అందాల పరిణీతి చోప్రా పెళ్లి తేదీ ఫిక్స్
2023 మేలో రాఘవ్ చద్దాతో అందాల కథానాయిక పరిణీతి చోప్రా నిశ్చితార్థం జరిగిన సంగతి తెలిసిందే.
2023 మేలో రాఘవ్ చద్దాతో అందాల కథానాయిక పరిణీతి చోప్రా నిశ్చితార్థం జరిగిన సంగతి తెలిసిందే. తాజా సమాచారం మేరకుఈ జంట వివాహ తేదీ సహా వేదికను లాక్ చేసినట్లు సమాచారం. నిజానికి ఈ జంట ఈ ఏడాది చివర్లో వివాహం చేసుకోబోతున్నట్లు వార్తలు వచ్చాయి. ఆ వార్తలు ఇప్పుడు నిజమవుతున్నాయి. పరిణీతి సోదరి ప్రియాంక చోప్రా మాదిరిగానే ఈ జంట రాజస్థాన్‌లో డెస్టినేషన్ వెడ్డింగ్‌ను ప్లాన్ చేస్తున్నట్లు కూడా పుకారు వచ్చింది. కానీ ఇది ఇంకా కన్ఫామ్ కావాల్సి ఉంది.
పరిణీతి - రాఘవ జోడీ సెప్టెంబర్ 25 తేదీని లాక్ చేశారని, పెళ్లికి ప్రిపరేషన్ ప్రారంభమైందని ఒక సోర్స్ బాంబే టైమ్స్‌కి తెలిపింది. ఇతర సెలబ్రిటీ వెడ్డింగ్స్ తరహాలోనే ఈ పెళ్లి కూడా గ్రాండ్ వెడ్డింగ్ అవుతుంది. ఇంకా ఇతర వేడుకల గురించి పరిణీతి పెదవి విప్పలేదు. పారీ కుటుంబ సభ్యులు ఇప్పటికే అతిథుల జాబితాను తయారు చేసారు. పెళ్లి తేదీతో కార్డులను రెడీ చేయించే పనిలో ఉన్నారు. సెప్టెంబరు మొదటి వారంలో ఆమె తన వివాహ సన్నాహాల్లోకి పరిణీతి ప్రవేశిస్తుంది`` అని సన్నిహిత వ్యక్తి ఒకరు పేర్కొన్నారు.
ఈ పెళ్లి రాజస్థాన్‌లో జరుగుతుందని, అయితే రిసెప్షన్‌ను గురుగ్రామ్‌లో నిర్వహిస్తారని కూడా అతడు పేర్కొన్నారు. గత నెలలో ఈ జంట తల్లిదండ్రులు పవన్ చోప్రా-రీనా చోప్రా సహా సునీల్ చద్దా-అల్కా చద్దా ఇప్పటికే గురుగ్రామ్‌లోని హోటళ్లలో ఆహారాన్ని రుచి చూశారని కథనాలొచ్చాయి. ఈ జంట జోధ్‌పూర్‌లోని ఉమైద్ భవన్ ప్యాలెస్‌ను తమ వివాహ వేదికగా పరిశీలిస్తున్నట్లు కూడా కథనాలొస్తున్నాయి. ప్రియాంక-నిక్ జోనాస్ 2018లో వివాహం చేసుకున్న ఈ చోటును పరిణీతి కుటుంబం ఎంపిక చేసుకుందని కూడా గుసగుసలు వినిపిస్తున్నాయి.
తన నిశ్చితార్థ వేడుక తర్వాత రాఘవ్‌తో ఒకటికి మించి బ్రేక్‌ఫాస్ట్ డేట్లకు ఆస్కారం కలగలేదని పారీ ఇంతకుముందు పేర్కొంది. AAP నాయకుడు రాఘవ్ చద్దా హాస్యం, చమత్కారం, ప్రశాంతమైన వ్యక్తిత్వం తనకు ఎంతో నచ్చుతాయని తెలిపింది. తన నిశ్చితార్థానికి సంబంధించిన ఫోటోలను ఇంతకుముందు షేర్ చేసి తన కల నిజమవుతోందని అభివర్ణించింది.