పుష్ప 2: తమిళ్ పరిస్థితి ఎలా ఉంది?

శని, ఆదివారం కూడా ఇదే రేంజ్ కలెక్షన్స్ ఉంటే మాత్రం కచ్చితంగా 800 కోట్లు దాటేస్తుందని అనుకుంటున్నారు.

Update: 2024-12-08 04:22 GMT

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ‘పుష్ప 2’ మూవీకి థియేటర్స్ లో సూపర్ రెస్పాన్స్ వస్తోన్నట్లు కనిపిస్తోంది. రెండు రోజుల్లోనే ఈ సినిమా 500 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ అందుకొని సరికొత్త రికార్డ్ సృష్టించింది. మొదటి రోజు ఏకంగా 294 కోట్ల కలెక్షన్స్ తో ఫస్ట్ డే హైయెస్ట్ గ్రాస్ మూవీగా నిలిచింది. ఇండస్ట్రీ రికార్డులన్నింటిని ఈ చిత్రం బ్రేక్ చేస్తూ దూసుకుపోతోంది. శని, ఆదివారం కూడా ఇదే రేంజ్ కలెక్షన్స్ ఉంటే మాత్రం కచ్చితంగా 800 కోట్లు దాటేస్తుందని అనుకుంటున్నారు.

‘పుష్ప 2’కి ప్రీమియర్స్ తో పాటు మొదటి రోజు తెలుగు రాష్ట్రాలలో మంచి రెస్పాన్స్ వచ్చింది. అయితే ఫస్ట్ డే తో పోల్చుకుంటే రెండో రోజుకి తెలుగు రాష్ట్రాలలో 50 శాతం ఆక్యుపెన్సీ తగ్గినట్లు తెలుస్తోంది. ఆయిన కూడా టికెట్ ధరలు ఎక్కువగా ఉండటంతో మంచి కలెక్షన్స్ ని అందుకోలుగుతుంది. తెలుగు రాష్ట్రాల కంటే నార్త్ ఇండియాలో సినిమాకి ఎక్కువ ఆదరణ లభిస్తోంది. అక్కడ ప్రేక్షకులు ఎగబడి సినిమా చూస్తున్నారంట.

ఇక తమిళనాడులో కూడా ‘పుష్ప 2’ చిత్రానికి మొదటి రోజు ఏకంగా 11 కోట్ల కలెక్షన్స్ వచ్చాయి. తమిళంలో ఇప్పటి వరకు ఒక డబ్బింగ్ సినిమాకి అయిన ఇవే అత్యధిక ఫస్ట్ డే కలెక్షన్స్ అని తెలుస్తోంది. అక్కడ సినిమాకి సినీ విశ్లేషకుల ముంచి మిశ్రమ సమీక్షలు వచ్చాయి. అయిన కూడా ప్రజలు బాగా ఆదరిస్తున్నారు. మొదటి రోజు కంటే రెండో రోజు సినిమాకి ఎక్కువ రెస్పాన్స్ వచ్చింది. ఏకంగా 80 శాతం థియటర్స్ ఆక్యుపెన్సీ నమోదు అయినట్లు ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి.

‘కంగువా’ సినిమా కంటే ‘పుష్ప 2’కి తమిళనాట ఎక్కువ ఆదరణ లభిస్తోంది. ఇంకా చెప్పాలంటే తెలుగు రాష్ట్రాలలో ఒరిజిల్ వెర్షన్ కంటే తమిళ్, హిందీ భాషలలో సూపర్ రెస్పాన్స్ వస్తోందనే మాట వినిపిస్తోంది. తమిళనాడులో కూడా ఈ మూవీ భారీ కలెక్షన్స్ కొల్లగొట్టే అవకాశాలు ఉన్నాయని అంటున్నారు. అలాగే నార్త్ ఇండియాలో డబ్బింగ్ సినిమాల రికార్డ్స్ అన్ని కూడా ఈ మూవీ బ్రేక్ చేసేలా ఉందని ట్రేడ్ పండితులు అంటున్నారు.

ముఖ్యంగా సినిమాలోని ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ పెర్ఫార్మెన్స్ కి ప్రేక్షకులు ఫిదా అయిపోయారు. సెకెండాఫ్ లో గూస్ బాంబ్ ఎలిమెంట్స్ కూడా ప్రేక్షకులని కట్టిపడేస్తున్నాయి. జాతర ఎపిసోడ్ సినిమా మొత్తానికి హైలైట్ గా నిలిచిందనే మాట వినిపిస్తోంది. అలాగే క్లైమాక్స్ ఫైట్ సీక్వెన్స్ కూడా మాస్ ర్యాంపేజ్ లా ఉందని అంటున్నారు.

Tags:    

Similar News