క్రికెట్ బ్యాట్ ప‌ట్టిన ప‌వ‌ర్ స్టార్!

ప‌వ‌న్ క‌ళ్యాణ్ కి క్రికెట్ ఆడ‌టం వ‌చ్చా? లేదా? అన్న‌ది తెలియ‌దు గానీ తాజాగా ఆయ‌న బ్యాట్ తో ఫోజు ఇవ్వ‌డం చూసి అభిమానులు సైతం స‌ర్ ప్రైజ్ అవుతున్నారు.

Update: 2024-10-10 06:39 GMT

సీసీఎల్ వ‌చ్చిందంటే? సెల‌బ్రిటీలంతా గ్రౌండ్ లో క‌నిపిస్తుంటారు. చిరంజీవి, బాల‌కృష్ణ, వెంక‌టేష్ నుంచి నేటి జ‌న‌రేష‌న్ హీరోల వ‌ర‌కూ అంతా క్రికెట్ ఆడుతుంటారు. ఒక‌వేళ ఆడ‌క‌పోయినా? మ‌ద్ద‌తివ్వ‌డం కోసం ప్రాంగ‌ణంలో క‌నిపిస్తుంటారు. సీసీఎల్ మ్యాచ్ లు ...ఫండ్ రెయిజింగ్ మ్యాచ్ ల్లో సౌత్..నార్త్ స్టార్త్ అంతా క‌లిసి ఆడుతుంటారు. అందులోనూ ఆ మ్యాచ్ లు ఎక్కువ‌గా ఏపీలో జ‌రుగుతుంటాయి.


కానీ ప‌వ‌ర్ స్టార్ ప‌వ‌న్ క‌ళ్యాణ్ మాత్రం ఇలాంటి ఆట‌ల్లో పాల్గొంది లేదు. ఎప్పుడూ ఆయ‌న చేతిలో బ్యాట్ చూసింది లేదు. న‌టుడిగా ఉన్నంత కాలం సినిమాలు చేయ‌డం త‌ప్ప‌! ఆయ‌న ఇలాంటి ఈవెంట్ల‌కు ఎప్పుడూ దూరంగానే ఉండేవారు. మ‌రి ప‌వ‌న్ క‌ళ్యాణ్ కి క్రికెట్ ఆడ‌టం వ‌చ్చా? లేదా? అన్న‌ది తెలియ‌దు గానీ తాజాగా ఆయ‌న బ్యాట్ తో ఫోజు ఇవ్వ‌డం చూసి అభిమానులు సైతం స‌ర్ ప్రైజ్ అవుతున్నారు.


ప్ర‌స్తుతం ఆ ఫోటో నెట్టింట వైర‌ల్ అవుతుంది. బ్యాట్ తో ఫోజు ఇచ్చిన స‌మ‌యంలో ప‌వ‌న్ స్పోర్స్ట్ దుస్తుల్లో లేరు. తెలుపు రంగు నాయ‌కుడి దుస్తుల్లోనే ఉన్నారు. మ‌రి ఈ ఫోజు దేనికి అంటే వివ‌రాల్లోకి వెళ్లాల్సిందే. ప్ర‌స్తుతం ప‌వ‌న్ క‌ళ్యాణ్ ఏపీ డిప్యూటీ సీఎంగా కూడా బాధ్య‌త‌ల్లో కొన‌సాగుతోన్న సంగ‌తి తెలిసిందే. పిఠాపురం నుంచి ఆయ‌న ఈసారి ఎన్నికల్లో ఎమ్మెల్యేగా గెలిచారు.


ఈనేప‌థ్యంలో నియోజ‌క వ‌ర్గంలోని స్కూళ్ల‌కు కిట్స్ పంపిణీ కార్య‌క్ర‌మం చేప‌ట్టారు. దీనిలో భాగంగా ఆ కిట్లను ప‌వ‌న్ స్వ‌యంగా ప‌ర్య‌వేక్షిస్తున్నారు. వాటి నాణ్య‌త ఎలా ఉంది అని స్వ‌యంగా చెక్ చేస్తున్నారు. దీనిలో భాగంగానే ఇలా బ్యాట్ తో ఫోజులిచ్చారు. `పిఠాపురం నియోజకవర్గంలోని 32 ప్రాథమిక ఉన్నత పాఠశాలాల్లో చదువుతున్న విద్యార్థులకు, క్రీడల్లో ప్రోత్సాహం అందించేలా ప్రతి పాఠశాలకు రెండేసి చొప్పున, క్రీడా సామాగ్రి కిట్లు అందించాలని ఉప‌ముఖ్య‌మంత్రి ప‌వ‌న్ క‌ళ్యాణ్ నిర్ణ‌యం తీసుకున్నారు.


Tags:    

Similar News