్ద వీరుడిగా కనిపించనున్నాడు. ఇప్పటికే రిలీజ్ అయిన ఫస్ట్ లుక్..గ్లింప్స్ అన్ని సినిమాపై భారీ అంచనాలు పెంచేస్తున్నాయి. భరత్ కృష్ణమాచారి అనే కొత్త దర్శకుడు తెరకెక్కిస్తున్నాడు.