బాహుబ‌లి గురించి ఇప్పుడెవ‌రూ మాట్లాడ‌లేదేం!

అద్భుత‌మైన ఎమోష‌న్ పండించి జ‌క్క‌న్న అంటే ఇది అని నిరూపించారు.

Update: 2024-07-18 09:30 GMT

రాజ‌మౌళి తెర‌కెక్కించిన 'బాహుబ‌లి' ప్రాంచైజీ ఎలాంటి విజ‌యం సాధించిందో తెలిసిందే. తొలిసారి తెలుగు నుంచి ఓ హాలీవుడ్ రేంజ్ మూవీ తీసి షెభాష్ అనిపించారు. భార‌తీయ చ‌ల‌న చిత్ర ప‌రిశ్ర‌మ‌లోనే భారీ వ‌సూళ్లు సాధించి చిత్రాల స‌ర‌స‌న బాహుబ‌లి నిలిచింది. టెక్నిక‌ల్ గా ఆ సినిమా ఎంతో హైస్టాం డ‌ర్స్డ్ తో తీసి విమర్శ‌కుల ప్ర‌శంసలు అందుకున్నారు. అద్భుత‌మైన ఎమోష‌న్ పండించి జ‌క్క‌న్న అంటే ఇది అని నిరూపించారు.

ఈ సినిమా గురించి 'ఆర్ ఆర్ ఆర్' రిలీజ్ వ‌ర‌కూ జ‌నం మాట్లాడు కున్నారు. ఇలాంటి సినిమాలు ఆయ‌న మాత్ర‌మే తీయ‌గ‌ల‌ర‌ని డిస్క‌స్ చేసుకున్నారు. ఇక 'క‌ల్కి 2898' రిలీజ్ త‌ర్వాత రాజ‌మౌళి స్థానంలో నాగ్ అశ్విన్ చేరాడు. అస‌లైన హాలీవుడ్ మూవీ అంటే ఇది...సిస‌లైన క్రియేటివిటీ అంటే ఇది అంటూ అత‌డిని ఆకాశానికి ఎత్త‌డం మొద‌లైంది. రానున్న రోజుల్లో రాజ‌మౌళినే నాగీ బీట్ చేసేస్తాడ‌ని ప్రేక్ష‌కులు మాట్లాడు కుంటున్నారు. అయితే ఈ మొత్తం సినారేని...ప్ర‌త్యేకంగా బాహుబ‌లిని ఉద్దేశించి సీనియ‌ర్ న‌టుడు కోట శ్రీనివాస‌రావు ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు చేసారు. అవి ఏంటో ఆయన మాట‌ల్లోనే...'

'కాలం ఎప్పుడూ ఒకేలా ఉంది. మారింది కాలం కాదు. మనం. మాట్లాడితే జనరేషన్ మార్పు అంటాం .. అంతా ఒట్టిదే. టెక్నికల్ గా ఇప్పటి తెలుగు సినిమా దూసుకుపోయిందని అంటున్నారు. వేరే ఉద్దేశంతో అనడం కాదు . ఉన్న విషయం చెబుతున్నాను. బాహుబలి .. బాహుబలి అన్నారు .. ఆరు నెలల ముందు నుంచి దాని కోసం ఎదురు చూశారు. అందుకు తగినట్టుగానే అది ప్రపంచ ఖ్యాతి పొందింది.

దర్శకుడితో పాటు అందరికీ పేరు వచ్చింది. కాదని నేను అనడం లేదు. కానీ ఇప్పుడు ఎవరైనా చెప్పుకుంటున్నారా? అంత గొప్ప సినిమా కదా .. ఎవరూ చెప్పుకోరేం? అదే ఓల్డ్ 'మాయా బజార్ ' గురించైతే ఆరేళ్ల పిల్లల దగ్గర నుంచి 60 ఏళ్ల ముసలాళ్లవరకూ వెళ్లి చూస్తారు. అల్లు రామలింగయ్య గారు, వంగర సుబ్బయ్య గారి సీన్లో తివాచీ చుట్టుకోవడం , కర్ర నడిచి వెళ్లడం , చెప్పులు నడిచి వెళ్లడం ఉంటుంది. అవ‌న్నీ ఎంతో క్రియేటి విటీతో అద్బుతంగా తీసిన షాట్లు. అవే షాట్స్ ఇప్పుడు కూడా తీయ‌గ‌ల‌రు. కానీ కోట్లు ఖర్చుపెడతారు` అని అన్నారు.

Tags:    

Similar News