ప్రభాస్ త్రివిక్రం.. ఎలాంటి సినిమా వస్తుంది..?

ప్రభాస్ హీరోగా త్రివిక్రం డైరెక్షన్ లో ఒక సినిమా వస్తుందని టాక్. ప్రభాస్ త్రివిక్రం ఈ కాంబినేషన్ ఎవరు ఊహించలేదు.

Update: 2023-11-18 06:16 GMT

రెబల్ స్టార్ ప్రభాస్ వరుస ప్రాజెక్ట్ లతో క్షణం తీరిక లేకుండా ఉన్నాడు. ప్రశాంత్ నీల్ డైరెక్షన్ లో సలార్ 1 డిసెంబర్ 22న వస్తుండగా నాగ్ అశ్విన్ తో చేస్తున్న కల్కి సినిమా 2024 మే 9న రిలీజ్ లక చేశారు. ఈ రెండు సినిమాలతో భారీ టార్గెట్ నే పెట్టుకున్నాడు ప్రభాస్. మరోపక్క మారుతి డైరెక్షన్ లో సినిమా కూడా సెట్స్ మీద ఉంది. ఈ సినిమాలతోనే ప్రభాస్ ఫ్యాన్స్ సూపర్ ఎగ్జైటెడ్ గా ఉన్నారు. ఇదిలా ఉంటే ప్రభాస్ లేటెస్ట్ గా మరో క్రేజీ కాంబినేషన్ ని ఫిక్స్ చేసుకున్నట్టు తెలుస్తుంది.

ప్రభాస్ హీరోగా త్రివిక్రం డైరెక్షన్ లో ఒక సినిమా వస్తుందని టాక్. ప్రభాస్ త్రివిక్రం ఈ కాంబినేషన్ ఎవరు ఊహించలేదు. తన మాటలతో అభిమానులను అలరించే త్రివిక్రం ప్రస్తుతం మహేష్ తో గుంటూరు కారం సినిమా చేస్తుండగా ఆ తర్వాత అల్లు అర్జున్ తో సినిమా లైన్ లో ఉంది. అల్లు అర్జున్ సినిమా పూర్తి చేశాక ప్రభాస్ తో సినిమా డిస్కషన్ లో ఉందని తెలుస్తుంది.

త్రివిక్రం ఇప్పటివరకు తీసిన సినిమాలన్నీ కూడా మంచి ఫ్యామిలీ ఎంటర్టైనర్స్ గానే వచ్చాయి. గుంటూరు కారం కూడా అదే తరహాలో వస్తుందని తెలుస్తుంది. ప్రభాస్ తో చేసే సినిమా కూడా మంచి ఫ్యామిలీ ఎమోషన్స్ తో ఉన్న కథగా వస్తుందని తెలుస్తుంది. ఈ సినిమా విషయంలో మేకర్స్ ప్లానింగ్ నెక్స్ట్ లెవెల్ లో ఉన్నట్టు తెలుస్తుంది.

పాన్ ఇండియా ఇమేజ్ తో ప్రభాస్ బాహుబలి తర్వాత తీసిన సినిమాలన్నీ పెద్ద టార్గెట్ తోనే వచ్చాయి. అంతేకాదు ఆ సినిమాల బడ్జెట్ కూడా భారీగా పెట్టేశారు. త్రివిక్రం తో సినిమా ఫ్యామిలీ సబ్జెక్ట్ తో మంచి ఎంటర్టైనర్ గా తెరకెక్కించాలని చూస్తున్నారట. ఇప్పటికే ఇద్దరి మధ్య కథా చర్చలు జరిగినట్టు టాక్. త్రివిక్రం తో ప్రభాస్ ఒకవేళ ఈ సినిమా కాంబినేషన్ సినిమా కన్ ఫర్మ్ అయినా కూడా సినిమా సెట్స్ మీదకు వెళ్లాలంటే ఎలా లేదన్నా మరో రెండేళ్లు టైం పడుతుంది. ప్రభాస్ సలార్ 1 తర్వాత సలార్ సెకండ్ పార్ట్ కూడా పూర్తి చేయాల్సి ఉంది. అది చేశాకే త్రివిక్రం సినిమా చేసే అవకాశం ఉంటుంది.

బాహుబలి తర్వాత బ్లాక్ బస్టర్ కొట్టడంలో ప్రభాస్ వెనకపడ్డాడు. రాబోయే సినిమాలతో ఫ్యాన్స్ ఆకలి తీర్చేలా సినిమాలు ప్లానింగ్ చేస్తున్నాడు. సలార్ 1 తోనే ప్రభాస్ హిట్ మేనియా మొదలవుతుందని చెప్పుకుంటున్నారు.

Tags:    

Similar News