పుష్ప 2: కోలీవుడ్ టాప్ రికార్డులలో పుష్ప స్థానం ఎంత?

అల్లు అర్జున్ నటించిన పుష్ప 2: ది రూల్ సినిమా తెలుగు, తమిళ సహా పాన్ ఇండియా స్థాయిలో రికార్డులు సృష్టిస్తోంది.

Update: 2024-12-11 11:20 GMT

అల్లు అర్జున్ నటించిన పుష్ప 2: ది రూల్ సినిమా తెలుగు, తమిళ సహా పాన్ ఇండియా స్థాయిలో రికార్డులు సృష్టిస్తోంది. సుకుమార్ దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రం అందరి అంచనాలను దాటుకుని, బాక్సాఫీస్ వద్ద కొత్త బెంచ్‌మార్క్‌లను ఏర్పాటు చేసింది. ముఖ్యంగా తమిళనాడులో ఈ సినిమా సాధించిన కలెక్షన్స్ ప్రత్యేకంగా చర్చనీయాంశమవుతున్నాయి. తమిళనాడులో రికార్డు స్థాయి కలెక్షన్లు సాధించిన తొలి నాన్ రాజమౌళి చిత్రంగా నిలిచింది.

సాధారణంగా తమిళంలో ఇతర ఇండస్ట్రీలోని సినిమాలు అంతగా క్లిక్కవ్వవు అనే కామెంట్స్ వస్తుంటాయి. కానీ అల్లు అర్జున్ క్రేజ్ ద్వారా ఇప్పుడు వారి అంచనాలు తలక్రిందులుగా మారాయి. తాజాగా విడుదలైన సమాచారం ప్రకారం, పుష్ప 2 తమిళనాడులో రూ. 50 కోట్లకు పైగా గ్రాస్ సాధించిన తొలి నాన్-రాజమౌళి చిత్రం. ఇది మిగిలిన భాషల సినిమాలకు మరింత స్ఫూర్తిగా నిలుస్తుంది. ఈ ఫీట్‌తో, ఈ సినిమా అక్కడి ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుందనడానికి నిదర్శనం.

తమిళంలో అత్యధిక కలెక్షన్లు రాబట్టిన ఇతర ఇండస్ట్రీ సినిమాలు

మంజుమ్మెల్ బాయ్స్: 64.10 కోట్లు

పుష్ప 2: ది రూల్: 46.25 కోట్లు

కల్కి 2898 ఎడి: 43.5 కోట్లు

గాడ్జిల్లా వర్సెస్ కోంగ్: 35 కోట్లు

లక్కీ భాస్కర్: 16.3 కోట్లు

డెడ్‌పూల్ అండ్ వుల్వరిన్: 16.25 కోట్లు

ఆవేశం: 10.75 కోట్లు

ఇతర భాషల సినిమాల మధ్య పుష్ప 2 సాధించిన స్థానం తమిళనాడులో ఓ పెద్ద విజయంగా చెప్పుకోవచ్చు. ఈ రికార్డును అందుకోవడానికి కారణం సినిమా కథనమే కాకుండా అల్లు అర్జున్ మాస్ పర్‌ఫార్మెన్స్, సుకుమార్ విజన్, రష్మిక మందన్నా, ఫహద్ ఫాజిల్, జగపతిబాబు వంటి కీలక పాత్రల నటన. అలాగే మైత్రీ మూవీ మేకర్స్ భారీ నిర్మాణ విలువలు కూడా ముఖ్య పాత్ర పోషించాయి.

ఇక వరల్డ్ వైడ్ గా ఇప్పటికే ఈ సినిమా 1000 కోట్లను దాటింది. సినిమా విడుదలైనప్పటి నుంచి పుష్ప 2 దేశవ్యాప్తంగా ప్రేక్షకులను థియేటర్లకు రప్పించడంలో విశేషంగా రాణిస్తోంది. తమిళనాడులో సుకుమార్ దర్శకత్వం నైపుణ్యాన్ని పొగుడుతూ, కథనంలో అన్ని వర్గాల ప్రేక్షకులను ఆకట్టుకునే అంశాలను చేర్చినట్లు కామెంట్స్ వస్తున్నాయి. ఇకపోతే, పుష్ప 2 సాధించిన మరో ఘనత, దేశవ్యాప్తంగా అన్ని భాషల్లోను రికార్డు స్థాయి కలెక్షన్లను రాబట్టడమే. దేశంలోని ప్రతి మూలాలో ప్రేక్షకులను ఆకట్టుకుంటూ, కోలీవుడ్ మార్కెట్లో కూడా తనదైన స్థాయిని సాధించగలిగింది.

Tags:    

Similar News