ప్రభాస్.. వచ్చే ఏడాది కూడా రెండు
పాన్ ఇండియా స్టార్ నుంచి పాన్ వరల్డ్ హీరోగా అడుగులు వేస్తున్న ప్రభాస్ గత ఏడాది నుంచి చాలా బిజీగా కనిపిస్తూ ఉన్నాడు
పాన్ ఇండియా స్టార్ నుంచి పాన్ వరల్డ్ హీరోగా అడుగులు వేస్తున్న ప్రభాస్ గత ఏడాది నుంచి చాలా బిజీగా కనిపిస్తూ ఉన్నాడు. ప్రస్తుతం ఇండియాలోనే ఏ స్టార్ హీరో చేతిలో లేని అతిపెద్ద ప్రాజెక్టులు ప్రభాస్ చేతిలో ఉన్నాయి. సక్సెస్ రేటు బాక్స్ ఆఫీస్ వద్ద ఎలా ఉన్నా కూడా ప్రభాస్ క్రేజ్ అసలు తగ్గడం లేదు. ఏమాత్రం పాజిటివ్ టాక్ వచ్చినా కూడా కలెక్షన్స్ ఊహించని రేంజ్ లో ఉంటాయి అని ఇటీవల సలార్ సినిమాతోనే అర్థమైంది.
ఇక ఆ సినిమాకు సీక్వెల్ కూడా రాబోతున్న విషయం తెలిసిందే. అయితే ప్రభాస్ ఈమధ్య ఏడాదికి రెండు సినిమాలు వచ్చేలా ప్లాన్ చేసుకున్నట్లుగా తెలుస్తోంది. గత ఏడాది ఆదిపురుష్ సినిమాతో పాటు సలార్ 1 ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మొదట్లో వచ్చిన ఆదిపురుష్ దారుణంగా డిజాస్టర్ కాగా ఏడాది చివర్లో వచ్చిన సలార్ మళ్లీ ప్రభాస్ రేంజ్ ను నిలబెట్టింది.
ఈ ఏడాది కూడా ప్రభాస్ రెండు సినిమాలలో కనిపించబోతున్నాడు. ముందుగా నాగ్ అశ్విన్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న కల్కి 2898 AD సినిమా రాబోతోంది. వైజయంతి ప్రొడక్షన్లో పాన్ వరల్డ్ రేంజ్ లో రూపొందుతున్న ఈ సినిమా అన్ని అనుకున్నట్లు జరిగితే మే 9 రిలీజ్ అయ్యే అవకాశం ఉంది. అలాగే లిస్టులో కన్నప్ప సినిమా కూడా ఉంది. మంచి విష్ణు కన్నప్ప హీరోగా నటిస్తున్న ఈ సినిమాలో ప్రభాస్ శివుడు పాత్రలో దర్శనం ఇవ్వబోతున్నాడు.
కన్నప్ప సినిమాను ఇదే ఏడది చివరన ప్రేక్షకుల ముందుకు తీసుకువచ్చే అవకాశం ఉంది. ఇక మరోవైపు ప్రభాస్ రాజాసాబ్ కూడా షూటింగ్ దశలో ఉంది. అలాగే సలార్ 2 షూటింగ్ కూడా ఏప్రిల్ లో మళ్ళీ మొదలుకానుంది. ఈ రెండు సినిమాలు కూడా వచ్చే ఏడాది విడుదల కాబోతున్నాయి. మారుతీ దర్శకత్వంలో తెరపైకి రాబోతున్న రాజాసాబ్ ను మొదట ఈ ఏడాది డిసెంబర్లోనే విడుదల చేయాలని అనుకున్నారు. కానీ ఇప్పుడు 2025 సంక్రాంతికి షిఫ్ట్ చేయాలనే ఆలోచనలో ఉన్నారు.
ఇక ఆ తర్వాత సలార్ 2ని ప్రేక్షకుల ముందుకు తీసుకువచ్చే అవకాశం ఉంది. ఎట్టి పరిస్థితుల్లోనూ ప్రభాస్ అయితే ఏడాదికి రెండు సినిమాలు మిస్ కాకుండా చూసుకుంటూ ఉన్నాడు. ఇక హను రాఘవపూడి దర్శకత్వంలో కూడా ఇదే ఏడాది చివర్లో ఒక సినిమా స్టార్ట్ చేయనున్నాడు. అలాగే లిస్టులో సందీప్ రెడ్డివంగా స్పిరిట్ సినిమా ఉన్న విషయం తెలిసిందే. ఈ ప్రాజెక్టు కూడా త్వరలోనే స్టార్ట్ కానుంది. ఇక హను ప్రాజెక్ట్ - స్పిరిట్ 2026 లో ఇదే పద్దతిలో విడుదలయ్యే అవకాశం లేకపోలేదు.