స్పిరిట్ కోసం ప్రభాస్ స్ట్రిక్ట్ డైట్.. అసలు రాజీపడని వంగా!
ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ వర్క్ జరుగుతుండగా.. త్వరలో రెగ్యులర్ షూటింగ్ మొదలు పెట్టడానికి సందీప్ అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు.
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్, స్టార్ డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా కాంబోలో స్పిరిట్ మూవీ రూపొందుతున్న విషయం తెలిసిందే. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ వర్క్ జరుగుతుండగా.. త్వరలో రెగ్యులర్ షూటింగ్ మొదలు పెట్టడానికి సందీప్ అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. అయితే సెట్స్ పైకి వెళ్లకముందే మూవీపై మంచి బజ్ క్రియేట్ అయింది.
దీంతో డార్లింగ్ ఫ్యాన్స్ తో పాటు సినీ ప్రియులు.. అప్డేట్స్ కోసం వెయిట్ చేస్తున్నారు. అదే సమయంలో సోషల్ మీడియాలో రకరకాల వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. ఉగాది కానుకగా స్పిరిట్ పూజా కార్యక్రమాలు జరగనున్నాయని జోరుగా ప్రచారం జరుగుతోంది. ఆ తర్వాత జకార్తాలో ఫస్ట్ షెడ్యూల్ స్టార్ట్ అవ్వనుందని టాక్ వినిపిస్తోంది.
ఆ విషయంలో నిజమెంతో తెలియదు కానీ.. నెట్టింట మాత్రం ఫుల్ వైరల్ అవుతోంది. అదే సమయంలో కెరీర్ లో తొలిసారి పోలీస్ ఆఫీసర్ గా కనిపించనున్న ప్రభాస్.. లుక్స్, ఫిజిక్ పరంగా స్పెషల్ గా మేకోవర్ కానున్నట్లు తెలుస్తోంది. సినిమాలో నెవ్వర్ బిఫోర్ బాడీ లాంగ్వేజ్ తో కనపడనున్నారని జోరుగా ప్రచారం జరుగుతోంది.
అందుకు గాను ఇప్పుడు ప్రభాస్.. నెల రోజుల పాటు స్ట్రిక్ట్ డైట్ ఫాలో అవ్వనున్నారని సమాచారం. ప్రస్తుతం మారుతి రాజా సాబ్ తో పాటు హను రాఘవపూడి సినిమాల షూటింగ్స్ లో పాల్గొంటున్న ఆయన.. అవి కంప్లీట్ అయ్యాక నెల రోజులు రెస్ట్ తీసుకుంటారని వినికిడి. ఆ తర్వాత స్పిరిట్ మూవీ షూటింగ్ మొదలు కానుందని తెలుస్తోంది.
నిజానికి ప్రభాస్ ఒకేసారి పలు సినిమాల షూటింగ్స్ లో పాల్గొంటారన్న విషయం తెలిసిందే. ఇప్పుడు జరుగుతోంది కూడా అదే. కానీ సందీప్ వంగా మాత్రం అందుకు ఒప్పుకోవడం లేదని సమాచారం. సినిమా కోసం అస్సలు రాజీ పడడం లేదని టాక్ వినిపిస్తోంది. సేమ్ టు సేమ్ రాజమౌళిలానే కండీషన్ పెట్టారని తెలుస్తోంది.
సాధారణంగా జక్కన్న.. తాను తీస్తున్న ప్రాజెక్ట్ కంప్లీట్ అయ్యేవరకు హీరో మరో సినిమాలో నటించేందుకు ఒప్పుకోరు. ఇప్పుడు సందీప్ కూడా స్పిరిట్ కు ప్యారలల్ గా ఇతర సినిమాల షూట్ లో పాల్గొనడానికి అంగీకరించడం లేదట. అలా స్పిరిట్ కోసం పక్కా ప్లాన్ తో ముందుకు వెళ్తున్నారని తెలుస్తోంది. ఏదేమైనా ఇప్పటికే ఆడియన్స్ లో వేరే లెవెల్ అంచనాలు క్రియేట్ చేసిన స్పిరిట్ ఎప్పుడు స్టార్ట్ అవుతుందో? ఎప్పుడు రిలీజ్ అవుతుందో వేచి చూడాలి.