నితిన్ బాక్సాఫీస్.. 6 నుంచి ఒకటికి!

టాలీవుడ్ లో టైర్ 2 హీరోలలో ఒకడిగా తనకంటూ ఒక ఇమేజ్ ని నితిన్ బిల్డ్ చేసుకున్నాడు. అయితే నితిన్ కెరియర్ లో సక్సెస్ లు కంటే ఫెయిల్యూర్స్ ఎక్కువ అని చెప్పాలి.

Update: 2023-12-10 14:30 GMT

టాలీవుడ్ లో టైర్ 2 హీరోలలో ఒకడిగా తనకంటూ ఒక ఇమేజ్ ని నితిన్ బిల్డ్ చేసుకున్నాడు. అయితే నితిన్ కెరియర్ లో సక్సెస్ లు కంటే ఫెయిల్యూర్స్ ఎక్కువ అని చెప్పాలి. కెరియర్ ఆరంభంలో మాస్ యాక్షన్ సినిమాలు చేయడం వలన డిజాస్టర్స్ ఎక్కువ వచ్చాయి. మరల ఇష్క్ సినిమా సినిమాతో కెరియర్ గాడిలో పడింది. తరువాత కూడా స్టొరీ సెలక్షన్స్ విషయంలో నితిన్ రాంగ్ స్టెప్స్ కారణంగా ఫ్లాప్ లు వచ్చాయి.

రొమాంటిక్ కామెడీ అండ్ యాక్షన్ కథలతోనే నితిన్ ఎక్కువ సక్సెస్ అందుకున్నాడు. మాస్ మంత్రం జపించిన ప్రతిసారి ఫెయిల్ అవుతూ వచ్చారు. అయితే మార్కెట్ పరంగా తన బ్రాండ్ పెంచుకుంటూ వెళ్ళిన నితిన్ కెరియర్ లో హైయెస్ట్ ఓపెనింగ్స్ భీష్మ సినిమాతో సొంతం చేసుకున్నారు. ఈ సినిమా ఏకంగా 6.42 కోట్లు కలెక్ట్ చేసింది. తరువాత వచ్చిన సినిమాలు ఓపెనింగ్ కలెక్షన్స్ డ్రాప్ అయ్యాయి.

రంగ్ దే, మాచర్ల నియోజకవర్గం సినిమాలు సెకండ్ హైయెస్ట్ ఓపెనింగ్స్ సాధించాయి. ఈ సినిమాలు 4.62 కోట్లు ఫస్ట్ డే కలెక్ట్ చేశాయి. చెక్ మూవీ ప్రయోగాత్మక సినిమా కావడంతో ఓపెనింగ్ కలెక్షన్స్ 3.38 కోట్లు మాత్రమే వచ్చాయి. అయితే ఎక్స్ట్రార్డినరీ మెన్ సినిమాపై మంచి బజ్ క్రియేట్ అయ్యింది. ట్రైలర్ కూడా బాగానే రీచ్ అయ్యింది.

ఈ నేపథ్యంలో భీష్మ స్థాయిలో కాకపోయిన సెకండ్ హైయెస్ట్ ఓపెనింగ్ కలెక్షన్స్ అందుకుంటుందని అంచనా వేశారు. దానికి విరుద్ధంగా కేవలం 1.51 కోట్ల గ్రాస్ మాత్రమే కలెక్ట్ చేసింది. ఓ విధంగా నితిన్ కెరియర్ చూసుకుంటే అతి తక్కువ ఓపెనింగ్ డే కలెక్షన్స్ ఈ సినిమా సాధించింది. వీటిని చూసిన తర్వాత 6 కోట్ల ఓపెనింగ్ నుంచి ఏకంగా కోటిన్నరకి నితిన్ ఇమేజ్ పడిపోయిందా అనే డౌట్ ని సినీ విశ్లేషకులు వ్యక్తం చేస్తున్నారు.

మంచి బజ్ క్రియేట్ చేసిన, ప్రమోషన్స్ స్ట్రాంగ్ గా చేసిన కూడా ఎక్స్ట్రార్డినరీ మెన్ సినిమాకి ఎందుకు ఇంత తక్కువ ఓపెనింగ్స్ వచ్చాయో అర్ధం కాక కన్ఫ్యూజ్ అవుతున్నారు. సినిమాకి కూడా పర్వాలేదనే టాక్ వచ్చింది. కానీ కలెక్షన్స్ మాత్రం ప్రభావం చూపించలేదు. హాయ్ నాన్న సినిమా పరిస్థితి కూడా ఇంచు మించు ఇలాగే ఉంది. పాజిటివ్ టాక్ వచ్చిన ఈ సినిమాకి చెప్పుకోదగ్గ కలెక్షన్స్ రావడం లేదు. మరి ఈ ఎఫెక్ట్ ఎందుకనేది లెక్కలు వేసుకొని నిర్మాతలు సినిమాలు రిలీజ్ ప్లాన్ చేసుకోవాల్సిన అవసరం ఉందని సినీ విశ్లేషకులు అభిప్రాయ పడుతున్నారు.

Tags:    

Similar News