ప్రభాస్.. మళ్ళీ సీత అంటున్నారేంటి?

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ బ్యాక్ టూ బ్యాక్ సినిమాలు చేస్తూ బిజీగా ఉన్నారు. ఈ ఏడాది ప్రభాస్ నుంచి వచ్చిన ‘కల్కి2898ఏడీ’ మూవీ గ్రాండ్ సక్సెస్ అయ్యింది.

Update: 2024-09-18 03:45 GMT

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ బ్యాక్ టూ బ్యాక్ సినిమాలు చేస్తూ బిజీగా ఉన్నారు. ఈ ఏడాది ప్రభాస్ నుంచి వచ్చిన ‘కల్కి2898ఏడీ’ మూవీ గ్రాండ్ సక్సెస్ అయ్యింది. అయిన ఎక్కువ గ్యాప్ తీసుకోకుండా మారుతి దర్శకత్వంలో తెరకెక్కుతోన్న ‘ది రాజాసాబ్’ చిత్రాన్ని కంప్లీట్ చేసే పనిలో పడ్డారు. ఈ మూవీ షూటింగ్ జరుగుతూ ఉండగానే హను రాఘవపూడి దర్శకత్వంలో ‘ఫౌజీ’ సినిమాని ప్రభాస్ ప్రారంభించాడు. ఈ సినిమా షూటింగ్ కి ఏర్పాట్లు జరుగుతున్నాయి.

‘ఫౌజీ’ మూవీలో ప్రభాస్ కి జోడీగా ఇమాన్వి ఇస్మాయిల్ అనే బ్యూటీని హీరోయిన్ గా కన్ఫర్మ్ చేశారు. ఆమెకిదే మొదటి చిత్రం కావడం విశేషం. అయితే హను రాఘవపూడి దీనికంటే ముందు దుల్కర్, మృణాల్ కాంబినేషన్ లో ‘సీతారామం’ సినిమా చేసి బ్లాక్ బస్టర్ అందుకున్నారు. అందుకే ‘ఫౌజీ’ సినిమాలో ప్రభాస్ కి జోడీగా మృణాల్ ఠాకూర్ ని కన్ఫర్మ్ చేసినట్లు ప్రచారం జరిగింది. తరువాత ఈ ప్రచారానికి మేకర్స్ ఫుల్ స్టాప్ పెట్టారు.

ఇప్పుడు ప్రభాస్ కి జోడీగా ‘మృణాల్ ఠాకూర్’ పేరు మరోసారి తెరపైకి వచ్చింది. సందీప్ రెడ్డి వంగా దర్శకత్వంలో ప్రభాస్ ‘స్పిరిట్’ మూవీ చేయబోతున్న సంగతి తెలిసిందే. ఈ ఏడాది ఆఖరులో ‘స్పిరిట్’ మూవీ రెగ్యులర్ షూటింగ్ స్టార్ట్ అయ్యే అవకాశం ఉందనే మాట వినిపిస్తోంది. ఈ సినిమాలో ప్రభాస్ కి ‘జోడీగా’ మృణాల్ ఠాకూర్ ని తీసుకొనే ఆలోచనలో సందీప్ రెడ్డి ఉన్నాడనే ప్రచారం నడుస్తోంది.

బిటౌన్ లో కూడా స్పిరిట్ మూవీ కోసం ఆమె పేరే ప్రముఖంగా వినిపిస్తోంది. అయితే దీనిపై మేకర్స్ నుంచి ఎలాంటి క్లారిటీ రాలేదు. మృణాల్ ఠాకూర్ ప్రస్తుతం స్టార్ హీరోయిన్ గా తెలుగు, హిందీ, తమిళ్ భాషలలో దూసుకుపోతోంది. ఈ నేపథ్యంలో ప్రభాస్ కి జోడీగా ఆమెని తీసుకున్న ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. ప్రభాస్, మృణాల్ ఆన్ స్క్రీన్ ప్రెజెన్స్ కూడా బాగుంటుందనే అభిప్రాయం వ్యక్తం అవుతోంది.

మృణాల్ ప్రభాస్ కి జోడీగా కన్ఫర్మ్ అయ్యిందనే ప్రచారం ఎంత వరకు వాస్తవమో తెలియదు. సందీప్ రెడ్డి విజన్, ప్లానింగ్ కంప్లీట్ డిఫరెంట్ గా ఉంటాయి. ‘స్పిరిట్’ చిత్రంలో ప్రభాస్ హీరో క్యారెక్టర్ తో పాటు విలన్ గా కూడా కనిపించబోతున్నాడని టాక్ వినిపిస్తోంది. ఈ నేపథ్యంలో రెండు పాత్రలకి కూడా ఇద్దరు హీరోయిన్స్ ని పెట్టే ఛాన్స్ ఉంది. ఆ ఛాన్స్ లు ఎవరిని వరిస్తాయనేది ఆసక్తికరంగా మారింది.

Tags:    

Similar News