తారక్ కటౌట్ దగ్ధం.. ఏం జరిగింది?
టాలీవుడ్ స్టార్ హీరో జూనియర్ ఎన్టీఆర్ లేటెస్ట్ మూవీ దేవర పార్ట్ -1 ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్ గా నేడు విడుదల అయిన విషయం తెలిసిందే.
టాలీవుడ్ స్టార్ హీరో జూనియర్ ఎన్టీఆర్ లేటెస్ట్ మూవీ దేవర పార్ట్ -1 ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్ గా నేడు విడుదల అయిన విషయం తెలిసిందే. జనతా గ్యారేజ్ తర్వాత మరోసారి మాస్ డైరెక్టర్ కొరటాల శివతో తారక్ వర్క్ చేశారు. యాక్షన్ ఎంటర్టైనర్ గా తెరకెక్కిన దేవర మూవీలో బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్ హీరోయిన్ గా నటించింది. సైఫ్ అలీఖాన్ విలన్ గా కనిపించారు. పాన్ ఇండియా లెవెల్ లో భారీ అంచనాల నడుమ రిలీజైన మూవీ.. మంచి రెస్పాన్స్ అందుకుంటోంది.
అయితే ఆరేళ్ల తర్వాత తారక్ సోలోగా యాక్ట్ చేసిన మూవీ రిలీజ్ అవ్వడంతో ఆయన ఫ్యాన్స్ పండుగ చేసుకుంటున్నారు. సినిమా విడుదల అయిన అన్ని సెంటర్లలో ఓ రేంజ్ లో సందడి చేస్తున్నారు. పెద్ద పెద్ద కటౌట్లు, బ్యానర్లు ఏర్పాటు చేసి అభిమానాన్ని చాటుకున్నారు. పాలాభిషేకం చేస్తూ.. హారతులు ఇస్తూ వేరే లెవెల్ లో రచ్చ చేస్తున్నారు. సిల్వర్ స్క్రీన్ పై తారక్ ను చూసి ఊగిపోతున్నారు.
అదే సమయంలో హైదరాబాద్ ఆర్టీసీ క్రాస్ రోడ్స్ లో ఉన్న ఫేమస్ సుదర్శన్ థియేటర్ వద్ద స్వల్ప అపశ్రుతి చోటు చేసుకుంది. థియేటర్ బయటపెట్టిన ఎన్టీఆర్ భారీ కటౌట్ అగ్ని ప్రమాదం కారణంగా దగ్ధమైంది. ఘటనకు సంబంధించిన కారణం తెలియక పోయినా ఒక్కొక్కరు ఒక్కో విధంగా చెబుతున్నారు. టపాసులు కాల్చడంతో నిప్పురవ్వలు ఎగసి కటౌట్ మీద పడటంతో కాలిపోయినట్లు కొందరు అంటున్నారు.
ఇంకొందరు గుర్తుతెలియని వారు నిప్పు పెట్టారని ఆరోపిస్తున్నారు. భారీ కటౌట్ కావడం వల్ల ఒక్కసారిగా మంటలు అంటుకున్నాయని చెబుతున్నారు. వెంటనే ఫైర్ సిబ్బంది వచ్చి మంటలు ఆర్పినట్టు తెలుస్తోంది. ఎవరికీ ఎలాంటి ప్రమాదం జరగలేదని సమాచారం. ప్రస్తుతం కటౌట్ దగ్దమవుతున్న దృశ్యాలు.. సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.
ఇక సినిమాలో.. దేవర, వర రెండు పాత్రల్లో ఎన్టీఆర్ ఒదిగిపోయారని ఫ్యాన్స్ చెబుతున్నారు. వేరియేషన్, డైలాగ్ డెలివరీ సూపర్ అని అంటున్నారు. యాక్షన్ ఎపిసోడ్స్ అదిరిపోయే ట్రీట్ లా ఉన్నాయని కొనియాడుతున్నారు. 1996 వరల్డ్ కప్ బ్యాక్ డ్రాప్ లో కథను మొదలుపెట్టడం ఆసక్తికరంగా అనిపిస్తుందని చెబుతున్నారు. ఓవరాల్ గా మాస్ జాతరలా మూవీ ఉందని నెట్టింట పోస్టులు పెడుతున్నారు.