రాధిక.. మరోసారి టిల్లు మోత మొదలైంది
యంగ్ టాలెంటెడ్ హీరో సిద్ధు జొన్నలగడ్డ డీజే టిల్లుతో ఏ స్థాయిలో సక్సెస్ అందుకున్నాడో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు
యంగ్ టాలెంటెడ్ హీరో సిద్ధు జొన్నలగడ్డ డీజే టిల్లుతో ఏ స్థాయిలో సక్సెస్ అందుకున్నాడో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఆ ఒక్క సినిమాతోనే అతను కెరీర్ యూ టర్న్ తీసుకుంది. అంతకుముందు వరకు అప్పుడప్పుడు సైడ్ క్యారెక్టర్లు కూడా చేసుకుంటూ వచ్చిన అతను టిల్లు క్యారెక్టర్ క్లిక్ కావడంతో సక్సెస్ ఫుల్ స్టార్‌గా మారాడు. ఈ చిత్రం పాత్రకు మరియు అతని కూడా కల్ట్ ఫాలోయింగ్ సంపాదించింది. ఇక ఇప్పుడు అదే ఎనర్జితో సీక్వెల్ తో సిద్ధం అవుతున్నాడు.
టిల్లు సినిమా క్యారెక్టర్ ని కొనసాగిస్తూ టిల్లు స్క్వేర్ రాబోతున్న సిద్దు ప్రమోషన్స్ తోనే సినిమాకు మంచి హైప్ క్రియేట్ చేస్తున్నాడు. మల్లిక్ రామ్ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో మరియుగ్లామరస్ క్యూట్ టాలెంటెడ్ హీరోయిన్ అనుపమ పరమేశ్వరన్ కథానాయికగా నటిస్తోంది. ఇదివరకే వీరికి సంబంధించిన ఒక సాంగ్ కూడా క్లిక్ అయ్యింది. ఇక పోస్టర్స్ తో కూడా మంచి హైప్ క్రియేట్ చేస్తున్నారు.
ఇప్పటికే విడుదలైన మొదటి సింగిల్ "టికెట్ ఎహ్ లేకున్నా" లో అనుపమ గ్లామరస్ అవతార్ లో కనిపించి టాక్ ఆఫ్ ది టౌన్ గా మారింది. ఇక రెండవ సింగిల్‌లో ఆమె మరియు టిల్లు, సిద్ధు జొన్నలగడ్డ కూడా ఒక ఎనర్జిటిక్ బీట్‌తో మరింత బజ్ క్రియేట్ చేసే ప్రయత్నం చేస్తున్నారు. "రాధిక" పాట ఆకట్టుకునే విధంగా ఎట్రాక్ట్ చేసే బీట్ తో హైలెట్ అవుతోంది ఉంది.
రామ్ మిరియాల ఈ డిఫరెంట్ పాటను కంపోజ్ చేసి, పాడారు. కాస్రాల శ్యామ్ సాహిత్యం రాశారు. ఇక పాటలో హీరో హీరోయిన్ కెమిస్ట్రీ మరింత హైలెట్ అవుతోంది. రాధిక అనే పేరు ఇప్పటికి సోషల్ మీడియాలో ఒక ట్రెండ్. ఇక అదే ట్యాగ్ తో ఇప్పుడు పాటను క్రియేట్ చేసి ట్రెండ్ అయ్యేలా చేస్తున్నారు. ఈ పాట ఖచ్చితంగా సంవత్సరంలోని టాప్ 10 చార్ట్‌బస్టర్‌లు అనేక ప్లేలిస్ట్‌లలో చోటు దక్కించుకుంటుందని చిత్ర యూనిట్ నమ్ముతోంది.
ఇక సితార ఎంటర్‌టైన్‌మెంట్స్‌పై సూర్యదేవర నాగవంశీ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్ సహ నిర్మాతగా & శ్రీకరా స్టూడియోస్ ఈ చిత్రాన్ని సమర్పిస్తోంది. సాయి ప్రకాష్ ఉమ్మడిసింగు సినిమాటోగ్రఫీ అందిస్తున్న ఈ చిత్రానికి నవీన్ నూలి ఎడిటింగ్ అందిస్తున్నారు. ఇక ఫైనల్ గా టిల్లు స్క్వేర్ 2024 ఫిబ్రవరి 9న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది.