అల్లు అర్జున్‌ పై ఫిర్యాదు.. ఆర్మీ అని అంటున్నందుకే!

బన్నీ తన అభిమాన సంఘానికి అర్జున్ ఆర్మీ అని బన్నీ పేరు పెట్టుకున్నారని గ్రీన్‌ పీస్‌ ఎన్విరాన్‌మెంట్‌ అండ్‌ వాటర్‌ హార్వెస్టింగ్‌ ఫౌండేషన్‌ సంస్థ అధ్యక్షుడు బైరి శ్రీనివాస్ గౌడ్‌ అభ్యంతరం వ్యక్తం చేశారు.

Update: 2024-11-30 08:08 GMT

టాలీవుడ్ ఐకాన్ స్టార్ అల్లు అర్జున్.. తన ఫ్యాన్స్ ను ఎప్పుడూ ఆర్మీ అని పిలుస్తుంటారు. ఇప్పటికే చాలా ఈవెంట్స్ లో అలాగే అన్నారు. ప్రస్తుతం మోస్ట్ అవైటెడ్ మూవీ పుష్ప-2 ప్రమోషన్స్ లో కూడా అలాగే అంటున్నారు. వారంతా తన కోసం పోరాడతారని, అందుకే ఆర్మీని అంటానని రీసెంట్ గా ముంబైలో అల్లు అర్జున్ తెలిపారు.

అయితే అల్లు అర్జున్ తన అభిమానులను ఆర్మీ అని పేర్కొనడంపై కొందరు అసహనం వ్యక్తం చేస్తున్నారు! ఈ మేరకు అల్లు అర్జున్ పై సికింద్రాబాద్ లోని జవహర్ నగర్ పోలీస్ స్టేషన్ సర్కిల్ ఇన్స్పెక్టర్ కు ఫిర్యాదు చేశారు. ఆర్మీ పదం వాడుతున్నందుకు అల్లు అర్జున్‌ పై కేసు నమోదు చేయాలంటూ వారు పోలీసులను కోరారు.

బన్నీ తన అభిమాన సంఘానికి అర్జున్ ఆర్మీ అని బన్నీ పేరు పెట్టుకున్నారని గ్రీన్‌ పీస్‌ ఎన్విరాన్‌మెంట్‌ అండ్‌ వాటర్‌ హార్వెస్టింగ్‌ ఫౌండేషన్‌ సంస్థ అధ్యక్షుడు బైరి శ్రీనివాస్ గౌడ్‌ అభ్యంతరం వ్యక్తం చేశారు. ఆర్మీ అనే పదం దేశానికి సేవ చేసే గౌరవప్రదమైన పేరని తెలిపారు. ఆర్మీ జాతీయ సమగ్రత, దేశ భద్రతకు సంబంధించిన అంశమని చెప్పారు.

కానీ అల్లు అర్జున్ అవేం పట్టించుకోవడం లేదని ఆరోపించారు. అందువల్ల ఆయనపై చర్యలు తీసుకోవాలని తాము డిమాండ్ చేస్తున్నామని చెప్పారు. పలు వేదికలపై తనకు ఆర్మీ ఉందని అల్లు అర్జున్ అంటున్నారని తెలిపారు. అందుకే పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు చెప్పారు. అభిమానులను ఆర్మీ అనడం సరికాదని అన్నారు.

ఇప్పుడు ఆర్మీ పదం వినియోగిస్తుండడంపై ఫిర్యాదు చేసిన విషయం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. దీంతో నెటిజన్లు ఒక్కొక్కరు ఒక్కోలా స్పందిస్తున్నారు. తమ అభిప్రాయాలను ఓపెన్ గా వెల్లడిస్తున్నారు. అలా ఆ విషయం హాట్ టాపిక్ గా మారింది. మరి దీనిపై అల్లు అర్జున్ టీమ్ స్పందిస్తుందో లేదో వేచి చూడాలి.

ఇక అల్లు అర్జున్.. పుష్ప-2తో ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సిద్ధమవుతున్నారు. సుకుమార్ దర్శకత్వం వహిస్తున్న ఆ సినిమాలో రష్మిక మందన్న మరోసారి శ్రీవల్లిగా అలరించనున్నారు. సునీల్, అనసూయ, ఫహాద్ ఫాజిల్ తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్నారు. డిసెంబర్ 5వ తేదీన మూవీ రిలీజ్ కానున్న విషయం తెలిసిందే.

Tags:    

Similar News