ప్రశాంత్ నీల్ - ఎన్టీఆర్.. మధ్యలో మరోటి!
దర్శకుడు ప్రశాంత్ నీల్ ఇటీవల సలార్ పార్ట్ వన్ సినిమాతో బాక్సాఫీస్ వద్ద సాలిడ్ సక్సెస్ అందుకున్న విషయం తెలిసిందే
దర్శకుడు ప్రశాంత్ నీల్ ఇటీవల సలార్ పార్ట్ వన్ సినిమాతో బాక్సాఫీస్ వద్ద సాలిడ్ సక్సెస్ అందుకున్న విషయం తెలిసిందే. KGF తర్వాత అదే తరహాలో క్రియేట్ చేసిన మ్యాజిక్ బాక్సాఫీస్ వద్ద మంచి లాభాలను అందించింది. అయితే ప్రశాంత్ నీల్ తర్వాత ప్రాజెక్టును జూనియర్ ఎన్టీఆర్ తో చేయాలని మొదట ప్రణాళిక రచించుకున్నాడు. అంతేకాకుండా కేజిఎఫ్ పార్ట్ 3 కూడా ఉంటుంది అని ఇదివరకే ఒక హింట్ అయితే ఇచ్చాడు..
ఇక జూనియర్ ఎన్టీఆర్ ప్రశాంత్ నీల్ ప్రాజెక్టుకు సంబంధించిన కథ కూడా దాదాపు ఫైనల్ అయినట్లుగా తెలుస్తోంది. పూర్తి స్థాయిలో స్క్రిప్ట్ సిద్ధం చేసుకున్న తర్వాత దర్శకుడు షూటింగ్ మొదలుపెట్టాలని అనుకుంటున్నాడు. అయితే ఈ ప్రాజెక్టు మాత్రం ఇప్పట్లో మొదలు కాకపోవచ్చు అని కూడా తెలుస్తోంది. అందుకు కారణం సలార్ ఫస్ట్ పార్ట్ భారీ స్థాయిలో కలెక్షన్స్ అందుకోవడమే.
అదే ఊపులో సెకండ్ పార్ట్ కూడా వీలైనంత తొందరగా ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలి అని ప్రశాంత్ నీల్ ఆలోచిస్తున్నట్లుగా తెలుస్తోంది. ప్రభాస్ కూడా ప్రశాంత్ తో సినిమా పూర్తి చేయడానికి డేట్స్ కూడా ఇచ్చే ఆలోచనలో ఉన్నట్లు సమాచారం. ఇక సలార్ 2 ప్రాజెక్టు పట్టాలు ఎక్కితే మాత్రం కనీసం ఏడాది సమయం పట్టవచ్చు.
దీని వల్ల జూనియర్ ఎన్టీఆర్ తో చేయాల్సిన ప్రాజెక్టు స్టార్ట్ అవ్వడానికి ఇంకాస్త ఎక్కువ సమయం పట్టే అవకాశం ఉంది. ప్రస్తుతం జూనియర్ ఎన్టీఆర్ దేవర సినిమాతో షూటింగ్ తో బిజీగా ఉన్నాడు. ఆ సినిమా కూడా రెండు భాగాలుగా రాబోతోంది. అలాగే బాలీవుడ్ వార్ 2 సినిమాలో కూడా ఎన్టీఆర్ ఒక పవర్ఫుల్ పాత్రలో కనిపించబోతున్నాడు.
ఇక ఈ ప్రాజెక్టులతో తారక్ కూడా బిజీగా ఉన్నాడు కాబట్టి దర్శకుడు ప్రశాంత్ ముందుగా సలార్ 2 పూర్తి చేసి ఆ తర్వాత ఎన్టీఆర్ ప్రాజెక్టును సెట్స్ పైకి తీసుకువచ్చే అవకాశం ఉందట.
ఇక ఆ తర్వాత యశ్ కెజిఎఫ్ పార్ట్ 3 లో స్టార్ట్ చేసే అవకాశం ఉంది. ప్రశాంత్ నీల్ లిస్టులో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కూడా ఉన్నాడు. మరి అతనితో సినిమాను ఎప్పుడు స్టార్ట్ చేస్తాడో చూడాలి.