పుష్ప 2 నాలుగు రోజుల కలెక్షన్స్.. ఆల్ టైమ్ బెస్ట్ రికార్డ్!
ఇండియన్ సినిమా ఇండస్ట్రీలో చాలా రోజుల తరువాత బాక్సాఫీస్ వద్ద ఉహించని రికార్డులు క్రియేట్ అవుతున్నాయి.
ఇండియన్ సినిమా ఇండస్ట్రీలో చాలా రోజుల తరువాత బాక్సాఫీస్ వద్ద ఉహించని రికార్డులు క్రియేట్ అవుతున్నాయి. ఇక కొత్త చరిత్ర సృష్టిస్తున్న పుష్ప 2: ది రూల్ ప్రపంచవ్యాప్తంగా విపరీతమైన వసూళ్లతో రికార్డులు తిరగరాస్తోంది. ఈ సినిమా ప్రారంభ రోజు నుంచే అద్భుతమైన టాక్ తో బాక్సాఫీస్ ను షేక్ చేస్తోంది. ఇక అత్యధిక వేగంగా 500 కోట్ల క్లబ్ లో చేరిన సినిమాగా రికార్డ్ క్రియేట్ చేసిన పుష్ప ఇప్పుడు మరికొన్ని రికార్డులను అందుకుంది.
పుష్ప 2 నాలుగు రోజుల్లో రూ. 829 కోట్ల గ్రాస్ కలెక్షన్లతో భారతీయ సినిమా ఇండస్ట్రీ చరిత్రలో మరో సరికొత్త రికార్డును నెలకొల్పింది. ఈ సినిమా డే 1 నుంచి డే 4 వరకు ప్రతి రోజూ పరిశ్రమ స్థాయిలో అత్యధిక వసూళ్ల రికార్డులు నమోదు చేసింది. దాదాపు అన్ని భాషల్లో అద్భుతమైన రిజల్ట్ ను పొందిన ఈ చిత్రం, ముఖ్యంగా హిందీ బాక్సాఫీస్ వద్ద బ్రహ్మాండమైన విజయాన్ని సాధించింది. హిందీ వెర్షన్ తొలి నాలుగు రోజుల్లోనే రూ. 291 కోట్లు వసూలు చేయడం విశేషం.
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ మరియు డైరెక్టర్ సుకుమార్ కాంబినేషన్ ఈ చిత్రానికి ప్రధాన ఆకర్షణగా నిలిచింది. రోజుకు రోజుకు పెరుగుతున్న పాపులారిటీతో, ఈ సినిమా థియేటర్లలో అడుగు పెట్టిన ప్రతీ ఆడియన్స్‌ను ఆకట్టుకుంటోంది. ఇక హయ్యెస్ట్ ఫస్ట్ వీకెండ్ గ్రాస్ కలెక్షన్స్"లో పుష్ప 2 అగ్రస్థానంలో నిలిచింది. బాహుబలి 2, కెజిఎఫ్ ఛాప్టర్ 2, పఠాన్ వంటి చిత్రాలను వెనక్కి నెట్టి, తనదైన మార్క్‌ను సృష్టించింది.
నాలుగు రోజుల్లోనే రూ. 800 కోట్ల మార్క్‌ను దాటిన తొలి సినిమా గౌరవం పుష్ప 2కి దక్కింది. మొదటి 4 రోజుల్లో అత్యధిక కలెక్షన్స్ అందికున్న సినిమాల.నెంబర్లు ఈ విధంగా ఉన్నాయి.
పుష్ప 2: 829 కోట్లు
కల్కి : 555 కోట్లు
KGF 2: 546 కోట్లు
పఠాన్ : 543 కోట్లు
బాహుబలి 2: 540 కోట్లు
ఆదివారం రోజున హిందీ బాక్సాఫీస్ వద్ద ఈ చిత్రం రూ. 86 కోట్లు వసూలు చేసింది. ఇది సాధారణ రోజుల్లో, పండుగలు లేకుండా వచ్చిన ఓపెనింగ్ వీకెండ్ రికార్డుగా నిలిచింది. ఇది తెలుగు సినిమా స్థాయిని మరింత పెంచిన సినిమా అనే చెప్పొచ్చు. పుష్ప 2: ది రూల్ ఒక చారిత్రక బ్లాక్‌బస్టర్. నాలుగు రోజుల్లోనే ప్రపంచవ్యాప్తంగా రూ. 829 కోట్ల గ్రాస్ కలెక్షన్లను సాధించి, ఈ చిత్రం ఆల్ టైమ్ రికార్డులను తిరగరాసింది. ఇది కేవలం సినిమా కాదు, ఒక జాతర లాంటి విజయాన్ని సాధించింది.