ఫోటో స్టోరి: సోనాల్ కిల్లింగ్ లుక్ వైరల్!
తాజాగా సోనాల్ చౌహాన్ షేర్ చేసిన ఫోటోషూట్ ఒకటి అంతర్జాలంలో సునామీ స్పీడ్ తో దూసుకుపోతోంది. సోనాల్ ఈ ఫోటోషూట్ లో టోన్డ్ లుక్ తో కనిపించింది.
బోయపాటి సినిమాలతో పాపులరైంది సోనాల్ చౌహాన్. బ్యాక్ టు బ్యాక్ బాలయ్య-బోయపాటి కాంబినేషన్ సినిమాల్లో నటించి నందమూరి అభిమానులకు చేరువైంది. నటించినవి పెద్ద సినిమాలే అయినా కానీ ఎందుకనో సోనాల్ కి ఆ తర్వాత ఇక్కడ ఆశించిన అవకాశాలు రాలేదు. సక్సెస్ ఉన్నా ఏదీ ఆశించినట్టు జరగలేదు. అటుపై టాలీవుడ్ నుంచి బాలీవుడ్ కి వెళ్లింది. డాలీవుడ్ అనే కొత్త పరిశ్రమలో ప్రయత్నించింది. అయినా అక్కడా ఫలితం శూన్యం.
చివరిసారిగా ఆదిపురుష్ చిత్రంలో అతిథి పాత్రలో కనిపించిన ఈ బ్యూటీ బంగ్లాదేశ్ కి చెందిన ప్రముఖ పంపిణీదారుడు నిర్మిస్తున్న ఓ సైకలాజికల్ థ్రిల్లర్ మూవీలో అవకాశం కల్పించడం ఆశ్చర్యపరిచింది. దర్థ్ పేరుతో రూపొందుతున్న ఈ చిత్రంలో సోనాల్ కథానాయికగా నటిస్తోంది.
ఇందులో షకీబ్ ఖాన్ హీరో. డాలీవుడ్ మెగాస్టార్ గా అతడికి మంచి పాపులారిటీ ఉంది గనుక సోనాల్ ఇక డాలీవుడ్ లో సెటిలైపోతోందంటూ ప్రచారం సాగింది. దర్థ్ పాన్ ఇండియా కేటగిరీలో విడుదల కావాల్సి ఉంది.
అయితే సోనాల్ ఏ పరిశ్రమకు వెళ్లినా హిందీ పరిశ్రమను వదిలిపెట్టదు. దాని కోసం ప్రయత్నాలు ఎప్పటికీ కొనసాగుతూనే ఉంటాయి. తాజాగా సోనాల్ చౌహాన్ షేర్ చేసిన ఫోటోషూట్ ఒకటి అంతర్జాలంలో సునామీ స్పీడ్ తో దూసుకుపోతోంది. సోనాల్ ఈ ఫోటోషూట్ లో టోన్డ్ లుక్ తో కనిపించింది.
థై స్లిట్ గౌనులో స్టన్నర్ అని నిరూపించింది. టెల్ మి యువర్ ఫేవరెట్ ! పేరుతో సోనాల్ ఈ ఫోటోషూట్ ని షేర్ చేయగా నెట్ లో వైరల్ గా మారాయి. ఈ ఫోటోషూట్ లో సోనాల్ విరహంతో వీగిపోతున్న లలనను తలపించే ఎక్స్ ప్రెషన్స్ ఇచ్చింది. థై స్లిట్ గౌనులో ఒక రకంగా రెచ్చిపోయిందని చెప్పాలి. సోనాల్ జిగిబిగి ఫోటోషూట్ వేగంగా యూత్ లోకి దూసుకెళుతోంది.