పుష్ప ఫైల్డ్ ఫైర్… సుక్కు గట్టిగానే సెట్ చేశాడు
అయితే సుకుమార్ మరోసారి ఈ సినిమాతో ఏదో మ్యాజిక్ చేయబోతున్నాడని ట్రైలర్ చూస్తుంటే అర్ధమవుతోంది.
ఐకాన్ స్టార్ స్టార్ అల్లు అర్జున్ నుంచి రాబోయే ‘పుష్ప 2’ కోసం దేశం వ్యాప్తంగా అతని ఫ్యాన్స్ వెయిట్ చేస్తున్నారు. వరల్డ్ వైడ్ గా ఈ సినిమాపై భారీ అంచనాలు క్రియేట్ అయ్యి ఉన్నాయి. దానికి తగ్గట్లుగానే తాజాగా రిలీజ్ అయిన మూవీ ట్రైలర్ కి అదిరిపోయే రెస్పాన్స్ వచ్చింది. ‘పుష్ప 2’ ట్రైలర్ ఎలా ఉండబోతుందా అనే ఆసక్తి అందరిలో నెలకొని ఉంది. అయితే సుకుమార్ మరోసారి ఈ సినిమాతో ఏదో మ్యాజిక్ చేయబోతున్నాడని ట్రైలర్ చూస్తుంటే అర్ధమవుతోంది.
ట్రైలర్ రిలీజ్ తర్వాత మూవీపై ఎక్స్ పెక్టేషన్స్ మరింత పెరిగిపోయాయి. పాన్ ఇండియా మార్కెట్ ని దృష్టిలో ఉంచుకొని కంటెంట్ స్పాన్ కూడా పెంచినట్లు ట్రైలర్ చూస్తుంటే తెలుస్తోంది. ఇదిలా ఉంటే ట్రైలర్ తోనే సుకుమార్ తన విజన్ ఎలా ఉండబోతోందనేది స్పష్టంగా చెప్పేసాడు. ప్రతి ఫ్రేమ్ తో కూడా ఓ ఇంటరెస్టింగ్ కథని సుకుమార్ నేరేట్ చేసే ప్రయత్నం చేసాడు. పోస్టర్స్ తో కూడా స్టోరీ చెప్పడం సుకుమార్ స్టైల్.
అలాగే ట్రైలర్ లో ఫ్రేమ్స్, షాట్స్ తో కూడా ‘పుష్ప 2’ కథ ఎలా ఉండబోతోందనేది సుకుమార్ చెప్పడం ఆసక్తికరంగా మారింది. ఇప్పుడు వైల్డ్ ఫైర్ అంటూ ట్రైలర్ లోనే షాట్ ఫ్రేమ్స్ ని ఫ్యాన్స్ సోషల్ మీడియాలో వైరల్ చేస్తున్నారు. ఈ మధ్య కాలంలో ట్రైలర్ బ్రేక్ డౌన్ అంటూ ట్రైలర్స్ లో ఫ్రేమ్స్ వెనుక ఉన్న కాన్సెప్ట్ ఏంటనేది కూడా కొంతమంది సినీ ప్రియులు చెబుతున్నారు. అలాగే ‘పుష్ప’ ట్రైలర్ బ్రేక్ డౌన్ చేసి అందులో సుకుమార్ పెట్టిన ఒక్కో ఫ్రేమ్ చెబుతున్న కథ గురించి చెబుతున్నారు.
ఈ ఫ్రేమ్స్ చాలా ఇంటెన్సివ్ గా ఉండటం విశేషం. వీటిలో పుష్పరాజ్ క్యారెక్టర్ ఎలివేషన్ పై పెట్టిన ఫ్రేమ్స్ అయితే పర్ఫెక్ట్ సుకుమార్ విజన్ న చెబుతున్నాయని అంటున్నారు. గంగమ్మ తల్లి జాతరలో అమ్మవారి గెటప్ లో చేసే ఫైట్ సీక్వెన్స్ లో చీరకట్టుకొని ఉన్న బన్నీ లుక్ అందరిని ఎట్రాక్ట్ చేసింది. అలాగే రష్మిక పాదాలు పట్టుకొని పుష్పరాజ్ గడ్డం దగ్గర పెట్టుకోవడం క్యారెక్టర్ డెప్త్ ని చూపిస్తుంది.
పుష్పరాజ్ ముందు నడుచుకొని వెళ్తూ ఉంటే వెనుక గ్యాంగ్ మొత్తం రావడంతో పాటు, మాలధారణలో ఉన్న గెటప్ ఇలా చాలా వరకు మూవీపై అటెన్షన్ క్రియేట్ చేస్తున్నాయి. వైల్డ్ ఫైర్ ని చాలా వైడ్ గా సుకుమార్ చెప్పబోతున్నాడని, దీనికి కాస్తా దేవుడి సెంటిమెంట్ కూడా మిక్స్ చేసినట్లు ట్రైలర్ లో ఉన్న షాట్స్, ఫ్రేమ్స్ బట్టి అర్ధమవుతోంది.