అందరి ఫోకస్ ఈ సినిమాపైనే.. ఏమవుతుందో..

దీంతో ఇప్పుడు అందరి దృష్టి యంగ్ హీరో సందీప్ కిషన్ ఊరు పేరు భైరవకోనపై పడింది.

Update: 2024-02-12 04:55 GMT
అందరి ఫోకస్ ఈ సినిమాపైనే.. ఏమవుతుందో..
  • whatsapp icon

ఈ ఏడాది సంక్రాంతికి టాలీవుడ్ బాక్సాఫీస్ వద్ద టఫ్ ఫైట్ ఉంటుందని అంతా భావించినా అలా ఏం జరగలేదు. నాలుగు తెలుగు స్ట్రయిట్ సినిమాలు రిలీజవ్వగా.. ప్రశాంత్ వర్మ- తేజ సజ్జా కాంబోలో తెరకెక్కిన హనుమాన్ విజేతగా నిలిచింది. పెద్ద ఎత్తున లాభాలు సాధించింది. ఇప్పటికీ కొన్ని చోట్ల సక్సెస్ ఫుల్ గా రన్ అవుతోంది. కింగ్ నాగార్జున ఎప్పటిలానే సంక్రాంతికి వచ్చి నా సామిరంగాతో మంచి వసూళ్లు సాధించారు.

ఇక మహేశ్ బాబు నటించిన గుంటూరు కారం మూవీ మిక్స్ డ్ టాక్ సంపాదించినా.. టాక్ తో అస్సలు సంబంధం లేకుండా రూ.250 కోట్లకు పైగా వసూళ్లను రాబట్టింది. విక్టరీ వెంకటేష్ నటించిన సైంధవ్ చిత్రం మాత్రం డిజాస్టర్ గా మిగిలింది. అయితే సంక్రాంతి తర్వాత రెండు వారాల్లో కొత్త సినిమాల ఊసే లేదు. హనుమాన్ తన హవాతో దూసుకుపోయింది.. ఇప్పటికీ దూసుకుపోతోంది.

జనవరి అలా గడిచింది.. ఇక ఫిబ్రవరి ఫస్ట్ వీక్ లో అనేక కొత్త సినిమాలు ప్రేక్షకుల ముందుకు వచ్చాయి. వాటిలో కలర్ ఫొటో ఫేమ్ సుహాస్ నటించిన అంబాజీపేట మ్యారేజ్ బ్యాండు సినిమా మాత్రమే ఆకట్టుకుంది. మిగతా చిన్న చిత్రాలన్నీ అలరించలేదు. ఇప్పుడు రెండో వారంలో మూవీ లవర్స్ ముందుకు నాలుగు చిత్రాలు వచ్చాయి. అందులో రెండు స్ట్రైయిట్ సినిమాలు కాగా.. రెండు డబ్బింగ్ మూవీలు వచ్చాయి.

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ సీఎం వైఎస్ రాజశేఖరరెడ్డి బయోపిక్ యాత్రకు సీక్వెల్ గా రూపొందిన యాత్ర-2 ఇటీవలే రిలీజైంది. ప్రస్తుత ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి బయోపిక్ గా ఈ మూవీ తెరకెక్కింది. తొలి రోజు ఈ సినిమా మంచి వసూళ్లు రాబట్టినా.. రెండో రోజు కలెక్షన్లు బాగా తగ్గిపోయాయి. తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్ క్యామియో రోల్ లో నటించిన లాల్ సలామ్ డిజాస్టర్ టాక్ అందుకుంది. ముందు నుంచి ఎలాంట్ సౌండ్ లేని ఈ మూవీకి రెస్పాన్స్ కూడా అలానే ఉంది.

బ్లాక్ బస్టర్ మూవీ బేబీ మేకర్స్ రిలీజ్ చేసిన డబ్బింగ్ సినిమా ట్రూ లవర్ పర్వాలేదనిపించింది. కానీ వసూళ్లు అంతంతమాత్రమే. ఇక మాస్ మహారాజా రవితేజ నటించిన ఈగల్ మూవీ డీసెంట్ టాక్ దక్కించుకుంది. రెండు రోజులకు గాను రూ.10 కోట్లకు పైగా వసూళ్లను సాధించింది. వీకెండ్ లో ఈ సినిమా కలెక్షన్లు పెరిగే అవకాశం ఉందని ట్రేడ్ పండితులు చెబుతున్నారు. మిగతా మూడు సినిమాలకు వచ్చిన టాక్.. ఈ మూవీకి ప్లస్ పాయింట్ అయింది.

అయితే వీకెండ్ అయిపోయాక బాక్సాఫీస్ వద్ద ఈగల్ తప్ప మిగతా సినిమాల సందడి కనపడదు. దీంతో ఇప్పుడు అందరి దృష్టి యంగ్ హీరో సందీప్ కిషన్ ఊరు పేరు భైరవకోనపై పడింది. ఇప్పటికే మంచి బజ్ క్రియేట్ చేసుకున్న ఈ సినిమా.. ఫిబ్రవరి 16న రిలీజ్ కానుంది. అవుట్ పుట్ పై నమ్మకంతో రెండు రోజుల ముందు నుంచే ప్రీమియర్స్ వేస్తున్నారు మేకర్స్. మరి ఈ మూవీ రిజల్ట్ ఎలా ఉంటుందో చూడాలి.


Tags:    

Similar News