మైత్రి అండతో ప్రశాంత్ వర్మ మరో బిగ్ కాంబో!
ప్రశాంత్ వర్మ సినిమాటిక్ యూనివర్స్ లో మొదటి సూపర్ హీరో చిత్రంగా హనుమాన్ సినిమాని తెరకెక్కించి బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్నారు.
హనుమాన్ సినిమాతో పాన్ ఇండియా డైరెక్టర్ గా మారిన యంగ్ టాలెంటెడ్ దర్శకుడు ప్రశాంత్ వర్మ. అ!, కల్కి, జాంబిరెడ్డి సినిమాలతో తానేంటో ప్రూవ్ చేసుకున్న ప్రశాంత్ వర్మ నాలుగో సినిమా హనుమాన్ తో ఎవ్వరూ ఊహించని స్థాయిలో దేశ వ్యాప్తంగా తన పేరు వినిపించేలా చేసుకున్నాడు. ప్రశాంత్ వర్మ సినిమాటిక్ యూనివర్స్ లో మొదటి సూపర్ హీరో చిత్రంగా హనుమాన్ సినిమాని తెరకెక్కించి బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్నారు.
ప్రస్తుతం దీనికి సీక్వెల్ గా జై హనుమాన్ మూవీ చేసే ప్రయత్నంలో ప్రశాంత్ వర్మ ఉన్నారు. ఇప్పటికే ఈ సినిమా స్క్రిప్ట్ సిద్ధం అయిపోయింది. భారీ బడ్జెట్ తో తెరకెక్కబోయే ఈ చిత్రంలో ఒక స్టార్ హీరో హనుమాన్ క్యారెక్టర్ లో నటించబోతున్నట్లు ప్రచారం నడుస్తోంది. అఫీషియల్ గా దానికి సంబంధించి ఇంకా అప్డేట్ రాలేదు. ఇదిలా ఉంటే ఇప్పుడు ప్రశాంత్ వర్మ కు సంబంధించి మరో ఇంట్రెస్టింగ్ న్యూస్ తెరపైకి వచ్చింది.
బాలీవుడ్ లో స్టార్ హీరో రణవీర్ సింగ్ తో ప్రశాంత్ వర్మ ఒక మూవీ చేయబోతున్నాడంట. ఇప్పటికే రణవీర్ సింగ్ కి కథ చెప్పి ఓకే చేయించుకున్నట్లు టాక్ నడుస్తోంది. మైత్రి మూవీ మేకర్స్ ఈ చిత్రాన్ని భారీ బడ్జెట్ తో పాన్ ఇండియా ప్రాజెక్టుగా నిర్మించే అవకాశం ఉందని సమాచారం. ప్రశాంత్ వర్మ చేయబోయే జై హనుమాన్ మూవీ కంటే ముందుగానే రణవీర్ సింగ్ తో చిత్రాన్ని సెట్స్ పైకి తీసుకొని వెళ్ళనున్నారని ఇండస్ట్రీ వర్గాలలో వినిపిస్తోంది.
ఈ సినిమా కూడా సూపర్ హీరో కాన్సెప్ట్ తోనే ఉండబోతుందనే మాట కూడా ప్రచారంలో ఉంది. దీనిపై ఇప్పటివరకు ప్రశాంత్ వర్మ నుంచి ఎలాంటి అఫీషియల్ అప్డేట్ రాలేదు. అయితే ఇండస్ట్రీ వర్గాలలో మాత్రం ఈ సినిమా గురించి టాక్ నడుస్తోంది. రణవీర్ సింగ్ ప్రాజెక్టు తర్వాత జై హనుమాన్ చిత్రాన్ని ప్రశాంత్ వర్మ పట్టాలు ఎక్కించే అవకాశం ఉందని భావిస్తున్నారు.
అయితే గతంలో డి వి దానయ్య కొడుకు దాసరి కళ్యాణ్ హీరోగా అధీరా అనే సూపర్ హీరో చిత్రాన్ని ప్రశాంత్ వర్మ అనౌన్స్ చేశారు. మరి ఈ మూవీ ఎప్పుడు స్టార్ట్ చేస్తారు అనేది ఆసక్తికరంగా మారింది. తాజాగా హనుమాన్ 100 రోజుల వేడుక నిర్వహించారు. ఇందులో కూడా ప్రశాంత్ వర్మ నెక్స్ట్ చేయబోయేది జై హనుమాన్ మూవీ అనే విధంగానే హింట్ ఇచ్చాడు. మరి రణవీర్ సింగ్ తో మూవీ గురించి ఎప్పుడు రివీల్ చేస్తాడో తెలియాల్సి ఉంది.