ఆ సినిమా వల్లే పెదకాపు చేశా : శ్రీకాంత్ అడ్డాల
ఈమధ్య సినిమా ఇంటర్వ్యూలన్నీ ఇంటర్వ్యూస్ లా కాకుండా ఇంటరాగేషన్ లా జరుగుతున్నాయని అందుకే పెదకాపు ఇంటర్వ్యూ సినిమా యూనిట్ తో చేస్తున్నామని అన్నారు డైరెక్టర్ శ్రీకాంత్ అడ్డాల.
కొత్త బంగారు లోకం, సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు, బ్రహ్మోత్సవం ఈ సినిమాలను తీసిన డైరెక్టర్ శ్రీకాంత్ అడ్డాల తన నెక్స్ట్ సినిమా పెదకాపు 1 తో వస్తున్నాడు. సామాన్యుడి సంతకం ట్యాగ్ లైన్ తో వస్తున్న ఈ సినిమా లో శ్రీకాంత్ అడ్డాల ఒక డిఫరెంట్ అటెంప్ట్ చేశారని చెప్పొచ్చు. ద్వారకా క్రియేషన్స్ బ్యానర్ లో మిర్యాల రవీంద్ర రెడ్డి నిర్మించిన ఈ సినిమాలో విరాట్, ప్రగతి శ్రీవాత్సవ హీరోయిన్ గా నటించారు.
సెప్టెంబర్ 29న రిలీజ్ అవుతున్న ఈ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా డైరెక్టర్ శ్రీకాంత్ అడ్డాల, కెమెరామెన్ చోటా కె నాయుడు, మ్యూజిక్ డైరెక్టర్ మిక్కీ జే మేయర్ తో పాటుగా సినిమా హీరో విరాట్ సినిమాలో ఇంపార్టెంట్ రోల్ ప్లే చేసిన అనసూయ ఇంటర్వ్యూలో పాల్గొన్నారు. ఈమధ్య సినిమా ఇంటర్వ్యూలన్నీ ఇంటర్వ్యూస్ లా కాకుండా ఇంటరాగేషన్ లా జరుగుతున్నాయని అందుకే పెదకాపు ఇంటర్వ్యూ సినిమా యూనిట్ తో చేస్తున్నామని అన్నారు డైరెక్టర్ శ్రీకాంత్ అడ్డాల.
కోవిడ్ లాక్ డౌన్ టైం లో తన తండ్రి చెప్పిన కొన్ని విషయాల మీద ఈ కథ ఆలోచన వచ్చిందని నిర్మాత మిర్యాల రవీందర్ గారు కొత్త కుర్రాడితో సినిమా చేద్దాం అని పిలిచే సరికి ఒక ప్రేమ కథతో పాటుగా ఈ కథ చెప్పానని లవ్ స్టోరీకి కాకుండా ఆయన పెదకాపు కథకు ఓకే చెప్పారని అన్నారు. అలా సినిమా ఓకే అవగా తనలాంటి డైరెక్టర్ ఇలాంటి సినిమా చేశాడేంటని చాలా మంది అనుకున్నారు. కానీ నారప్ప రీమేక్ ఈ సినిమా చేయడానికి సహకరించిందని అన్నారు శ్రీకాంత్ అడ్డాల.
వెంకటేష్ నారప్ప సినిమాను శ్రీకాంత్ అడ్డాల తెలుగు రీమేక్ చేశారు. ఆ సినిమా చేయడం వల్లే పెదకాపు సినిమా తను అనుకున్నట్టుగా చేయగలిగానని అన్నారు. సినిమా కథ అనుకున్నప్పటి నుంచి ప్రతిదీ అలా బాగా కుదిరాయని తప్పకుండా ప్రేక్షకులకు ఈ సినిమా ఒక మంచి అనుభూతి అందిస్తుందని అన్నారు శ్రీకాంత్ అడ్డాల. మొదటి సినిమానే అయినా విరాట్ బాగా చేశాడు. మిక్కీ జే మేయర్ తన కెరీర్ బెస్ట్ మ్యూజిక్ అందించారు. కెమెరా వర్క్ కూడా సినిమాకు బాగా సపోర్ట్ చేసిందని సినిమా ప్రేక్షకుల నుంచి మంచి రెస్పాన్స్ తెచ్చుకుంటుందని. పెదకాపు 1 ని మించి పెదకాపు 2 ఉంటుందని అన్నారు శ్రీకాంత్ అడ్డాల.