డీసీఎం ప‌వ‌న్ క‌ళ్యాణ్‌ తెలంగాణ‌కి కోటి విరాళం

ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్య‌మంత్రి పవన్ కల్యాణ్ తెలంగాణ వరద బాధితులకు అండ‌గా నిలిచారు.

Update: 2024-09-04 09:44 GMT

ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్య‌మంత్రి పవన్ కల్యాణ్ తెలంగాణ వరద బాధితులకు అండ‌గా నిలిచారు. తెలంగాణ సీఎం రిలీప్ ఫండ్‌కు కోటి రూపాయలు విరాళంగా ప్రకటించారు. త్వరలోనే కోటి రూపాయల చెక్‌ను తెలంగాణ సీఎంకు అందజేయబోతున్నట్టు వెల్లడించారు. దీంతో తెలంగాణ‌లో ప‌వ‌న్ అభిమానులు హ‌ర్షం వ్య‌క్తం చేస్తున్నారు. ఆప‌త్కాలంలో ప‌వ‌న్ క‌ళ్యాణ అండ‌గా నిల‌బ‌డ్డార‌ని సోష‌ల్ మీడియా వేదిక‌గా పోస్టులు పెడుతున్నారు.

ఇప్ప‌టికే ప‌వ‌న్ క‌ళ్యాణ్ ఏపీకి కూడా భారీగా విరాళం ప్ర‌క‌టించిన సంగ‌తి తెలిసిందే. అలాగే ఏపీలోని 400 గ్రామ పంచాయతీల్లో పారిశుద్ధ్య నిర్వహణకు తనవంతుగా లక్ష రూపాయల చొప్పున అందజేస్తానని ప్రకటించారు.

పంచాయతీ రాజ్‌ ఉద్యోగులు, ఇంజినీర్లు విరాళం ప్రకటించడం పట్ల అభినందించారు. 2014-19లో వచ్చిన హుదాహుద్‌ తుఫాన్‌ ప్రభావం వల్ల నష్టపోయిన బాధితులకు రూ. 50 లక్షలు ఇచ్చినట్లు గుర్తు చేశారు. ఏపీలో వరదల వల్ల 29 మంది ప్రాణాలు కోల్పోయ్యారని, ఇద్దరు గల్లంతయ్యారని, 200 పశువులు , వేల సంఖ్యలో కోళ్లు చనిపోయాయని తెలిపారు.

అలాగే 131 కేంద్రాల్లో పశువులకు చికిత్స కేంద్రాలు ఏర్పాటు చేశామని వివరించారు. రాష్ట్రవ్యాప్తంగా లక్షా 69 వేల హెక్టార్లలో పంట నష్టం జరిగిందని తెలిపారు. 233 కిలోమీటర్ల పంచాయతీ రోడ్లు దెబ్బతిన్నాయని అన్నారు. వరద ఉదృతి తగ్గిన తరువాత రోడ్లు, కల్వర్ట్లు బాగు చేస్తామన్నారు.

Tags:    

Similar News