'సలార్' మూవీటీమ్ డేరింగ్ డెసిషన్.. అవేమి ఉండవట
సాధారణంగా ఓ బడా హీరో సినిమా వస్తుందంటే ప్రమోషన్స్ ఎలా ఉండాలి. మోత మోగిపోవాలి. వరుస అప్డేట్లు, ఇంటర్వ్యూలు, ఈవెంట్లతో షేక్ అవ్వాలి
సాధారణంగా ఓ బడా హీరో సినిమా వస్తుందంటే ప్రమోషన్స్ ఎలా ఉండాలి. మోత మోగిపోవాలి. వరుస అప్డేట్లు, ఇంటర్వ్యూలు, ఈవెంట్లతో షేక్ అవ్వాలి. కానీ ఇవేమీ.. పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ నటిస్తున్న భారీ యాక్షన్ ఎంటర్ టైనర్ సినిమా 'సలార్' విషయంలో కనపడట్లేదు. మరో 27 రోజుల్లో మూవీ వరల్డ్ వైడ్‌గా రిలీజ్ కానుంది. అయితే మూవీటీమ్ టీమ్ మాత్రం చడి చప్పుడు చేయట్లేదు. మౌనం పాటిస్తూ అభిమానులకు నిరుత్సాహ పరుస్తోంది.
కానీ ఓవర్సీస్లో మాత్రం ఈ సినిమా డప్పులు మోగిస్తోంది. యూఎస్ బాక్సాఫీస్ ముందు ప్రమోషన్స్ మంచిగా జరుగుతూ.. బుకింగ్స్ కూడా ఓపెన్ అయిపోయాయి. కానీ ఇక్కడ మాత్రం ఇప్పటి వరకు ఈ సినిమా గురించి సరిగ్గా ఒక్క అప్డేట్ రాలేదు. టీజర్‌ను మాత్రం సైలెంట్‌గా విడుదల చేసి చేతులు కట్టేసుకుని కూర్చున్నారు. అప్పటి నుంచి ఎటువంటి హడావుడి చేయలేదు.
అయితే తాజాగా ఈ సినిమా గురించి మరో షాకింగ్ విషయం తెలిసింది. సలార్ మేకర్స్.. ఇతర ఏ మూవీటీమ్స్ తీసుకని సాహసమైన నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం అందింది. అదేంటంటే ప్రచారంలో ఉన్నట్టుగానే ఈ సినిమాకు ఎటువంటి ప్రమోషన్స్ చేయరట. ఈవెంట్లు కూడా నిర్వహించరట.
ప్రమోషన్స్ లేకుండానే సింపుల్‌గా మూవీ రిలీజ్ లోపు ముందుగా ట్రైలర్‌ను విడుదల చేస్తారట. ఆ తర్వాత ఒకటి లేదా రెండు సాంగ్స్‌ను మాత్రమే రిలీజ్ చేయాలని మేకర్స్ ఫిక్స్ అయ్యారట. అయితే ఇలా చేయడానికి ఓ బలమైన కారణం ఉందట. అదే కాన్ఫీడెంట్. ఇప్పటికే రిలీజైన టీజర్ గూస్ బంప్స్ తెప్పించిన సంగతి తెలిసిందే. సినిమాపై వరల్డ్ వైడ్‌గా మంచి హైప్ క్రియేట్ అయింది.
దర్శకుడు ప్రశాంత్ నీల్, ప్రభాస్, నిర్మాతలు కూడా తమ సినిమా ఔట్‌పుట్‌పై భారీ నమ్మకంతో ఉన్నారట. సినిమా హిట్ అవ్వడం పక్కా అని ధీమాగా ఉన్నారని తెలిసింది. అందుకే ఎటువంటి ప్రమోషన్స్, ఈవెంట్లు లేకుండా సినిమాను డైరెక్ట్ రిలీజ్ చేసే సాహసం చేసేందుకు సిద్ధమయ్యారని సమాచారం అందింది. చూడాలి మరి ఈ సినిమా ఎలాంటి సక్సెస్‌ను అందుకుంటుందో..