బాలయ్య హీరోయిన్‌ 'ఖేల్‌' కొనసాగేనా..?

హీరోయిన్‌ గా వచ్చిన ప్రతి ఒక్క ఆఫర్‌ ను సద్వినియోగం చేసుకుంటూ ముందుకు సాగుతున్న ఈ అమ్మడు బాలీవుడ్‌ లో చేసిన 'ఖేల్‌ ఖేల్‌ మే' సినిమా నేడు ప్రేక్షకుల ముందుకు వచ్చింది.

Update: 2024-08-15 07:30 GMT

తెలుగు ప్రేక్షకుల్లో కంచె సినిమాతో గుర్తింపు దక్కించుకున్న ముద్దుగుమ్మ ప్రగ్యా జైస్వాల్‌. అంతకు ముందు చేసిన సినిమాలు పెద్దగా ఆడకున్నా కంచె సినిమా తో మంచి విజయాన్ని సొంతం చేసుకోవడంతో పాటు, అందరి దృష్టిని ఆకర్షించింది. ఆ సినిమాలో ప్రగ్యా అందంతో పాటు నటనతో మెప్పించింది. ఆకట్టుకునే అందం ప్రగ్యా సొంతం అంటూ నిరూపితం అయ్యింది. ప్రగ్యా కి కంచె హిట్‌ తెచ్చి పెట్టినా కూడా ఆ తర్వాత పెద్దగా ఆఫర్లు రాలేదు. వచ్చిన కొన్ని సినిమా ఆఫర్లు మంచి ఫలితాలను సొంతం చేసుకోలేక పోయాయి. బాలకృష్ణ తో ఈమె చేసిన అఖండ మంచి విజయాన్ని సొంతం చేసుకుంది.

అఖండ సూపర్ హిట్ అయినా కూడా ప్రగ్యా జోరు మాత్రం కనబర్చలేదు. హీరోయిన్‌ గా వచ్చిన ప్రతి ఒక్క ఆఫర్‌ ను సద్వినియోగం చేసుకుంటూ ముందుకు సాగుతున్న ఈ అమ్మడు బాలీవుడ్‌ లో చేసిన 'ఖేల్‌ ఖేల్‌ మే' సినిమా నేడు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ సినిమాలో ప్రగ్యా మెయిన్‌ హీరోయిన్‌ కాదు. తాప్సి తో పాటు వాణి కపూర్ లు ఈ సినిమాలో నటించారు. వారితో సమానమైన పాత్రను ఈ అమ్మడు షేర్‌ చేసుకుంటుంది అంటూ వార్తలు వచ్చాయి. ఈ సినిమా హిట్‌ అయితే బాలీవుడ్‌ లో కచ్చితంగా ముందు ముందు మంచి ఆఫర్లు వస్తాయని నమ్ముతున్నారు.

విడుదలకు ముందే ఖేల్‌ ఖేల్‌ మే సినిమా కి పాజిటివ్ రెస్పాన్స్ దక్కిందని, ప్రేక్షకులు ఈ సినిమాను తప్పకుండా ఆదరిస్తారు అనే నమ్మకంతో తాప్సి తో పాటు ఇతర హీరోయిన్స్ పలు ఇంటర్వ్యూల్లో చెప్పుకొచ్చారు. ఒక మంచి కాన్సెప్ట్‌ తో రూపొందిన ఈ సినిమాలో ముగ్గురికి కూడా చాలా ప్రముఖ పాత్రలు ఉంటాయట. ఈ మధ్య కాలంలో హిందీ సినిమాలు బాక్సాఫీస్‌ వద్ద ఆశించిన స్థాయిలో ఫలితాలను అందుకోలేక పోతున్నాయి. కానీ ఈ సినిమా మాత్రం మినిమం వసూళ్లను సొంతం చేసుకుంటుంది అంటూ యూనిట్‌ సభ్యులు నమ్మకంతో ఉన్నారు.

తెలుగు లో ఒకటి రెండు సినిమాలు ప్రస్తుతం చర్చల దశలో ఉన్నాయని త్వరలోనే ఏదో ఒక సినిమాలో ఈ అమ్మడు నటించే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది. ఇక బాలయ్య తో ఈమె నటించిన అఖండ సినిమా మంచి విజయాన్ని సొంతం చేసుకున్న నేపథ్యంలో ఆయన ప్రస్తుతం చేస్తున్న 109వ సినిమాలో కూడా ఈమె ఉందనే వార్తలు వస్తున్నాయి. ఆ విషయమై చిత్ర యూనిట్‌ సభ్యుల నుంచి అధికారికంగా క్లారిటీ రావాల్సి ఉంది. మొత్తానికి నేడు విడుదల అయిన ఖేల్‌ ఖేల్‌ మే సినిమా ఫలితాన్ని బట్టి ప్రగ్యా బాలీవుడ్‌ ఖేల్‌ ఉంటుందని సినీ విశ్లేషకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.

Tags:    

Similar News