ఇంకా బుట్ట‌బొమ్మ పొడుగు కాళ్లపైనే ఫోక‌స్

అందుకే ఇప్పుడు ప్ర‌ఖ్యాత మ్యాగ‌జైన్ క‌వ‌ర్ పేజీపై పూజా త‌న పొడుగు కాళ్ల సొగ‌సును ఆవిష్క‌రించ‌గా, మ‌రోసారి అల వైకుంఠ‌పుర‌ములో ఫీట్ ని బుట్ట‌బొమ్మ సొగ‌సును అభిమానులు గుర్తు చేసుకుంటున్నారు.

Update: 2023-11-21 16:51 GMT

అల వైకుంఠ‌పుర‌ములో పాట‌ల్ని ఇంకా అభిమానులు మ‌ర్చిపోలేదు. ఇందులో పూజా హెగ్డే పొడుగు కాళ్ల సొగ‌సును వ‌ర్ణిస్తూ రాసిన లిరిక్ అభిమానుల హృద‌యాల్ని ప్ర‌త్యేకంగా స్ప‌ర్శించింది. పూజా పొడుగు కాళ్ల అందాన్ని వ‌ర్ణిస్తూ త‌న‌ని ఆరాధించే ఈ గీతం ఎంతో ప్ర‌త్యేక‌మైన‌ది. ముఖ్యంగా థ‌మ‌న్ ఎన్న‌డూ లేనిది అద్భుత‌మైన మ్యూజిక్ తో అల‌రించ‌డాన్ని ఎవ‌రూ మ‌ర్చిపోలేరు.


అందుకే ఇప్పుడు ప్ర‌ఖ్యాత మ్యాగ‌జైన్ క‌వ‌ర్ పేజీపై పూజా త‌న పొడుగు కాళ్ల సొగ‌సును ఆవిష్క‌రించ‌గా, మ‌రోసారి అల వైకుంఠ‌పుర‌ములో ఫీట్ ని బుట్ట‌బొమ్మ సొగ‌సును అభిమానులు గుర్తు చేసుకుంటున్నారు. ప్ర‌ఖ్యాత ఫిలింఫేర్ మ్యాగ‌జైన్ తాజా క‌వ‌ర్ పేజీ లుక్ అంత‌ర్జాలంలో సునామీలా మారింది.


పూజా ఈ లుక్ లో ఎంతో యూనిక్ గా క‌నిపిస్తోంది. ఫోటోషూట్ల ప‌రంగా ప్ర‌యోగాత్మ‌కంగాను క‌నిపిస్తోంది. అందుకే ఈ లుక్ ని అభిమానులు ఎంతో ప్ర‌శంసిస్తున్నారు. పొడుగు కాళ్ల సుంద‌రి కాలి అందాన్ని ఎంతో గొప్ప‌గా ఆవిష్క‌రించారు ఈ ఫోటోషూట్ లో. పూజా గుంటూరు కారంలో అవ‌కాశం చేజార్చుకున్నా కానీ, త‌దుప‌రి ప‌లు భారీ టాలీవుడ్ సినిమాల్లో న‌టించ‌నుంద‌ని తాజాగా గుస‌గుస‌లు వినిపిస్తున్నాయి. వాటికి సంబంధించిన అధికారిక ప్ర‌క‌ట‌న‌లు రావాల్సి ఉంది.


Tags:    

Similar News