టాలీవుడ్ కి దూరమవుతున్న బుట్ట బొమ్మ..!

మొన్నటిదాకా స్టార్ సినిమా అంటే ముందు పూజా హెగ్దేని హీరోయిన్ గా అనుకున్నాక ఆమె డేట్స్ అడ్జెస్ట్ కాకపోతే వేరే హీరోయిన్ కోసం వెళ్లేవారు.

Update: 2024-01-08 00:30 GMT

మొన్నటిదాకా స్టార్ సినిమా అంటే ముందు పూజా హెగ్దేని హీరోయిన్ గా అనుకున్నాక ఆమె డేట్స్ అడ్జెస్ట్ కాకపోతే వేరే హీరోయిన్ కోసం వెళ్లేవారు. లాస్ట్ ఇయర్ వరకు తెలుగులో సూపర్ ఫామ్ లో ఉన్న పూజా హెగ్దే సడెన్ గా ఇక్కడ ఖాళీ అయిపోయింది. మహేష్ గుంటూరు కారం సినిమాలో మొదట హీరోయిన్ గా పూజానే అనుకున్నా ఆ తర్వాత ఎందుకో ఆమె ప్లేస్ లో శ్రీ లీలని ఫిక్స్ చేశారు. గుంటూరు కారం నుంచి పూజా హెగ్దే కేవలం డేట్స్ అడ్జెస్ట్ చేయలేకనే సినిమా నుంచి తప్పుకుందని అంటున్నా మరో రీజన్ కూడా ఉందని కొందరు అంటున్నారు.

గుంటూరు కారం నుంచి ఎగ్జిట్ అయ్యాక స్టార్ సినిమాలు చాలా సెట్స్ మీదకు వెళ్తున్నా కనీసం పూజా హెగ్దే పేరు కూడా వారి నోట వినిపించడం లేదు. అప్పుడే పూజా హెగ్దే బోర్ కొట్టేసిందా లేదా ఆమెను కాదనుకుంటున్నారా అన్నది తెలియదు కానీ పూజా హెగ్దేకి ప్రస్తుతం ఒక్కటంటే ఒక్క ఛాన్స్ లేదు. పూజా బేబీ నెక్స్ట్ సినిమా అప్డేట్ కోసం ఆమె ఫ్యాన్స్ అంతా ఎంతో ఈగర్ గా ఉన్నారు. కానీ ఆమెకు మాత్రం తెలుగు నుంచి ఒక్క ఆఫర్ కూడా రావట్లేదు.

మొన్నామధ్య నాని సినిమాలో పూజా బేబీ హీరోయిన్ గా ఓకే అయినట్టు వార్తలు వచ్చినా ఆ వార్తల్లో కూడా ఎలాంటి వాస్తవం లేదని తెలుస్తుంది. రాధే శ్యాం, బీస్ట్, ఆచార్య మూడు వరుస ఫ్లాపులు పడటం వల్ల పూజా కి సౌత్ నుంచి ఒక్క ఆఫర్ రావట్లేదు. ఇక లాస్ట్ ఇయర్ బాలీవుడ్ లో చేసిన కిసి కా భాయ్ కిసి కి జాన్ సినిమా కూడా నిరాశపరచడంతో అక్కడ కూడా ఆఫర్లు మందగించాయి.

ప్రస్తుతం దేవ అనే హిందీ సినిమాలో నటిస్తున్న పూజా హెగ్దే ఆ సినిమాతో తిరిగి ఫాం లోకి రావాలని చూస్తుంది. తెలుగు సినిమాలు పాన్ ఇండియా వైడ్ గా భారీ హిట్లు కొడుతున్న ఈ టైం లో పూజా హెగ్దే ఇక్కడ అవకాశాలు రాబట్టుకోలేకపోవడం చూస్తుంటే చిన్నగా అమ్మడు టాలీవుడ్ కి దూరమవుతున్నట్టుగా అనిపిస్తుంది. పూజా హెగ్దే సినిమాలో ఉంటే తన థై*షోతో ఎట్రాక్ట్ చేస్తూ సినిమాకు ప్లస్ అవుతుంది. కానీ ఇప్పుడు అమ్మడికి ఇక్కడ అవకాశాలు లేక వెనకబడింది.

Tags:    

Similar News