ఎన్టీఆర్ మెగా హీరోతో పోటీనా?

ఎన్టీఆర్, రామ్ చరణ్ కలిసి ఆర్ఆర్ఆర్ సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ ని సొంతం చేసుకున్నారు.

Update: 2024-02-07 04:42 GMT

ఎన్టీఆర్, రామ్ చరణ్ కలిసి ఆర్ఆర్ఆర్ సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ ని సొంతం చేసుకున్నారు. తరువాత తారక్ లాంగ్ గ్యాప్ తీసుకొని దేవర మూవీ చేస్తున్నాడు. ఈ మూవీ షూటింగ్ దశలో ఉంది. రామ్ చరణ్ ఆచార్య సినిమాతో వచ్చిన అది డిజాస్టర్ అయ్యింది. ఇప్పుడు గేమ్ చేంజర్ ని శంకర్ దర్శకత్వంలో చేస్తున్నాడు. ఈ సినిమా మీద చాలా హోప్స్ ఉన్నాయి. ఈ రెండు కూడా పాన్ ఇండియా లెవల్ లో భారీ బడ్జెట్ తో తెరకెక్కుతోన్న సినిమాలే కావడం విశేషం.

కొరటాల శివ దర్శకత్వంలో ఆచార్య మూవీతో రామ్ చరణ్ ఫ్లాప్ సొంతం చేసుకున్నాడు. అదే కొరటాల ఇప్పుడు తారక్ కి దేవర మూవీ ఇవ్వబోతున్నాడు. ఈ సినిమాని గ్రాండియర్ గా సిల్వర్ స్క్రీన్ పై ఆవిష్కరిస్తున్నారు. కంప్లీట్ యాక్షన్ బ్యాక్ డ్రాప్ కథతోనే ఈ మూవీ వస్తోంది. తారక్ కి జోడీగా ఈ చిత్రంలో జాన్వీ కపూర్ నటిస్తోంది. సైఫ్ అలీఖాన్ విలన్ గా కనిపించబోతున్నాడు. భారీ తారాగణంతో మూవీ ఉండబోతోంది. \

నిజానికి దేవర చిత్రాన్ని ఏప్రిల్ 5న రిలీజ్ చేయాలని అనుకున్న వీలు పడటం లేదు. షూటింగ్ ఇంకా కంప్లీట్ కాలేదు. దీంతో పోస్ట్ ఫోన్ తప్పడం లేదు. ఇక శంకర్ ఇండియన్ 2 మూవీ ఆగష్టులో రిలీజ్ కానుంది. దానికోసం గేమ్ చేంజర్ రిలీజ్ వెనక్కి తీసుకెళ్లారు. ఇప్పటి వరకైతే అఫీషియల్ గా గేమ్ చేంజర్ రిలీజ్ డేట్ కన్ఫర్మ్ చేయలేదు. అయితే ఈ ఏడాది సెప్టెంబర్ లో మంచి రిలీజ్ డేట్ చూద్దామనుకుంటే ఆ టైంలో OG మూవీ రాబోతోంది.

ఆగష్టు 15న అల్లు అర్జున్ పుష్ప థియేటర్స్ లోకి రానుంది. ఇక ఈ ఇద్దరికి ఉన్నది దసరా మాత్రమే. ఆ టైంలో ఇతర పెద్ద సినిమాలు ఏవీ కూడా రిలీజ్ డేట్ ఎనౌన్స్ చేయలేదు. కాబట్టి దసరా ఫెస్టివల్ టైంని కరెక్ట్ గా ఉపయోగించుకునే ఛాన్స్ దేవర, గేమ్ చేంజర్ కి ఉంది. రెండు ఒకేసారి వస్తే మాత్రం గట్టి పోటీ ఉండే ఛాన్స్ ఉంది

దీని తర్వాత డిసెంబర్ లో క్రిస్మస్ సీజన్ లో రిలీజ్ కి ఛాన్స్ దొరుకుతుంది. అది మిస్ అయితే సంక్రాంతి ఛాన్స్ మాత్రం ఉండదు. వచ్చే ఏడాది వేసవి సీజన్ వరకు ఎదురుచూడాల్సిందే. రెండు సినిమాలు కూడా ఈ ఏడాదిలోనే రిలీజ్ కానున్న నేపథ్యంలో ఒకటి దసరా సీజన్, మరొకటి క్రిస్మస్ ని వినియోగించుకుంటాయా, లేదంటే ఒకేసారి పోటీ పడతాయా అనేది వేచి చూడాలి.





 


Tags:    

Similar News