కల్కి హీరో అతనే… ప్రభాస్ చెప్పిన మాట
యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా నాగ్ అశ్విన్ క్రియేట్ చేసిన కల్కి 2898ఏడీ మూవీ థియేటర్స్ లో సక్సెస్ ఫుల్ గా రన్ అవుతోంది.
యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా నాగ్ అశ్విన్ క్రియేట్ చేసిన కల్కి 2898ఏడీ మూవీ థియేటర్స్ లో సక్సెస్ ఫుల్ గా రన్ అవుతోంది. భారీ కలెక్షన్స్ ని కొల్లగొడుతూ వరల్డ్ వైడ్ గా దూసుకుపోతోంది. ఈ ఏడాది టాలీవుడ్ లో కల్కి 2898ఏడీ మూవీ అతి పెద్ద హిట్ గా నిలిచేలా కనిపిస్తోంది. అలాగే బాలీవుడ్ లో కూడా ఈ ఏడాది బిగ్గెస్ట్ హిట్స్ జాబితాలో కల్కి కచ్చితంగా ఉంటుందని చెప్పొచ్చు.
ఇదిలా ఉంటే ఈ సినిమాని వైజయంతీ మూవీస్ బ్యానర్ పై అశ్వినీదత్ ఏకంగా 600 కోట్ల బడ్జెట్ తో నిర్మించారు. ఇప్పటి వరకు ఇండియన్ బాక్సాఫీస్ పై ఇదే అత్యధిక బడ్జెట్ మూవీ అని చెప్పొచ్చు. అలాగే ఫ్యూచరిస్టిక్ కాన్సెప్ట్ తో వచ్చి సూపర్ హిట్ దిశగా దూసుకుపోతున్న చిత్రంగా కూడా కల్కి నిలబడింది. తాజాగా నిర్మాత అశ్వినీదత్ కల్కి 2898ఏడీ మూవీ విశేషాలని ఓ ఇంటర్వ్యూలో పంచుకున్నారు.
ఈ సినిమాలో హీరోగా నటించిన ప్రభాస్ ని అశ్వినీదత్ ప్రశంసలు కురిపించారు. కల్కి సినిమాలో కమల్ హాసన్ ప్రతినాయకుడిగా కన్ఫర్మ్ అయ్యారని తెలిసి ప్రభాస్ చాలా సంతోషించారని అన్నారు. అలాగే మూవీలో నిజమైన హీరో అమితాబ్ బచ్చన్ అని ప్రభాస్ చెప్పారంట. ఆయనకి గౌరవం ఇస్తేనే మనకి కూడా గౌరవం నిలబడుతుందని ప్రభాస్ టీమ్ తో చెప్పారంట.
ప్రభాస్ ఈ సినిమాకి ఎంతో డెడికేటెడ్ గా వర్క్ చేశారని, అతని పని గురించి ఎంత చెప్పిన తక్కువే అవుతుందని అశ్వినీదత్ చెప్పుకొచ్చారు. కల్కి సినిమా చూసిన తర్వాత అశ్వద్ధామ పాత్రనే మూవీలో హీరోగా ఉందనే అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు. భైరవ పాత్ర కంటే అశ్వద్ధామ గా చేసిన అమితాబ్ బచ్చన్ పెర్ఫార్మెన్స్ అందరికి బాగా కనెక్ట్ అయ్యిందనే టాక్ కూడా వస్తోంది.
మూవీ క్లైమాక్స్ లో భైరవని కర్ణుడిగా రిప్రజెంట్ చేసే కొసమెరుపుతో అంత వరకు సెకండ్ హీరోగా నడిచిన ప్రభాస్ క్యారెక్టర్ ని నాగ్ అశ్విన్ టాప్ లో నిలబెట్టాడు. పార్ట్ లో భైరవ పాత్ర చాలా కీలకంగా ఉంటుందనే మాట వినిపిస్తోంది. ఇక కల్కి 2898ఏడీ సినిమాలో భైరవ, అశ్వద్ధామ తర్వాత అంత బలమైన పాత్రలో సుమతిగా దీపికా పదుకునే నటించి మెప్పించింది.