పెద కాపుకి భలే కలిసొచ్చింది
కంటెంట్ ని ఇంటెన్సివ్ గా ప్రెజెంట్ చేయడంతో పెద్దకాపు 1కి అమాంతం డిమాండ్ పెరిగిపోయింది. ట్రైలర్ రిలీజ్ వరకు ఎవరూ కూడా ఆ సినిమా వైపు చూడలేదు.
శ్రీకాంత్ అడ్డాల అంటే వెంటనే గుర్తుకొచ్చేది ఫీల్ గుడ్ చిత్రాలు. కొత్త బంగారు లోకం, ఎస్.వి.ఎస్.సి, ముకుంద సినిమాలు చూస్తే ఫ్యామిలీ ఎలిమెంట్స్ కి అతను ఎంత ప్రాధాన్యత ఇస్తాడో అర్ధం చేసుకోవచ్చు. అయితే వీటి తర్వాత మహేష్ తో చేసిన బ్రహ్మోత్సవం సినిమా బిగ్గెస్ట్ డిజాస్టర్ అయ్యింది. పాయింట్ మంచిదే అయిన చెప్పే విధానం మాత్రం ఎవరికీ కన్విన్స్ కాలేదు. దీంతో మహేష్ బాబు కెరియర్ లో బిగ్గెస్ట్ డిజాస్టర్ గా ఆ మూవీ మారింది.
బ్రహ్మోత్సవం దెబ్బకి ఏకంగా మూడేళ్ళకి పైగా శ్రీకాంత్ అడ్డాల కనిపించలేదు. అనూహ్యంగా సురేష్ ప్రొడక్షన్స్ లో వెంకటేష్ తో నారప్ప సినిమాని టేకప్ చేసాడు. శ్రీకాంత్ అడ్డాల ఆ కంటెంట్ ని ఎలా హ్యాండిల్ చేస్తాడు అని డౌట్ వచ్చిన ప్రతి ఒక్కరికి సక్సెస్ తో సమాధానం చెప్పారు. నారప్ప సూపర్ హిట్ తర్వాత కూడా మళ్ళీ ఈ దర్శకుడు రెండేళ్ల గ్యాప్ తీసుకొని ప్రస్తుతం పెద కాపు 1తో ప్రేక్షకుల ముందుకి రాబోతున్నాడు.
సెప్టెంబర్ 29న ఈ సినిమా రిలీజ్ కాబోతోంది. విరాట్ కర్ణ ఈ మూవీతో హీరోగా పరిచయం అవుతున్నాడు. తాజాగా సినిమా ట్రైలర్ ప్రేక్షకుల ముందుకి వచ్చింది. గోదావరి జిల్లాల్లో ప్రేమలే కాదు పగలు, ప్రతీకార గొడవలు కూడా ఉంటాయని ఈ సినిమాతో శ్రీకాంత్ అడ్డాల చూపించే ప్రయత్నం చేస్తున్నాడు. అగ్రకులానికి చెందివారు తక్కువ కులం వారిని అంటరానివారుగా చూస్తూ ఆకారణంగా జాత్యాహంకారంతో హత్యలు చేస్తూ ఉంటారు. వారికి హీరో ఎదురెళ్లి ఎలా నిలబడ్డాడు అనేది కథగా ఉంది.
కంటెంట్ ని ఇంటెన్సివ్ గా ప్రెజెంట్ చేయడంతో పెద్దకాపు 1కి అమాంతం డిమాండ్ పెరిగిపోయింది. ట్రైలర్ రిలీజ్ వరకు ఎవరూ కూడా ఆ సినిమా వైపు చూడలేదు. తరువాత మాత్రం రైట్స్ కోసం పోటీ పడుతున్నారు. మిర్యాల రవీంద్ర రెడ్డి ఈ చిత్రాన్ని భారీ బడ్జెట్ తో నిర్మించారు. ప్రస్తుతం బిజినెస్ డీల్స్ జరుగుతున్నాయంట. ఈ వారంలో అన్ని ఫైనల్ కావచ్చనే మాట వినిపిస్తోంది.
కంటెంట్ లో దమ్ముడంటతో డిస్టిబ్యూటర్స్ కూడా మంచి ఫ్యాన్సీ రేట్లు చెల్లించి హక్కులు సొంతం చేసుకోవడానికి వస్తున్నారంట. శ్రీకాంత్ అడ్డాలకి కచ్చితంగా పెద్దకాపు 1 మంచి సక్సెస్ ఇచ్చే ఛాన్స్ ఉందని ఇండస్ట్రీ వర్గాలలో కూడా చర్చ నడుస్తోంది.