'చంద్రయాన్ 3'పై ప్రకాష్ రాజ్ ఓవరాక్షన్ ఫలితం..!
తన ట్విట్టర్ ఖాతాలో ఇస్రో మాజీ చీఫ్ కి చెందిన అసహ్యకరమైన వ్యంగ్య చిత్రాన్ని(ఫోటోని) షేర్ చేసాడు. దీనిపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తాయి.
విలక్షణ నటుడు, వక్త ప్రకాష్ రాజ్ ప్రతిష్ఠాత్మక 'చంద్రయాన్ 3' పై చేసిన మాక్ (తప్పుడు సంజ్ఞ) సంచలమైన సంగతి తెలిసిందే. అతడు భారతదేశ ప్రతిష్ఠాత్మక ప్రాజెక్టును గేలి చేయడంపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తాయి. భారత ప్రధాని నరేంద్ర మోదీ- భాజపా ఎన్డీయే పాలనకు వ్యతిరేకి అయిన ప్రకాష్ రాజ్ ఇలా ఒక భారతదేశపు మిషన్ ని కించపరచడం ఎవరికీ రుచించడం లేదు. దీంతో నెటిజనులు అతడిపై తీవ్రంగా విరుచుకుపడ్డారు. ఇలాంటి ప్రతిష్ఠాత్మక ప్రాజెక్ట్ విషయంలో అలా ప్రవర్తించడం సరైనదేనా? అని ప్రకాష్ రాజ్ ని ప్రశ్నించారు.
ఇంతకీ ప్రకాష్ రాజ్ ఏం చేసారు? అంటే.. తన ట్విట్టర్ ఖాతాలో ఇస్రో మాజీ చీఫ్ కి చెందిన అసహ్యకరమైన వ్యంగ్య చిత్రాన్ని(ఫోటోని) షేర్ చేసాడు. దీనిపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తాయి. అమెరికన్ వ్యోమగామి 1969లో చంద్రునిపై నడిచిన మొదటి వ్యక్తి అయిన నీల్ ఆర్మ్‌స్ట్రాంగ్ కాలం నాటి పాత జోక్‌ను రిపీట్ చేస్తూ ప్రకాష్ రాజ్ ట్వీట్ చేసాడు. ''ద్వేషం ద్వేషాన్ని మాత్రమే చూస్తుంది... నేను # జోక్‌ని సూచిస్తున్నాను ఆర్మ్‌స్ట్రాంగ్ టైమ్స్.. మన కేరళ చాయ్‌వాలా వేడుకలు.. ఏ చాయ్‌వాలాను ట్రోల్స్ చూశారు?? .. మీకు జోక్ రాకపోతే ఆ జోక్ మీపైనే.. గ్రో అప్ #justasking(sic)" అని ప్రకాష్ రాజ్ పోస్ట్ చేశాడు.
చాయ్ వాలా అంటూ నేరుగా దేశ ప్రధాని నరేంద్ర మోడీని ఉద్దేశించి ప్రకాష్ రాజ్ వ్యంగ్యాన్ని ప్రదర్శించారు. నిజానికి నాస్తికత్వానికి సపోర్ట్ గా నిలిచే ప్రకాష్ రాజ్ తొలి నుంచీ భాజపా వ్యతిరేకి. నరేంద్ర మోదీ విధానాలకు వ్యతిరేకి. అతడు జాతీయ కాంగ్రెస్ కి అండగా నిలిచాడు. రాజీవ్ గాంధీని ప్రధానిగా చూడాలనేది అతడి ఆశ. కానీ అది ఎప్పటికీ నెరవేరలేదు. కనీసం మూవీ ఆర్టిస్టుల సంఘం (మా) ఎన్నికల్లోను ఆయన గెలవలేక చతికిలబడ్డారు. కారణం ఏదైనా కానీ ఈ రాజకీయాలు ప్రకాష్ రాజ్ కి ఏమాత్రం కలిసి రాలేదు. భవిష్యత్ లో ఆయన నాయకుడు అవుతాడా లేదా? అన్నది అటుంచితే ఇప్పుడు ప్రకాష్ రాజ్ జోకులు మాత్రం మిస్ ఫైర్ అయ్యి చీవాట్లు తినడానికి దారి చూపాయి.