ఏకంగా హాలీవుడ్ బ్లాక్ బస్టర్ ని దాటేసిన పుష్ప 2

ఇదిలా ఉంటే సినిమా రిలీజ్ కి ముంది 1000 కోట్ల కలెక్షన్స్ ని ‘పుష్ప 2’ అందుకునే అవకాశం ఉండకపోవచ్చని సందేహాలు వ్యక్తం చేశారు.

Update: 2024-12-09 04:30 GMT

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ‘పుష్ప 2’ చిత్రానికి ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకులు బ్రహ్మరథం పడుతున్నారు. అల్లు అర్జున్ హైవోల్టేజ్ పెర్ఫార్మెన్స్, సుకుమార్ రైటింగ్ కి ఆడియన్స్ బాగా కనెక్ట్ అయ్యారు. అందుకే సినిమాకి అద్భుతమైన కలెక్షన్స్ వస్తున్నాయి. వారాంతానికి ఈ మూవీ కలెక్షన్స్ 800 కోట్లు క్రాస్ అవుతాయని ట్రేడ్ పండితులు అంచనా వేస్తున్నారు. తక్కువ సమయంలో వేగంగా 1000 కోట్ల క్లబ్ లో సినిమాగా ఈ మూవీ చరిత్ర సృష్టించే అవకాశం ఉందని అనుకుంటున్నారు.

ఇదిలా ఉంటే సినిమా రిలీజ్ కి ముంది 1000 కోట్ల కలెక్షన్స్ ని ‘పుష్ప 2’ అందుకునే అవకాశం ఉండకపోవచ్చని సందేహాలు వ్యక్తం చేశారు. అయితే కేవలం 4 రోజుల్లోనే 600 కోట్ల కలెక్షన్స్ అందుకోవడం ద్వారా అందరి సందేహాలకి ఫుల్ స్టాప్ పెట్టేసింది. యూఎస్ లో కూడా ఈ సినిమాకి అద్భుతమైన కలెక్షన్స్ వస్తున్నాయి. నార్త్ అమెరికాలోనే ఈ మూవీ నాలుగు రోజుల్లో 8 మిలియన్ డాలర్స్ కలెక్షన్స్ ని సాధించింది.

దీనిని బట్టి సినిమాకి స్పందన ఏ స్థాయిలో ఉందో అర్ధం చేసుకోవచ్చు. ఇదిలా ఉంటే క్రిస్టోఫర్ నోలన్ దర్శకత్వంలో తెరకెక్కిన హాలీవుడ్ మూవీ ‘ఇంటర్ స్టెల్లర్ తాజాగా రీరిలీజ్ అయ్యింది. అయితే ‘పుష్ప 2’ని వదులుకొని ‘ఇంటర్ స్టెల్లర్’ సినిమాకి ఐమ్యాక్స్ థియేటర్స్ ఇవ్వడానికి ఎవరూ ముందుకి రాలేదు. దీంతో ఆ మూవీ ఇండియాలో రిలీజ్ వాయిదా పడింది. అయితే యూఎస్ లో మాత్రం గ్రాండ్ గానే రీరిలీజ్ అయ్యింది.

అయితే యూఎస్ లో ‘ఇంటర్ స్టెల్లర్’ కంటే ‘పుష్ప 2’ కలెక్షన్స్ అధికంగా ఉన్నాయనే మాట వినిపిస్తోంది. బాక్సాఫీస్ మోజో లెక్కలు ఈ విషయాన్ని ధృవీకరించాయి. ‘పుష్ప 2’ ప్రస్తుతం నార్త్ అమెరికా బాక్సాఫీస్ ర్యాంకింగ్స్‌లో నాల్గవ స్థానంలో ఉందని తెలుస్తోంది. దీనికంటే ముందు ‘మోనా 2’, ‘వికెడ్’ ‘గ్లాడియేటర్ 2’ ఉన్నాయి. పుష్ప 2 మూవీ 1,245 థియేటర్‌లలో $1,700,000 కలెక్షన్స్ అందుకుంది. ‘ఇంటర్‌స్టెల్లర్’ మూవీ 165 మల్టీప్లెక్స్ స్క్రీన్స్ నుండి $1,370,000 కలెక్ష్ చేసింది.

కేవలం ఐమాక్స్ థియేటర్స్ లలో మాత్రమే ‘ఇంటర్ స్టెల్లర్’ సినిమాని రీరిలీజ్ చేశారు. ఈ కలెక్షన్స్ బట్టి ‘పుష్ప 2’కి నార్త్ అమెరికాలో ఏ స్థాయిలో ఆదరణ వస్తుందో అంచనా వేయవచ్చు. అక్కడ ఏకంగా హాలీవుడ్ సినిమాలతో మన తెలుగు సినిమా కలెక్షన్స్ పరంగా పోటీ పడుతోందని అనుకుంటున్నారు.

Tags:    

Similar News