రాధికా - అనంత్ అంబానీ 2024 మోస్ట్ స్టైలిష్ క‌పుల్

రాధిక మర్చంట్ - అనంత్ అంబానీ జంట వివాహం ఈ ఏడాది అత్యంత ఖ‌రీదైన వివాహాల‌లో ఒక‌టి.

Update: 2024-12-06 08:21 GMT

రాధిక మర్చంట్ - అనంత్ అంబానీ జంట వివాహం ఈ ఏడాది అత్యంత ఖ‌రీదైన వివాహాల‌లో ఒక‌టి. ఈ పెళ్లి కోసం అంబానీలు దాదాపు 2000 కోట్లు ఖ‌ర్చు చేసార‌ని మీడియాలో క‌థ‌నాలొచ్చాయి. 2024లో అత్యంత చర్చనీయాంశమైన వివాహాలలో ఇది ఒకటి. కొత్త‌ జంట ఏడాది పొడవునా పెళ్లి సంబ‌రాల కార‌ణంగా ... అలాగే యూనిక్ ఫ్యాషన్ సెన్స్ కారణంగా హెడ్ లైన్స్ లో నిలిచారు.


`ది న్యూయార్క్ టైమ్స్` డిసెంబర్ 5న విడుదల చేసిన ప్రచురణలో అంబానీ కుటుంబానికి చెందిన ఛోటీ బాహు అయిన రాధికా మర్చంట్- అనంత్ అంబానీ జంట‌ను 63 మంది అత్యంత స్టైలిష్ పీపుల్- 2024 జాబితాలో చేర్చిన‌ట్టు పేర్కొంది. న్యూయార్క్ టైమ్స్ ఈ జంటను వ‌ర్ణిస్తూ...``ఒక రెడ్ కార్పెట్... అంద‌మైన‌ పచ్చలు`` అని రాసింది. టైమ్స్ ప్రతిష్టాత్మక జాబితాలో రాధిక, అనంత్ చోటు ద‌క్కించుకోవ‌డంతో పాటు ఇతర ప్ర‌ముఖుల పేర్లు వినిపించాయి. ఇందులో హసన్ మిన్హాజ్, బియాన్స్, అడెలె, చార్లీ XCX, కోల్మన్ డొమింగో, డేనియల్ క్రెయిగ్, డెమీ మూర్, చాపెల్ రోన్, నికోలా కొగ్లన్, సింథియా ఎరివో, అరియానా గ్రాండే, జెండ‌యా త‌దిత‌రులు ఉన్నారు.

స్వ‌దేశంలోనే అంబానీల పెళ్లి బోలెడంత సంద‌డిగా సాగింది. విదేశాల‌కు ప‌య‌న‌మైన నౌక‌లో వారి విందు వినోదాలు ప్ర‌ధానంగా మీడియా హెడ్ లైన్స్ లోకొచ్చాయి. ముంబయిలోని బాంద్రా-కుర్లాలోని జియో వరల్డ్ కన్వెన్షన్ సెంటర్‌లో 2024 జూలై 10-12 వరకు మూడు రోజుల పాటు ఘనంగా జరిగిన పెళ్లి వేడుకలో వీరేన్ - శైలజా మర్చంట్ ల‌ కుమార్తె రాధిక మర్చంట్ .. ముఖేష్ -నీతా అంబానీల కుమారుడు అనంత్ అంబానీ వివాహం చేసుకున్నారు. ఈ వివాహానికి కిమ్ కర్దాషియాన్ -ఖోలే కర్దాషియాన్‌లతో పాటు దేశ‌విదేశాల నుండి ప్రభావవంతమైన బ్యూరోక్రాట్‌లు, ఇత‌ర రంగాల ప్రముఖులు హాజరయ్యారు.

Tags:    

Similar News