తొలి సినిమా అనుభ‌వం.. సెట్లో హీరోకి కుర్చీ వేయ‌లేద‌ట‌

ఇది నిజంగా తీర‌ని అవ‌మానంగా భావించిన స‌ద‌రు న‌టుడు ఆ త‌ర్వాత ఆన్ లొకేష‌న్ కి త‌న కుర్చీ తానే తెచ్చుకునేవాడు.

Update: 2024-09-11 02:45 GMT

సినిమా సెట్లో చిత్ర క‌థానాయ‌కుడికి తీర‌ని అవమానం జ‌రిగింది. అత‌డికి నిర్మాత‌లు క‌నీసం కుర్చీ వేసేందుకు కూడా నిరాక‌రించారు. అత‌డు ఎక్క‌డో ఫుట్ పాత్ మీద‌నో పేవ్ మెంట్ మీద‌నో కూచోవాల్సిన దుస్థితి. ఇది నిజంగా తీర‌ని అవ‌మానంగా భావించిన స‌ద‌రు న‌టుడు ఆ త‌ర్వాత ఆన్ లొకేష‌న్ కి త‌న కుర్చీ తానే తెచ్చుకునేవాడు. అందుకు సంబంధించిన ఏర్పాట్లు ఇప్ప‌టికీ తానే చేసుకుంటాడ‌ట‌.

చాలా ఆశ్చ‌ర్యంగా అనిపించినా కానీ ఇది నిజం. వెట‌ర‌న్ న‌టుడు రాహుల్ బోస్ కి ఇలాంటి అనుభ‌వం ఎదురైంది. అత‌డు తన తొలి సినిమా సెట్‌లో ఉన్న‌ప్పుడు తనకు కుర్చీ వేసేందుకు నిరాకరించారని, నిర్మాత అతడి బంధువులకు మాత్రం కుర్చీలు ఉన్నాయ‌ని తెలిపారు. భవిష్యత్తులో ఇలాంటి అవమానాన్ని ఆప‌డానికి అత‌డు తన సొంత కుర్చీని సెట్స్ కి తీసుకురావడం ప్రారంభించాడు. ఇంగ్లీష్ -ఆగస్టు చిత్రాలతో న‌టుడుగా పాపుల‌రైన బోస్ ఇప్పుడు `బెర్లిన్` అనే చిత్రాన్ని ప్రమోట్ చేస్తున్నారు. సెప్టెంబర్ 13న జీ5లో ఇది విడుదల కానుంది.

రాహుల్ బోస్ తన మొదటి చిత్రం గురించిన అనుభ‌వాన్ని షేర్ చేసాడు. తాను ప్ర‌ధాన న‌టుడే అయినా కానీ సెట్లో కుర్చీ లేక‌ నిలబడవలసి వ‌చ్చింద‌ని తెలిపాడు. ది లాలాంటాప్‌తో మాట్లాడుతూ రాహుల్ ఈ అనుభవం గురించి వెల్ల‌డించాడు. సినిమాలో కథానాయిక లేకుండా నేరుగా స్టేజీ డ్రామా నుండి వెండితెర‌ ప్రధాన పాత్రకు మారిన అతడు తరచూ రోడ్డు డివైడర్లు లేదా పారాపెట్‌లపై కూర్చున్నాన‌ని తెలిపాడు. ఆ స‌మ‌యంలో నిర్మాత, అతడి సోదరి, మామయ్య అందరికీ కుర్చీలు ఉన్నాయని రాహుల్ బోస్ పేర్కొన్నాడు. సెట్ కి కుర్చీతో పాటు రాహుల్ బోస్ తన స్వంత వ్యక్తిని తీసుకురావడం ద్వారా అన్నిటికీ స‌మాధాన‌మివ్వాల‌నుకున్నాడు. దాదాపు 30 ఏళ్ల క్రితం రూ. 10,000 ఖరీదు చేసే కుర్చీ కొనుక్కున్నాడ‌ట‌. అప్పటి నుండి ఆ అవమానాన్ని పునరావృతం చేయకుండా ఉండటానికి అతడు ఎల్లప్పుడూ తన సొంత కుర్చీని తెచ్చుకున్నాడు.

రాహుల్ బోస్ తన నటనా జీవితాన్ని 1990ల చివరలో విమర్శకుల ప్రశంసలు పొందిన చిత్రం `ఇంగ్లీష్`తో ఆగస్టు 1994న‌ ప్రారంభించాడు. దేవ్ బెనెగల్ దర్శకత్వంలో అగస్త్యసేన్ పాత్రను పోషించాడు. ప్రస్తుతం `బెర్లిన్`ను ప్రమోట్ చేస్తున్నాడు. ఇది సెప్టెంబర్ 13న జీ5లో ప్రీమియర్ అవుతుంది. అతుల్ సబర్వాల్ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో అపర‌శ‌క్తి , ఇష్వాక్ సింగ్ ప్రధాన పాత్రలు పోషించారు.

Tags:    

Similar News