చియాన్ కోసం నెల‌లు కేటాయించాలన్న న‌టి

ఉల్లోజుక్కు (అండర్ కరెంట్)లో మీ నటనకు ఇండియన్ ఫిల్మ్ ఫెస్టివల్ ఆఫ్ మెల్‌బోర్న్‌లో ఉత్తమ నటి అవార్డును గెలుచుకున్నారు.

Update: 2024-08-22 03:23 GMT

పార్వతి తిరువోతు ఇటీవలే 15వ ఇండియన్ ఫిల్మ్ ఫెస్టివల్ ఆఫ్ మెల్‌బోర్న్ (IFFM) 2024లో ప్రతిష్టాత్మకమైన ఉత్తమ నటి అవార్డును అందుకుంది. పింక్‌విల్లాకి ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూలో 'ఉల్లోజుక్కు' దర్శకుడు క్రిస్టో టోమీతో ప‌ని అనుభ‌వం గురించి తెలిపింది.

ఉల్లోజుక్కు (అండర్ కరెంట్)లో మీ నటనకు ఇండియన్ ఫిల్మ్ ఫెస్టివల్ ఆఫ్ మెల్‌బోర్న్‌లో ఉత్తమ నటి అవార్డును గెలుచుకున్నారు. ఎమోషనల్‌ పాత్రలో జీవించాల్సి ఉంటుంది. దీని కోసం సిద్ధమవుతున్నప్పుడు మీరు ఏవైనా సవాళ్లను ఎదుర్కొంటున్నారా? అని ప్ర‌శ్నించ‌గా.. నేను సాధారణంగా ఎంపిక చేసుకున్న ప్రతి నాటకీయ పాత్రను చాలా చక్కగా చేస్తాను. ప్రతి స్క్రీన్‌ప్లేతో ప్రక్రియ మారుతుందని నేను గుర్తించాను. ప్రతి దర్శకుడితో ప్రక్రియ మారుతుంది. వారు పాత్రను ఎలా ఊహించుకోవాలనుకుంటున్నారో దాని పరంగా ఫలితం మారుతుంది.

అయినప్పటికీ అండర్‌కరెంట్ గా సవాల్ తో ఉంటుంది. ద‌ర్శ‌కుడు క్రిస్టోకు అలాంటి సహకార స్ఫూర్తి ఉంది. ఆయ‌న పాత్ర‌ల‌ను రాసే విధానం టెక్నిక్ గొప్ప‌వి అని తెలిపింది.

తంగళన్‌లో చియాన్ విక్రమ్, పా రంజిత్‌లతో కలిసి పనిచేసారు. చిత్రీకరణ సమయంలో మీరు వారి నుండి ఏమి నేర్చుకున్నారు? అన్న ప్ర‌శ్న‌కు పార్వ‌తి ఇలా జ‌వాబిచ్చింది. ``వారి నుంచి నేర్చుకునేందుకు కొన్ని నెలలు, సంవత్సరాలు పడుతుంది. విక్రమ్‌తో నా అనుభవం.. అతడు ఒక నటుడిగా, తన సహనటులు, త‌న‌ దర్శకులతో ఎంత ఉదారంగా ఉంటారో అవ‌గాహ‌న క‌లిగింది. ఒక పాత్ర కోసం సిద్ధం కావడానికి అత‌డు ఎంత డెప్త్ గా వెళ‌తారో చూసాను. పిచ్చి న‌ట‌న‌ అతనికి తెలుసు. నేను వ్యక్తిగతంగా అత‌డిని అభిమానిస్తాను. విక్రమ్ నాకంటే చాలా సీనియర్..తంగ‌ళ‌న్ కోసం చాలా అద్భుతమైన, క్రిటికల్ వర్క్ చేశాడు. కానీ మేము పాత్రలుగా జీవించాము. ఒక‌రికొక‌రం సహకార స్ఫూర్తి పరంగా ఇది అద్భుతమైనది. అత‌డు వ్యక్తిగా స‌హ‌క‌రించ‌కపోతే నా న‌ట‌న‌ అంత అద్భుతంగా ఉండేది కాదు`` అని తెలిపారు.

మలయాళ సినిమా ప్రస్తుత ట్రెండ్స్‌పై మీ ఆలోచనలు ఏమిటి? మునుముందు కొన్నేళ్లలో అది ఎక్కడికి వెళుతుందో మీరు చూస్తున్నారు క‌దా? అన్న ప్ర‌శ్న‌కు... పార్వ‌తి స‌మాధాన‌మిచ్చారు. ఈ సంవత్సరాన్ని ఆటమ్‌తో ప్రారంభించాం. అది ఇప్పుడు ఉత్తమ చలనచిత్రంగా జాతీయ అవార్డును గెలుచుకుంది. సినిమా ఏ దిశలో వెళ్తుందనే దాని గురించి చాలా చెప్పుకోవాలి. ఆటం, భ్ర‌మయుగం, మంజుమ్మెల్ బాయ్స్, ఊళ్ళోజుక్కు మొదలుకొని ఆవేశం వరకు క‌థ‌ల్లో స్పెక్ట్రమ్ విస్తరించింది.

మన మార్గంలో మ‌నం దూసుకుపోవడానికి హోరిజోన్ విస్తృతంగా ఓపెనై ఉంది. మ‌నం ఇంకా చాలా వైవిధ్యమైన జానర్‌లను సృష్టిస్తామని, బాక్సాఫీస్ విజయాల‌తో ధైర్యంగా ఉన్నామని నేను భావిస్తున్నాను. ఇంకా చాలా సవాళ్లను ఎదుర్కొనేందుకు అవ‌కాశం ఉంది. మలయాళ సినిమా ఇప్పటికే స‌రిహద్దులు దాటుతుందని ఆశిస్తున్నాను. మునుపటి కంటే కొంచెం ఎక్కువ దూరం ప్ర‌యాణిస్తోంది. ఇంకా ఎక్కువ మంది మహిళలు సినిమాలు తీయడంలో అలాగే రాయడంలోనూ ముందుంటారని ఆశిస్తున్నాను... అని తెలిపింది.

Tags:    

Similar News