ప్రభాస్ 'జవాన్'.. ఎప్పటికీ మొదలయ్యేనో?
అందుకే ఇప్పుడు అట్లీ దర్శకత్వంలో ప్రభాస్ సినిమాను చేసేందుకు సిద్ధం అవుతున్నట్లుగా తెలుస్తోంది.
పాన్ ఇండియా సూపర్ స్టార్ ప్రభాస్ వచ్చే నెలలో సలార్ సినిమా తో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. ఇటీవల ఆదిపురుష్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన ప్రభాస్ నిరాశ పరిచారు. ప్రస్తుతం ఆయన చేతిలో సలార్ మరియు కల్కి సినిమాలు మాత్రమే ఉన్నాయి. మారుతి సినిమా ప్రారంభించినట్లు వార్తలు వచ్చాయి. కానీ ఇప్పటి వరకు ఎలాంటి క్లారిటీ లేదు.
ఆదిపురుష్ సినిమా వేడుకలో ప్రభాస్ ఏడాదికి రెండు మూడు సినిమాలతో రావాలనుకుంటున్నట్లుగా పేర్కొన్నాడు. అందుకే సలార్ సినిమా విడుదలకు సిద్ధం అయింది... కల్కి సినిమా షూటింగ్ ముగింపు దశకు వచ్చింది కనుక కొత్త సినిమా ను ప్రారంభించే అవకాశాలు ఉన్నాయంటూ వార్తలు వస్తున్నాయి.
చాలా సంవత్సరాల క్రితం తమిళ దర్శకుడు అట్లీ ఒక స్టోరీ లైన్ తో ప్రభాస్ వద్దకు వెళ్లడం.. ఆ సమయంలో ప్రభాస్ బిజీగా ఉండటం వల్ల సినిమా కార్యరూపం దాల్చలేదు. అందుకే ఇప్పుడు అట్లీ దర్శకత్వంలో ప్రభాస్ సినిమాను చేసేందుకు సిద్ధం అవుతున్నట్లుగా తెలుస్తోంది.
ప్రస్తుతం ప్రభాస్ కమిట్ అయి ఉన్న సినిమాలు పూర్తి అయిన తర్వాత అంటే వచ్చే ఏడాది లో అట్లీ దర్శకత్వంలో సినిమా ఉండబోతుంది. షారుఖ్ ఖాన్ తో రూపొందించిన జవాన్ సినిమా తో అట్లీ ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. జవాన్ సినిమా పై ఇండస్ట్రీ వర్గాల వారితో పాటు అంతా కూడా చాలా నమ్మకం గా కనిపిస్తున్నారు.
ఇప్పటికే వరుణ్ ధావన్ తో అట్లీ ఒక హిందీ సినిమా ను చేసేందుకు కమిట్ అయ్యాడు. వరుణ్ ధావన్ సినిమా పూర్తి అయిన తర్వాత ప్రభాస్ తో పాన్ ఇండియా మూవీ ని అట్లీ రూపొందించే అవకాశాలు ఉన్నాయని తెలుస్తోంది. గతంలో ఎన్టీఆర్ హీరోగా అట్లీ దర్శకత్వంలో ఒక సినిమా రూపొందబోతుందనే వార్తలు వచ్చాయి. ఆ సినిమా విషయంలో క్లారిటీ రావాల్సి ఉంది.