వార్ 2.. సడన్ బ్రేక్!

యంగ్ టైగర్ ఎన్టీఆర్ నుంచి రాబోయే దేవర సినిమా కోసం ఫ్యాన్స్ ఎగ్జైటింగ్ గా ఎదురుచూస్తున్న విషయం తెలిసిందే.

Update: 2024-08-21 10:03 GMT

యంగ్ టైగర్ ఎన్టీఆర్ నుంచి రాబోయే దేవర సినిమా కోసం ఫ్యాన్స్ ఎగ్జైటింగ్ గా ఎదురుచూస్తున్న విషయం తెలిసిందే. కచ్చితంగా ఈ సినిమా ఎన్టీఆర్ కెరియర్ లోనే బెస్ట్ మూవీ అవుతుందని భావిస్తున్నారు. కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న ఈ సినిమా కోసం టాలీవుడ్ ఇండస్ట్రీ కూడా వేయి కళ్ళతో ఎదురుచూస్తోంది. కల్కి 2898ఏడీ తర్వాత మరో 1000 కోట్ల కలెక్షన్స్ ని టాలీవుడ్ ఇండస్ట్రీ దేవరతో ఎక్స్ పెక్ట్ చేస్తోంది.

అదే జరిగితే నిర్మాతలతో పాటు డిస్టిబ్యూటర్స్, బయ్యర్లు, థియేటర్స్ యజమానులు అందరూ కూడా ఆర్ధికంగా కోలుకుంటారు. సెప్టెంబర్ 27న ఈ మూవీ వరల్డ్ వైడ్ గా పాన్ ఇండియా లెవల్ లో రిలీజ్ కాబోతోంది. ఇప్పటికే మూవీ నుంచి వచ్చిన సాంగ్స్, గ్లింప్స్ కి పాజిటివ్ రెస్పాన్స్ వచ్చింది. రీసెంట్ గా తారక్, ప్రశాంత్ నీల్ కాంబినేషన్ లో తెరకెక్కనున్న డ్రాగన్ మూవీ లాంచ్ అయ్యింది. మరో వైపు హిందీలో వార్2 షూటింగ్ లో కూడా జూనియర్ ఎన్టీఆర్ పాల్గొనాల్సి ఉంది.

అయితే కొద్ది రోజుల క్రితం జిమ్ లో వర్క్ అవుట్స్ చేస్తున్న సమయంలో ఎన్టీఆర్ చేతికి గాయం అయ్యింది. ఈ గాయం చిన్నదే అని త్వరలో తారక్ కోలుకుంటారని ఆయన పీఆర్ టీమ్ పేర్కొంది. అయితే తాజాగా అందుతున్న సమాచారం మేరకు జూనియర్ ఎన్టీఆర్ ని డాక్టర్లు 4 నుంచి 6 వారాలపాటు విశ్రాంతి తీసుకోవాలని సూచించారంట. ఎలాంటి షూటింగ్స్ లో పాల్గొనకూడదని జూనియర్ ఎన్టీఆర్ కి చెప్పారంట. తారక్ కూడా విశ్రాంతి తీసుకోవడానికి మొగ్గు చూపించారంట.

అందుకే వార్ 2 షూటింగ్ లో తారక్ జాయిన్ అవ్వాల్సి ఉన్న కొంత సమయం వారిని అడిగినట్లు ప్రచారం నడుస్తోంది. తాజాగా ఆయ్ సినిమా యూనిట్ ని ఎన్టీఆర్ ప్రశంసించారు. ఈ సందర్భంగా ఆయన చేతికి బ్యాండేజ్ తోనే కనిపించారు. అయితే త్వరలో ప్రారంభం కాబోయే దేవర మూవీ ప్రమోషన్స్ లో మాత్రం జూనియర్ ఎన్టీఆర్ పాల్గొంటారంట.

ఈ నెల ఆఖరు నుంచి దేవర మూవీ ప్రమోషన్స్ అగ్రెసివ్ గా స్టార్ట్ అయ్యే అవకాశాలు ఉన్నాయనే మాట వినిపిస్తోంది. దేవర మూవీ రిలీజ్ తర్వాత డ్రాగన్ మూవీ షూటింగ్ స్టార్ట్ అవ్వొచ్చనే ప్రచారం నడుస్తోంది. అలాగే వార్ 2 షూటింగ్ లో కూడా తారక్ అక్టోబర్ లోనే పాల్గొనే ఛాన్స్ ఉందని ఇండస్ట్రీ వర్గాలలో టాక్ వినిపిస్తోంది.

Tags:    

Similar News