భైరవకోన ఆలస్యం.. అదీ సంగతి
కొన్నిసార్లు ఒక పాటే సినిమాకు మంచి హైప్ తీసుకొచ్చేస్తుంటుంది. ఊరి పేరు భైరవకోన అనే సినిమాలోని నిజమే నే చెబుతున్నా పాట కూడా ఈ కోవకు చెందిందే
కొన్నిసార్లు ఒక పాటే సినిమాకు మంచి హైప్ తీసుకొచ్చేస్తుంటుంది. ఊరి పేరు భైరవకోన అనే సినిమాలోని నిజమే నే చెబుతున్నా పాట కూడా ఈ కోవకు చెందిందే. సందీప్ కిషన్, వర్ష బొల్లమ్మ జంటగా నటించిన ఈ సినిమాకు ఈ పాటే మంచి బజ్ తీసుకొచ్చింది. ఆరు నెలల కిందట విడుదలైన ఈ పాట ఇప్పటిదాకా ఏకంగా 54 మిలియన్ల వ్యూస్ తెచ్చుకోవడం విశేషం. సిద్ శ్రీరామ్ ఆలపించిన ఈ పాటను శేఖర్ చంద్ర కంపోజ్ చేశాడు.
ఇక ఈ సినిమా తీసిన దర్శకుడు వీఐ ఆనంద్.. ఎక్కడికి పోతావు చిన్నవాడా మూవీతో సెన్సేషన్ క్రియేట్ చేసిన సంగతి తెలిసిందే. సందీప్‌తోనూ అతను టైగర్ అనే హిట్ మూవీ ఇచ్చాడు. ఇలాంటి కాంబినేషన్లో తెరకెక్కుతున్న సినిమా, పైగా పాట బ్లాక్‌బస్టర్ కావడంతో సినిమాపై అంచనాలు పెరిగాయి. కానీ ఎంతకీ ఈ సినిమా రిలీజ్ డేట్ ఇవ్వట్లేదు. తొలి పాట రిలీజ్ చేశాక అసలు అప్‌డేట్ అన్నదే లేదు. సందీప్ కిషన్ కెరీర్‌కు కీలకమైన ఈ సినిమా గురించి ఏ సమాచారం లేకపోవడంపై తన అభిమానుల్లో నిరాశ వ్యక్తమవుతోంది.
ఈ విషయమై సోషల్ మీడియాలో కొంచెం చర్చ జరుగుతోంది. విరూపాక్ష మూవీతో పోలికులుండటం వల్లే స్క్రిప్టులో మార్పులు చేసి రీషూట్లు చేస్తున్నారనే రూమర్లు కూడా వినిపించాయి. దీంతో చిత్ర దర్శక నిర్మాతలు స్పందించారు. విరూపాక్షతో తమ సినిమాకు పోలికేమీ లేదని వీఐ ఆనంద్ స్పష్టం చేశాడు. జానర్ ఒక్కటైనంత మాత్రాన కథలు ఒకలా ఉండవని అతనన్నాడు. పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లో ఆలస్యం వల్లే సినిమా రిలీజ్ లేటవుతోందని ఆనంద్ తెలిపాడు. నిర్మాత అనిల్ సుంకర మాట్లాడుతూ.. తమ సంస్థలో కొన్ని కాస్ట్లీ మిస్టేక్‌లు జరిగాయని.. అలాంటివి రిపీట్ కాకుండా చూసుకునేందుకే ఈ సినిమా పోస్ట్ ప్రొడక్షన్, క్వాలిటీ విషయంలో జాగ్రత్త పడుతున్నామన్నారు. త్వరలోనే సినిమా నుంచి సెకండ్ సింగిల్ రిలీజ్ చేయబోతున్నట్లు అనిల్ అప్‌డేట్ ఇచ్చారు.