పుష్ప 2.. ఇది నిజమైతే కిక్కే కిక్కు

ఇక డిసెంబర్ 4న యూఎస్ఏలో ప్రీమియర్స్ ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది. అంటే డిసెంబర్ 5న ఇండియాలో రిలీజ్ అవుతుందని అర్ధమవుతుంది.

Update: 2024-10-11 08:17 GMT

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, సుకుమార్ కాంబినేషన్లో తెరకెక్కుతున్న పాన్ ఇండియా మూవీ 'పుష్ప: ది రూల్' ఇప్పటికే అభిమానుల్లో విపరీతమైన అంచనాలు పెంచేసింది. ఎప్పుడో ఆగస్టు 15న రిలీజ్ కావాల్సిన ఈ సినిమా అనేక కారణాల వలన డిసెంబర్ 6కి జంప్ అయ్యింది, అయినప్పటికీ మళ్ళీ పలు కారణాలతో విడుదల తేదీ వాయిదా పడే ప్రమాదం ఉందని టాక్ వచ్చింది.

కానీ అందులో నిజం లేదని మైత్రి వారు ఎదో ఒక అప్డేట్ తో డిసెంబర్ 6కి రావడం పక్కా అని ఒక క్లారిటీ ఇస్తున్నారు. ఇక తాజా సమాచారం ప్రకారం మరో కిక్కిచ్చే విషయం ఏమిటంటే.. డిసెంబర్ 5ని చిత్ర యూనిట్ విడుదల తేదీగా లాక్ చేసిందని తెలుస్తోంది. ఆ వివరాల్లోకి వెళితే. దేశ వ్యాప్తంగా భారీగా అభిమానులను సంపాదించుకున్న ఈ ఫ్రాంచైజీ, ఇప్పుడు రెండో భాగం మీద భారీ అంచనాలు పెంచుకుంది.

సినిమా అన్ని ప్రధాన భాషల్లో విడుదల కానుంది, అందులో కూడా పాన్ ఇండియా లెవెల్‌లో ఈ చిత్రం బాక్సాఫీస్‌ రికార్డులను సెట్ చేయడానికి సిద్ధంగా ఉందని చెప్పవచ్చు. ఇక డిసెంబర్ 4న యూఎస్ఏలో ప్రీమియర్స్ ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది. అంటే డిసెంబర్ 5న ఇండియాలో రిలీజ్ అవుతుందని అర్ధమవుతుంది.

ఈ విడుదల డేట్ వలన మరే పెద్ద చిత్రాల పోటీ ఉండకుండా, పుష్పకు ప్రీమియర్ లార్జ్ ఫార్మాట్‌ PLF ప్రదర్శనలతో మంచి వసూళ్లు వచ్చే అవకాశముంది. ప్రత్యేకంగా క్రిస్మస్ సీజన్ ముందు దాదాపు రెండు వారాలపాటు సినిమా బాక్సాఫీస్ వద్ద భారీ వసూళ్లు సాధించేలా ఉండబోతోంది. ఇప్పటికే పుష్ప ఫ్రాంచైజీకి భారీ ఫ్యాన్ బేస్ ఉన్న కారణంగా, ఈ సినిమాకు సంబంధించిన పాటలు కూడా ట్రెండింగ్‌లో ఉన్నాయి. ఈ క్రమంలో డిసెంబర్ 5న రిలీజ్ డేట్ లాక్ చేయడం ఫ్యాన్స్‌కి మూడ్ ఎలివేటింగ్‌ న్యూస్‌గా మారింది.

సుకుమార్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో అల్లు అర్జున్ తో పాటు రష్మిక మందన్నా, ఫహద్ ఫాసిల్ వంటి ప్రముఖ నటులు కీలక పాత్రల్లో కనిపించబోతున్నారు. ఈ సినిమాలో అల్లు అర్జున్ లుక్ పై భారీ అంచనాలున్నాయి. ఇంకా, ఫహద్ ఫాసిల్ ప్రధాన పాత్రలో ప్రతినాయకుడిగా చేసే సన్నివేశాలు సినిమాకు ప్రధాన ఆకర్షణగా నిలుస్తాయని టాక్ వినిపిస్తోంది.

ఇక ఈ సినిమా మ్యూజిక్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. దేవీ శ్రీ ప్రసాద్ అందిస్తున్న సంగీతం ఇప్పటికే ట్రెండింగ్‌లో ఉంది. మొదటి భాగం 'పుష్ప: ది రైజ్' లోని 'శ్రీవల్లి' పాట వంటి పాటలు ఎంతటి సెన్సేషన్ క్రియేట్ చేసాయో మనందరికీ తెలిసిందే. రెండో భాగం 'పుష్ప: ది రూల్' లో కూడా పాటలు, బీజీఎం ప్రేక్షకులను అలరిస్తాయని మ్యూజిక్ లవర్స్ అంచనా వేస్తున్నారు.

Tags:    

Similar News