3 నెలల్లో 2500 కోట్లు నష్టపోయిన OTT
తాజా సమాచారం మేరకు డిస్నీ ప్లస్ ప్రపంచవ్యాప్తంగా భారీ నష్టాలను చవి చూస్తున్నా డిస్నీ ప్లస్ హాట్ స్టార్ భారతదేశంలో రాణిస్తోందని సమాచారం అందింది.
అమెజాన్ ప్రైమ్, నెట్ ఫ్లిక్స్, డిస్నీ ప్లస్ హాట్ స్టార్ సహా పలు కార్పొరెట్ ఓటీటీల నడుమ భారీ కాంపిటీషన్ నెలకొన్న సంగతి తెలిసిందే. ప్రజలు స్మార్ట్ కంటెంట్ వీక్షణకు అలవాటు పడుతుండడంతో భారీ పెట్టుబడులను కుమ్మరిస్తూ ఓటీటీ కంపెనీలు పోటీకి తెర తీసాయి. అయితే ఈ పోటీలో ఆరంభం నష్టాలను చవి చూడాల్సి వస్తోంది. చాలా ఓటీటీలు నష్టాల లెక్కలను బయటకు చూపక పోయినా కానీ, నిజం దాగడం లేదు.
తాజా సమాచారం మేరకు డిస్నీ ప్లస్ ప్రపంచవ్యాప్తంగా భారీ నష్టాలను చవి చూస్తున్నా డిస్నీ ప్లస్ హాట్ స్టార్ భారతదేశంలో రాణిస్తోందని సమాచారం అందింది. తాజాగా విడుదలైన డిస్నీ ప్లస్ ఓటీటీ త్రైమాసిక నివేదిక షాకిస్తోంది. డిస్నీ ప్లస్ కి 300 మిలియన్ అమెరికన్ డాలర్ల నష్టాలను చవి చూసిందని రిపోర్ట్ అందింది. అంటే ఈ మొత్తం విలువ భారతీయ కరెన్సీలో రూ.24,87కోట్లు. ఫిబ్రవరి నాటికి.. డిస్నీ + 2023 చివరి త్రైమాసికంలో 1.3 మిలియన్ల కంటే ఎక్కువ మంది సభ్యులను కోల్పోయింది. ఫలితంగా అక్టోబర్ - డిసెంబర్ 2023లో 300 మిలియన్ డాలర్లు నష్టపోయింది. అంతర్జాతీయ గణాంకాలివి.
అమెరికా, కెనడా సహా చాలా చోట్ల సబ్ స్క్రైబర్ల తిరోగమణం సదరు ఓటీటీకి షాకిచ్చింది. అయితే డిస్నీ + చందాదారులను కోల్పోవడానికి సబ్‌స్క్రిప్షన్ ధరలో పెరుగుదల ప్రధాన కారణం. 2023 చివరి త్రైమాసికంలో గ్లోబల్ సబ్‌స్క్రైబర్‌లు 112.6 మిలియన్ల నుండి 111.3 మిలియన్లకు పడిపోయారు.
అయితే దీనికి భిన్నంగా డిస్నీ ప్లస్ హాట్ స్టార్ భారతదేశంలో స్థానికంగా రాణిస్తోంది. డిస్నీ ప్లస్ హాట్‌స్టార్ సబ్‌స్క్రైబర్లు ఈ సంవత్సరం చివరి త్రైమాసికంలో 7 లక్షల మంది పెరిగారు. డిస్నీ+ .. డిసెంబర్‌లో హులు కంటెంట్‌ని దాని ప్లాట్‌ఫారమ్‌లో ఏకీకృతం చేయడం ప్రారంభించింది. ఇంటిగ్రేటెడ్ వెర్షన్ ఈ ఏడాది మార్చిలో విడుదల కానుంది. IPL స్ట్రీమింగ్ హక్కులను జియో సినిమాకి కోల్పోయిన తర్వాత డిస్నీ ప్లస్ హాట్ స్టార్ భారీగా నష్టపోయింది. భారతదేశంలో డిస్నీ ప్లస్ హాట్‌స్టార్ మంచి పనితీరును కనబరుస్తుండడం కొంతలో కొంత ఊరట.