పీసీ-నిక్ జోడీ పార్టీలోనే స్పెషల్!
ముఖంలో మనసంతా పరిమళించిన నవ్వులో ఆకట్టుకుంటుంది. ఎంతో ఉత్సాహవంతమైన మూడ్ లో ఆకట్టుకుంటుంది
గ్లోబల్ స్టార్ ప్రియాకంచోప్రా-నిక్ జోనాస్ ల జోడీ ఎక్కడ కనిపించినా? సంచలనమే. స్పాట్ లో ఎన్ని జంటలున్నా! కళ్లన్నీ ఆ ఇద్దరిపైనే ఫోకస్ అవుతుంటాయి. వెకేషన్ మూడ్ లో ఉన్నా? పర్సనల్ ట్రిప్ అయినా సమ్ థింగ్ స్పెషల్ గా ఫోకస్ అవుతుంటారు. తాజాగా ఈ జోడీ జంటగా ఆకేషన్ కి హాజరైనట్లు తెలుస్తోంది. తెలుపు-నలుపు చుక్కల డిజైన్ లో పీసీ వావ్ అనిపిస్తుంది. భుజాన చిన్న హ్యాండ్ బ్యాగ్.. మ్యాచింగ్ కాళ్లకు హైహీల్స్ ధరించి అమ్మడు థై స్ ని పక్కాగా ప్రోజక్ట్ చేస్తుంది.
ముఖంలో మనసంతా పరిమళించిన నవ్వులో ఆకట్టుకుంటుంది. ఎంతో ఉత్సాహవంతమైన మూడ్ లో ఆకట్టుకుంటుంది. ఆ పక్కన భర్త నిక్ జోనాస్ ఆమె నడుంపై చేయి వేసి పరిచయం చేస్తున్నాడు. నిక్ బ్లాక్ అండ్ బ్లాక్ లో దుస్తుల పై గోల్డ్ కలర్ కోట్ ధరించాడు. అతడి ముఖంలోనూ చిరునవ్వు కనిపిస్తుంది. ఈ పిక్ చూస్తుంటే జంటగా ప్రయివేట్ పార్టీకి హాజరైనట్లు తెలుస్తోంది.
ప్రస్తుతం ఈ ఫోటో ఇన్ స్టాలో వైరల్ గా మారుతోంది. అక్కడ ఎన్ని జంటలున్నా పీసీ-నిక్ జోడీ హైలైట్ అవుతుంది. ఇక పీసీ థై అందాలపై నెటి జనుల కామెంట్లు ఆసక్తికరం. ఇక్కడే నిక్ జోనాస్ హైట్ ని గుర్తు చేస్తున్నారు. పీసీ కన్నా నిక్ పొట్టోడు అంటూ కామెంట్లు పెడుతున్నారు. అయితే పీసీ హైహీల్స్ ధరించింది కాబట్టి అంత హైట్ లో ఉందని..నిక్ పొట్టివాడు కాదంటూ మరికొంత మంది పోస్ట్ లు పెట్టారు.
ఇక పీసి కెరీర్ గురించి చెప్పాల్సిన పనిలేదు. హాలీవుడ్ లో బిజీ బిజీగా గడిపేస్తోంది. నిక్ తో వివాహం తర్వాత పూర్తిగా ఇండియాకి దూరమైంది. సమయమంతా మెట్టినిల్లుకే అన్నట్లు. అమ్మడు పుట్టినిల్లునే మర్చిపోయింది. ఆ మధ్య బాలీవుడ్ పై కొన్ని రకాల విమర్శలు చేసినప్పటికీ మళ్లీ వాటిని కప్పిపుచ్చుకుంది. అమ్మడు హాలీవుడ్ లో స్థిరపడటానికి అదీ ఓ కారణంగా బలంగా వినిపించింది.