పెదకాపు 1 ట్రైలర్.. ధర్మం-అధర్మం మధ్య సాగే యుద్ధం

ఈ సినిమా విడుదల తేదీ మరి కొద్ది రోజులే ఉన్న నేపథ్యంలో ట్రైలర్ ను రిలీజ్ కు చేశారు మేకర్స్.

Update: 2023-09-11 06:47 GMT

నారప్ప లాంటి బ్లాక్ బస్టర్ యాక్షన్ చిత్రం తర్వాత దర్శకుడు శ్రీకాంత్ అడ్డాల తెరకెక్కించిన సినిమా పెద కాపు 1 . 'ఓ సామాన్యుడి సంతకం ఈ సినిమా ట్యాగ్ లైన్. కొత్త బంగారు లోకం, సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు, బ్రహ్మోత్సవం వంటి ఫ్యామిలీ ఎంటర్ టైనర్ సినిమాల తర్వాత శ్రీకాంత్ అడ్డాల యాక్షన్ బాట పట్టారు. ఈ క్రమంలోనే నారప్ప తర్వాత ఇప్పుడు పెద్ద కాపుతో ప్రేక్షకుల ముందుకు రానున్నారు. ఈ సినిమా విడుదల తేదీ మరి కొద్ది రోజులే ఉన్న నేపథ్యంలో ట్రైలర్ ను రిలీజ్ కు చేశారు మేకర్స్.

ఒక ఆడది నూతిలో పడి ఆకాశం తప్ప ఆదుకునేవాడు లేక అరిస్తే వినిపించుకునేవాడు లేక వెళ్లిపోయింది.. ఇలాంటి వందల కథలు ఉన్నాయి అంటూ ప్రారంభమైన ఈ ప్రచార చిత్రం ఆద్యంతం పవర్ ఫుల్ యాక్షన్ సీన్స్ తో సాగింది. మిక్కీ జే మేయర్ అందించిన సంగీతం.. ప్రచార చిత్రంలోని ప్రతి సన్నివేశాన్ని ఎలివేట్ చేసింది. మనిషిలో కసి తగ్గినా కనికరం పెరిగినా వాడు మనోడైనా పరాయి ఓడు అయినా చంపేయడమే, నిల్చున్న వాళ్లను నిల్చున చోటే తలలు నరికేయండిరా అంటూ చెప్పే డైలాగ్ లు, వైలైన్స్ సీన్లను చాలా పవర్ ఫుల్ గా చూపించారు. ఫైనల్ గా మీకే అంతుంటే మాకు ఎంతుండాలి అంటూ హీరో చెప్పే డైలాగ్ ను హైలైట్ చేస్తూ ప్రచార చిత్రాన్ని ముగించారు.

ఈ ట్రైలర్ చూస్తుంటే వెనకపడిన ఆడవారిపై జరిగే ఘోరాలను లైట్ గా టచ్ చేస్తూనే.. ధర్మం, అధర్మం, సామాన్యుడుపై అధికార పెత్తనం, రెండు వర్గాల మధ్య ఆధిపత్యం కోసం జరిగే కొట్లాట.. ఈ క్రమంలోనే ఇలాంటి దారుణ పరిస్థితులపై తిరగబడిన ఓ యువకుడి కథ అని తెలుస్తోంది. మరి చివరికి ఆ యువకుడు తన చుట్టూ జరిగే అన్యాయాన్ని ఎదిరించి ఎక్కడి వరకు నిలబడ్డాడు? పోరాటం ఎలా చేశాడు? చివరికి గెలిచాడా లేదా అన్నది తెరపై చూడాల్సిందే.

'అఖండ' లాంటి సూపర్ బ్లాక్ బస్టర్ చిత్రాన్ని నిర్మించిన మిర్యాల రవీందర్ రెడ్డినే.. తన తర్వాత చిత్రంగా ఈ 'పెదకాపు 1' సినిమాను నిర్మిస్తున్నారు. మిర్యాల సత్యనారాయణ సమర్పణలో ద్వారకా క్రియేషన్స్ బ్యానర్ పై తన మేనల్లుడు విరాట్ కర్ణను హీరోగా పరిచయం చేస్తూ మిర్యాల రవీందర్ రెడ్డి సినిమాను ప్రొడ్యూస్ చేస్తున్నారు. ఇప్పటికే విడుదలైన టైటిల్, ఫస్ట్ లుక్ పోస్టర్, టీజర్ చూసి.. ఈ చిత్రం చాలా ఇంటెన్స్ గా ఉండబోతుందని ఓ అంచనాకు వచ్చేశారు సినీ ప్రియులు.

అఖండ రిలీజై సూపర్ బ్లాక్ బస్టర్ అందుకున్న విడుదల తేది సెప్టెంబర్ 29నే సెంటిమెంట్ గా.. ఈ పెద కాపు చిత్రాన్ని విడుదల చేస్తున్నారు మేకర్స్. మిక్కీ జే మేయర్ సంగీతం అందించారు. ఇప్పటికే రిలీజైన పాటలు కూడా బాగానే ఆకట్టుకున్నాయి. ప్రముఖ స్టంట్ మాస్టర్ పీటర్ హెయిన్స్.. ఈ చిత్రానికి ఫైట్స్ కంపోజ్ చేయడం విశేషం. చోటా కె నాయుడు సినిమాటోగ్రఫీ అందించారు. మార్తాండ్ కే వెంకటేశ్ ఎడిటర్ గా వ్యవహరించారు. రాజు సందరం కొరియోగ్రఫీ చేశారు.

Full View
Tags:    

Similar News