పవన్​ యూటర్న్​.. మహేశ్​తో పోటీకి రెడీ!

అయితే ఇప్పుడీ సంక్రాంతి రేసులోకి పవన్​ కల్యాణ్​ 'ఉస్తాద్​ భగత్ సింగ్' ఎంట్రీ అయ్యేట్టు కనిపిస్తోంది.

Update: 2023-08-02 14:17 GMT

ప్రస్తుతం దసరా సీజన్​ కోసం సినిమాలు శరవేగంగా ముస్తాబవుతున్నాయి. అలాగే వచ్చే సంక్రాంతి కోసం కూడా కొన్ని చిత్రాలు రెడీ అవుతున్నాయి. అసలే సంక్రాంతి సినిమాలంటే బాక్సాఫీస్‌ వద్ద అదిరిపోయేలా భలే సందడి ఉంటుంది. అయితే ఇప్పుడీ సంక్రాంతి రేసులోకి పవన్​ కల్యాణ్​ 'ఉస్తాద్​ భగత్ సింగ్' ఎంట్రీ అయ్యేట్టు కనిపిస్తోంది.

అదేంటి సినిమా ఆగిపోయిందన్నారు కదా? మళ్లీ ఈ ట్విస్ట్ ఏంటని అనుకుంటున్నారా? అవును మీరు చదివింది నిజమే. ప్రస్తుతం ఇండిస్ట్రీలో ఇదే విషయం వినిపిస్తోంది. పవన్ పొలిటికల్​గా బిజీగా అవ్వడంతో ఆ మధ్య ఉస్తాద్ భగత్ సింగ్ సినిమా చిత్రీకరణ నిలిచిపోయిందనే టాక్ బాగా వినిపించింది.

అయితే తాజాగా.. ఎలక్షన్స్​కు ముందే ఈ చిత్రాన్ని పూర్తి చేస్తానని హరీశ్​కు పవన్ మాటిచ్చారని తెలుస్తోంది.

హరీశ్​ శంకర్ ఎలక్షన్స్​కు ముందే ఈ చిత్రాన్ని ఎలాగైనా పూర్తి చేయాలని పట్టుదలతో కూర్చున్నారట. అందుకే ఆయన ఈ మధ్య పవన్​ను​ కలిసి ఈ మాట గురించి మాట్లాడారట. దీంతో పవన్​.. 30 రోజుల్లో తన పాత్రను సంబంధించిన షూటింగ్​ను కంప్లీట్ చేయగలిగితేనే.. డేట్స్ ఇస్తానని చెప్పారట. హరీశ్​ కూడా.. పక్కా ప్లాన్​తో స్క్రిప్ట్ రెడీ చేసి తీసుకొస్తానని సమాధానం చెప్పారట. అలా ఇద్దరు కలిసి ఈ ఏడాదే షూటింగ్ పూర్తి చేసి వచ్చే ఏడాది సంక్రాంతికి చిత్రాన్ని రిలీజ్ చేయాలనే ప్లాన్ చేశారట.

ఇక ఈ విషయం తెలుసుకుంటున్న పవన్ కల్యాణ్ ఫ్యాన్స్ ఫుల్ ఖుషీ అవుతున్నారు. ఒకవేళ ఉస్తాద్​ నిజంగానే సంక్రాంతి రేసులోకి వస్తే సినీ ప్రియులకు ఫుల్ కిక్ ఉంటుంది. ఎందుకంటే ఈ సంక్రాంతి రేసులో సూపర్ స్టార్ మహేశ్​బాబు కూడా ఉన్నారు. ఆయన గుంటూరు కారం ఈ పండక్కే సిద్ధమవుతోంది. అలా వీరిద్దరూ ఒకేసారి బాక్సాఫీస్​ బరిలోకి దిగితే ఫ్యాన్స్​కు మాములుగా ఉండదు. ఇక డబుల్​ ట్రీటే.

ఇంకా ఈ రెండు చిత్రాలతో పాటు రవితేజ 'ఈగల్' కూడా ఈ సంక్రాంతి పండక్కే రానుంది. పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ ఈ సినిమాను నిర్మిస్తోంది. కార్తీక్ ఘట్టమనేని దర్శకుడు. ఇక వైవిధ్య కథల దర్శకుడు ప్రశాంత్‌ వర్మ రూపొందించిన 'హనుమాన్'పై కూడా మంచి ఇంట్రెస్ట్​ ఉంది. ఇప్పటికీ రిలీజైన గ్లింప్స్​ కూడా భారీ స్థాయిలో ఆకట్టుకుంది. అంతా అనుకున్నట్టు జరిగితే.. ఈ నాలుగు చిత్రాలు సంక్రాంతి రేసులో ఉన్నట్టవుతుంది.

Tags:    

Similar News