సినీ ఇండ‌స్ట్రీ కార్పోరేట్ గుప్పిట్లో న‌లిగిపోతుంది!

అయితే ఇదో పెద్ద గ్యాబ్లింగ్ అని కోలీవుడ్ ద‌ర్శ‌క‌-నిర్మాత‌-గేయ ర‌చ‌యిత ప్రియ‌న్ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేసారు.

Update: 2023-12-21 02:30 GMT

ఇటీవ‌ల కాలంలో కోలీవుడ్..టాలీవుడ్ ల రీ-రిలీజ్ ట్రెండ్ మొదలైన సంగ‌తి తెలిసిందే. పాత హిట్ చిత్రాల్ని మ‌ళ్లీ రిలీజ్ చేస్తున్నారు. హీరోలు పుట్టిన సంద‌ర్భంగానూ...లేదు మంచి పండ‌గ‌లు ప‌బ్బాలు స‌మ‌యం చూసి రీరిలీజ్లు చేస్తున్నారు. త‌ద్వారా నిర్మాత‌ల‌కు మంచి లాభ‌దాయ‌కంగానూ క‌నిపిస్తోంది. కేవ‌లం 4 కె పార్మెట్ లో తీసుకొచ్చి రిలీజ్ చేయ‌డంతో ఎంతో కొంత లాభం త‌ప్ప నష్టాలు రావ‌డం లేదు. టాలీవుడ్ లో రీ-రిలీజ్ ట్రెండ్ చూసి కోలీవుడ్ అల‌వ‌ర్చుకుంది.


అయితే ఇదో పెద్ద గ్యాబ్లింగ్ అని కోలీవుడ్ ద‌ర్శ‌క‌-నిర్మాత‌-గేయ ర‌చ‌యిత ప్రియ‌న్ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేసారు. ఆయ‌న క‌థ‌ని స‌మ‌కూర్చి ద‌ర్శ‌క‌త్వం వ‌హించిన 'అరుణం' సినిమా వేడుక‌లో ఈ వ్యాఖ్య‌లు చేసారు. 'ప్రస్తుతం చిత్రపరిశ్రమ కార్పొరేట్‌ శక్తుల గుప్పెట్లో ఉంది. టీవీల్లో 300కు పైగా ప్రసారమైన చిత్రాలను ఇపుడు రీ రిలీజ్‌ పేరుతో విడుదల చేయడం ఏమిటని ప్రశ్నించారు. ఇలా రిలీజ్ చేయ‌డం వెనుక గూడుపుటానీ ఉంది

20 యేళ్లుగా చిత్ర పరిశ్రమలో కొనసాగుతున్న వారినే ముప్పుతిప్పలు పెడుతుంటే కొత్తగా వచ్చినవారి పరిస్థితి ఏమిటి? కళను ఆ రంగంలో ఉంటూనే నాశనం చేయడం ఒక్క సినిమా ఇండస్ట్రీలోనే జరుగుతోంది. ఈ చిత్ర నిర్మాణం అనేక విషయాలు నేర్చుకునేందుకు దోహదపడింది. చాలామంది హీరోయిన్లు తాము నటించిన చిత్రాల ఆడియో ఫంక్షన్లకు హాజరుకావడం లేదు. అందువ‌ల్ల నిర్మాత న‌ష్ట‌పోతున్నాడు.

ప్ర‌చారానికి ఎందుకు హాజ‌రు కావ‌డం లేదో? కార‌ణాలు కూడా చెప్ప‌డం లేదు. కానీ మా హీరోయిన్ వర్ష మాత్రం నటించడమే కాకుండా.. అసిస్టెంట్‌ దర్శకురాలిగా కూడా పనిచేశారు. సినిమాను నిర్మించడం ఇప్పుడు చాలా కష్టంగా మారింది. సినిమా ఇండస్ట్రీ దర్శక నిర్మాతల చేతుల్లో లేదు. కార్పొరేట్‌ గుప్పెట్లోకి వెళ్లిపోయింది. మంచి చిత్రాలకు ఇక్కడ చోటు లేదు. ఒక పెద్ద చిత్రం వచ్చిందంటే ప్రేక్షకులు బాగా ఆదరిస్తున్న చిన్న చిత్రాన్ని తొలగించేస్తున్నారు. కొత్త చిత్రాలకు అవకాశం కల్పించాలి' అని అన్నారు.

Tags:    

Similar News