ముంబైలోనే పూరి ఏంటా స్పెషాల్టీ?
ఆర్ ఎఫ్ సీలో భారీ షెడ్యూల్ ఉంటుందని మీడియాలో కథనాలు వెలువడ్డాయి. కానీ అవన్నీ తప్పు అంటున్నాడు పూరి. అవును తదుపరి షెడ్యూల్ కూడా ముంబైలోనే ప్లాన్ చేసారు.
'లైగర్' ప్లాన్ అయిన తర్వాత డ్యాషింగ్ డైరెక్టర్ ముంబై ఆఫీస్ ఖాళీ చేసి దుకాణం మళ్లీ హైదరాబాద్ కేవ్ కి మార్చేసిన సంగతి తెలిసిందే. వెళ్లడం ముంబైకి పెద్ద ప్లాన్ తోనే వెళ్లాడు గానీ..పరాజయం పూరిని ఒక్కసా రిగా వెనక్కి లాగి పెట్టింది. ఆ సినిమా ప్లాప్ తో ఆర్దిక నష్టాలు రావడంతో సన్నివేశం మొత్తం మారిపో యింది. తాను అనుకున్న ప్లాన్ ఏది? వర్కౌట్ అవ్వలేదు. అలా జరగాలంటే పూరి ఈజ్ బ్యాక్ అవ్వాలి.
ప్రస్తుతం ఆ పనుల్లోనే బిజీగా ఉన్న సంగతి తెలిసిందే. ఇస్మార్ట్ శంకర్ కి సీక్వెల్ గా అదే టీమ్ తో డబుల్ ఇస్మార్ట్ తెరకెక్కిస్తున్నారు. ఇప్పటికే చాలా భాగం షూటింగ్ పూర్తయింది. మార్చిలోనే చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలని ప్లాన్ చేస్తున్నారు. అందుకు తగ్గట్టే షూటింగ్ చకచకా పూర్తి చేస్తున్నారు. ఇటీవలే ముంబైలో ఓ షెడ్యూల్ పూర్తి చేసారు. దీంతో తదుపరి షెడ్యూల్ హైదరాబాద్ లో ఉంటుందని కథనాలు వచ్చాయి.
ఆర్ ఎఫ్ సీలో భారీ షెడ్యూల్ ఉంటుందని మీడియాలో కథనాలు వెలువడ్డాయి. కానీ అవన్నీ తప్పు అంటున్నాడు పూరి. అవును తదుపరి షెడ్యూల్ కూడా ముంబైలోనే ప్లాన్ చేసారు. జనవరి నుంచి కొత్త షెడ్యూల్ అక్కడే ఉంటుందని సమాచారం. ఈషెడ్యూల్ లో రామ్ పై యాక్షన్ సన్నివేశాలతో పాటు కీలక మైన సన్నివేశాలు చిత్రీకరించనున్నాడుట. యాక్షన్ సన్నివేశాలు ఇస్మార్ట్ శంకర్ ని మించి ఉంటాయం టున్నారు.
అలాగే పూరి గత చిత్రాల్ని మించి యాక్షన్ హైలైట్ చేస్తున్నారని యూనిట్ వర్గాల నుంచి లీకులందు తున్నాయి. మరి వరుసగా రెండు షెడ్యూళ్లను ముంబైలో ప్లాన్ చేయడం వెనుక ప్రత్యేకత ఏంటి? అన్నది తెలియాలి. ఒకప్పుడు పూరి సినిమా షూటింగ్ అంటే? హైదరాబాద్ లోనే ఎక్కువగా జరిగేది. వీలైనంత వరకూ ఖర్చు తక్కువలో తేల్చేసేవారు. అలాగే తప్పకుండా గోవాలో ఓ షెడ్యూల్ ప్లాన్ చేసుకునేవారు. పాటల కోసం విదేశాలకు వెళ్లేవారు. బ్యాక్ డ్రాప్ ని బట్టి ఆ లోకేషన్ ఎంపిక చేసుకునే వారు. కానీ ఈసారి హైదరాబాద్ బేస్ స్టోరీని ఎక్కువగా ముంబైలో షూట్ చేయడం ఆసక్తికరమనే చెప్పాలి.