ప‌వ‌ర్ స్టార్ కి మ‌రో రీమేక్ దొరికేసిందా?

ఈ నేప‌థ్యంలో ఆ సినిమాకి సీక్వెల్ కూడా చేస్తే బాగుంటుంద‌ని అప్ప‌ట్లోనే ప్ర‌చారం సాగింది. కోర్ట్ రూమ్ డ్రామాలో పీకే చెల‌రేగ‌డం అంద‌ర్నీ మెప్పించింది.

Update: 2023-12-27 02:30 GMT

ప‌వ‌ర్ స్టార్ ప‌వ‌న్ క‌ళ్యాణ్ క‌థానాయ‌కుడిగా న‌టించిన 'వ‌కీల్ సాబ్' విజ‌యం అభిమానుల్లో జోష్ నింపిన సంగ‌తి తెలిసిందే. అప్ప‌టికే వ‌రుస ప‌రాజ‌యాల్లో ఉన్న పీకేని వ‌కీల్ సాబ్ ఊర‌ట‌నిచ్చింది. ఆ సినిమా అభిమానుల‌కు పండ‌గ‌లా నిలిచింది. ఇది బాలీవుడ్ లో విజ‌యం సాధించిన 'పింక్' చిత్రానికి రీమేక్ అన్న సంగ‌తి తెలిసిందే. రీమేక్ కంటెంట్ అంటే ప‌వ‌న్ అంతే ఆద‌రిస్తాడు. హిట్ అయిన సినిమాల్ని త‌న‌దైన శైలిలో టాలీవుడ్ లో రీమేక్ చేయ‌డం అన్న‌ది తొలి నుంచి ఉన్న అల‌వాటు.

అదే హ్యాబీట్ పీకేని ఫెయిల్యూర్ ని నుంచి మ‌రోసారి బ‌య‌ట‌ప‌డేసింది. ఆ సినిమాతో దిల్ రాజ్ కోరిక కూడా నెర‌వేరింది. అప్ప‌టికే ఎంతో కాలంగా పీకే తో సినిమా నిర్మించాల‌ని రాజుగారు ప్ర‌య‌త్నిస్తున్నారు. పీకే డేట్లు కుద‌ర‌క‌పోవ‌డంతో ఆ ఛాన్స్ ఎప్పుడొస్తుందా? అన్న స‌మ‌యంలో వ‌కీల్ సాబ్ తో ఆ డ్రీమ్ నెర‌వేరింది. ఈ నేప‌థ్యంలో ఆ సినిమాకి సీక్వెల్ కూడా చేస్తే బాగుంటుంద‌ని అప్ప‌ట్లోనే ప్ర‌చారం సాగింది. కోర్ట్ రూమ్ డ్రామాలో పీకే చెల‌రేగ‌డం అంద‌ర్నీ మెప్పించింది. ఆ క‌థ‌కి కొన‌సాగింపు ఉంటే బాగుంటుంద‌ని అనిపించింది.

కానీ ఆ త‌ర్వాత ఇద్ద‌రు వేర్వేరు ప్రాజెక్ట్ ల్లో బిజీ అవ్వ‌డంతో ఆ టాపిక్ రాలేదు. అయితే తాజాగా విడుద‌లైన మ‌ల‌యాళం సినిమా 'నేరు' విజ‌యం దిశ‌గా ప‌య‌నిస్తోంది. మోహ‌న్ లాల్ ప్ర‌ధాన పాత్ర‌లో 'దృశ్యం' ఫేం జీతూజోసెఫ్ తెర‌కెక్కించిన సినిమా ఇటీవ‌ల రిలీజ్ అయి మంచి విజయం సాధించింది. ఇది కూడా కోర్ట్ రూమ్ డ్రామానే. క‌ళ్ళు లేని ఒక మధ్య తరగతి యువతిని మంత్రి కొడుకు రేప్ చేస్తే హీరో ఎలా పోరాడి గెలిపించాడనే పాయింట్ మీద ఇది నడుస్తుంది. కేవలం రెండు ఇళ్ళు- కోర్ట్ రూమ్ సెటప్ లోనే క‌థ న‌డిపించి స‌క్సెస్ కొట్టారు.

ఇందులో పాట‌లు కూడా లేవు. ఈ సినిమా చూసిన త‌ర్వాత ప‌వ‌న్ ఇమేజ్ కి ఈ క‌థ స‌రిపోతుందన్న అభిప్రాయం తెర‌పైకి వ‌స్తోంది. 'వ‌కీల్ సాబ్ 2' గా దీన్ని తెర‌పైకి తెస్తే బాగుంటుందంటున్నారు. అవ‌స‌రం మేర ప‌వ‌న్ ఇమేజ్ కి కాస్త క‌మ‌ర్శియ‌ల్ ట‌చ్ అప్ ఇవ్వొచ్చు. ప‌క్కాగా ఎగ్జిక్యూట్ చేయ‌గ‌ల్గితే మంచి ఐడియా అవుతుందని ఫిలిం స‌ర్కిల్స్ లో వినిపిస్తోంది. మ‌రి పీకే సాబ్ ఏమంటారా?

Tags:    

Similar News