రాజ్ తరుణ్- లావణ్య.. నెక్స్ట్ ఏంటి?

అదే సమయంలో వివిధ సెక్షన్ల కింద కేసులు పెట్టింది. కొన్ని సాక్ష్యాలు న్యాయస్థానానికి సమర్పించింది.

Update: 2025-02-18 13:17 GMT

టాలీవుడ్ యంగ్ హీరో రాజ్ తరుణ్, లావణ్య వ్యవహారం దాదాపు ఏడాది కాలంగా సాగుతూనే ఉందన్న విషయం తెలిసిందే. తనను ప్రేమించి, పెళ్లి చేసుకుని తర్వాత మోసం చేశారని లావణ్యా ఆరోపించింది. అబార్షన్ చేయించారని ఆరోపణలు చేసింది. డ్రగ్స్ కు రాజ్ తరుణ్ కు లింక్ చేస్తూ కూడా మాట్లాడింది.

అదే సమయంలో వివిధ సెక్షన్ల కింద కేసులు పెట్టింది. కొన్ని సాక్ష్యాలు న్యాయస్థానానికి సమర్పించింది. అలా ఎప్పటికప్పుడు మీడియా ముందుకు వస్తుంది. కానీ రాజ్ తరుణ్ మాత్రం.. బయట కనిపించడం లేదని చెప్పాలి. వరుస సినిమాల్లో యాక్ట్ చేస్తున్నా.. ఈవెంట్స్ లో సందడి చేయడం లేదు. కొన్ని సందర్భాల్లో మాత్రమే కనబడ్డారు.

అయితే రీసెంట్ గా లావణ్య చేసిన కామెంట్స్ చర్చనీయాంశంగా మారిన విషయం తెలిసిందే. ఎందుకంటే ఒక్కసారిగా రాజ్ తరుణ్ కు మద్దతుగా వ్యాఖ్యలు చేయడమే కాకుండా.. కేసులు వెనక్కి తీసుకుంటానని తెలిపింది. రాజ్ తరుణ్ కాళ్లు పట్టుకుని.. క్షమాపణలు చెబుతానని చెప్పింది. దీంతో నెట్టింట జోరుగా చర్చ సాగుతోంది.

నిజంగా రాజ్ తరుణ్ పై పెట్టిన కేసులు లావణ్య వెనక్కి తీసుకుంటుందా? ఇప్పటికే చేసిన ఆరోపణల సంగతేంటి? తప్పుడు వ్యాఖ్యలు చేశానని లావణ్య ఒప్పుకుంటుందా? సాక్ష్యాలపై కోర్టుకు స్పష్టంగా వివరిస్తుందా? ఒకవేళ అవసరమైతే జైలుకు వెళుతుందా? అంటూ నెటిజన్లు ఇప్పుడు సోషల్ మీడియాలో డిస్కస్ చేసుకుంటున్నారు.

అయితే రాజ్ తరుణ్ పై పెట్టిన కేసులు వెనక్కి తీసుకోవడమనేది అంతా సులభం కాదని కొందరు నెటిజన్లు చెబుతున్నారు. ఒక్కసారి కేసు పెడితే.. న్యాయస్థానం ముందుకు ప్రొసీడ్ అవుతూనే ఉంటుందని అంటున్నారు. అదే సమయంలో నార్మల్ గా ఇద్దరి మధ్య వివాదమైతే కేసు వెనక్కి తీసుకోవచ్చని కామెంట్లు పెడుతున్నారు.

కానీ అక్కడ డ్రగ్స్ విషయం కూడా ఉందని, కాబట్టి కాస్త ఇబ్బందులు తలెత్తే అవకాశం ఉందని అభిప్రాయపడుతున్నారు. అబార్షన్ విషయంలో లావణ్య కొన్ని సాక్ష్యాలు సమర్పించిన విషయం తెలిసిందే. దీంతో న్యాయస్థానం అంత ఈజీగా కేసు కొట్టేస్తుందని చెప్పలేం. మొత్తానికి లావణ్య ఇచ్చిన స్టేట్మెంట్ తో రాజ్ తరుణ్ కు కాస్త ఊరట లభించినట్లే అయినా న్యాయపరంగా కాదు. చివరగా ఆ వ్యవహారంలో ఏం జరుగుతుందో చూడాలి.

Tags:    

Similar News