ఫ్యాన్ క్లబ్‌ల ఫేక్ ప్రచారంపై పారీ సీరియస్
బాలీవుడ్ నటి పరిణీతి చోప్రా ఇటీవలే 'ఆప్' నాయకుడు రాఘవ్ చద్దాను పెళ్లాడిన సంగతి తెలిసిందే. పెళ్లి తరవాత పారీ ఎందుకనో పూర్తి స్తబ్ధుగా ఉంది
బాలీవుడ్ నటి పరిణీతి చోప్రా ఇటీవలే 'ఆప్' నాయకుడు రాఘవ్ చద్దాను పెళ్లాడిన సంగతి తెలిసిందే. పెళ్లి తరవాత పారీ ఎందుకనో పూర్తి స్తబ్ధుగా ఉంది. అప్పుడప్పుడు రాఘవ్ చద్దాతో, అతడి కుటుంబంతో కలిసి ఉన్న కొన్ని ఫోటోలను పరిణీతి షేర్ చేస్తోంది. సోషల్ మీడియాల్లో ఇవి వైరల్ గా మారుతున్నాయి.
అయితే ఇంతలోనే ఫ్యాన్స్ తనను ఓ వివాదంలోకి లాగారు. కొన్ని ఫ్యాన్స్ క్లబ్‌ల ద్వారా ఫేక్ స్టేట్‌మెంట్లను సర్క్యులేట్ చేయడంపై పారీ తాజాగా అసంతృప్తిని వ్యక్తం చేసింది. వారాంతంలో బిగ్ బాస్ 17లో కంటెస్టెంట్ అయిన తన కజిన్ మన్నారా చోప్రాకు పరిణీతి తన మద్దతు తెలిపిందని అనేక ఫ్యాన్ క్లబ్‌లు తప్పుగా క్లెయిమ్ చేశాయి. ప్రియాంక చోప్రా ముందుగా మన్నారాకు తన మద్దతును తెలియజేసినప్పటికీ పరిణీతికి ఆపాదించిన తప్పుదోవ పట్టించే ప్రకటనలు ప్రచారంలోకి వచ్చాయి. సల్మాన్ ఖాన్ హోస్ట్ చేసిన బిగ్ బాస్ షోలో మన్నారాకు పెరుగుతున్న పాపులారిటీ అంటూ ఫేక్ కోట్ లు పారీ అకౌంట్ లో ప్రత్యక్షమయ్యాయి. అయితే పరిణీతి తప్పుడు స్టేట్‌మెంట్‌లను సమర్థించనని అన్నారు. రికార్డును సరిదిద్దడానికి నవంబర్ 25 న తన ఇన్‌స్టాగ్రామ్ స్టోరీస్ లో వివరణను ఇచ్చింది.
తన ఇన్‌స్టాగ్రామ్ స్టోరీలో తప్పుడు సమాచారాన్ని వ్యాప్తి చేస్తున్న అభిమానుల క్లబ్‌లు, వ్యక్తులకు పరిణీతి ఎట్టకేలకు కఠినమైన హెచ్చరిక జారీ చేసింది. తాను ఇటీవల ఎలాంటి ఇంటర్వ్యూలు ఇవ్వలేదని, ఆర్టిస్టులకు మద్దతుగా, అభినందిస్తూ ప్రకటనలు చేయలేదని స్పష్టం చేసింది. పారీ సందేశం ఇలా ఉంది, ''నా పేరును ఉపయోగించి అభిమానుల క్లబ్‌లు తమ కళాకారులకు అనుకూలంగా కోట్‌లు వేయడం చూస్తున్నాను. ఇవి నకిలీవి. నేను ఎవరి గురించిన ఇంటర్వ్యూలు కోట్‌లు ఇవ్వలేదు. వారిని అభినందించడం లాంటివి చేయలేదు. నేను చూస్తున్నాను.. ఇలాంటివి ఏవైనా మీకు తెలియజేస్తాను. అలాగే - ముందుగా మీరు వాస్తవాలను తనిఖీ చేసుకోండి! చిన్న గూగ్లింగ్ ఎవరినీ బాధించదు (స్మైల్ ఎమోజి).. అని పారీ రాసారు.
కెరీర్ మ్యాటర్ కి వస్తే.. పరిణీతి ఇటీవలి కాలంలో అక్షయ్ కుమార్‌తో కలిసి 'మిషన్ రాణిగంజ్: ది గ్రేట్ భారత్ రెస్క్యూ'లో కనిపించింది. అమర్ సింగ్ చమ్కిలా బయోపిక్ .. క్యాప్సూల్ అనే చిత్రంలోను నటిస్తోంది.